హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు! | Scarlett Johansson disappointed to be highest earning actress | Sakshi
Sakshi News home page

హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు!

Published Thu, Jul 7 2016 4:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు!

హీరోయిన్ సంపాదన రూ. 22 వేల కోట్లు!

లాస్ ఏంజెలెస్: హాలీవుడ్లో ఆల్టైమ్ అత్యధిక సంపాదనాపరులు జాబితాలో తన పేరు ఒక్కటే ఉండడం పట్ల హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత మంది హీరోయిన్లు పేర్లు ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. హాలీవుడ్లో అత్యధిక సంపాదన కలిగిన నటీమణిగా ఆమె ఘనత సాధించింది.

అత్యధిక సంపాదన కలిగిన హీరోహీరోయిన్ల పేర్లతో బాక్సాఫీస్ మొజో వెబ్సైట్ ఇటీవల రూపొందించిన టాప్-10 జాబితాలో స్కార్లెట్ జాన్సన్కు మాత్రమే స్థానం దక్కింది. 3.3 బిలియన్ డాలర్ల సంపాదన(దాదాపు రూ. 22245 కోట్లు)తో ఆమె 10వ స్థానంలో నిలిచింది. టాప్-10లో చోటు దక్కించుకున్న మహిళ ఆమె ఒక్కరే కావడం విశేషం.

దీనిపై 'ఎక్స్ ట్రా టీవీ' షోలో ఆమె స్పందించింది. 'హయ్యస్ట్ ఎర్నింగ్ నటీనటుల జాబితాలో నాకు చోటు దక్కడం ఉత్సాహకరంగానే ఉంది. ఈ లిస్ట్లో ఒక్క మహిళకే స్థానం దక్కడం అసంతృప్తి కలిగించింది. ఇది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింద'ని స్కార్లెట్ జాన్సన్ పేర్కొంది. మరో నటీమని కామెరాన్ డియాజ్ 19వ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement