
దీపికా పదుకొనేను టీజ్ చేశారు
ఈ మధ్య దీపిక పదుకొనే హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీసిల్తో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సీరియస్ లుక్లో ఓ గుండు వ్యక్తిని హగ్ చేసుకున్న దీపిక, ఒక్క ఫోటో తో తన హాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ ఫోటో ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోలే ఈ ఫోటోకు స్పూఫ్ చేయటంతో మరోసారి దీపిక మ్యాటర్ హాట్ టాపిక్గా మారింది.
బాలీవుడ్లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ లాంటి అక్షయ్ కుమార్ దీపిక పదుకొనే ఫోటోకు స్పూఫ్ చేశాడు. ప్రస్తుతం హౌస్ఫుల్ 3 షూటింగ్లో బిజీగా ఉన్న అక్షయ్ తన కోస్టార్స్ రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్లతో కలిసి విన్ డీసిల్లా అనిపించే బొమ్మతో. దీపికా దిగినట్టుగానే ఫోటో దిగారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ పేజ్పై పోస్ట్ చేసిన అక్షయ్, 'విన్ డీసిల్ దీపికతో బిజీగా ఉన్నాడు అందుకే హౌస్ఫుల్ 3ని విన్ పెట్రోల్తో చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.
Since Vin Diesel is busy with @deepikapadukone, we at #Housefull3 are making do with Vin Petrol 😛 pic.twitter.com/AlPSPPv006
— Akshay Kumar (@akshaykumar) December 8, 2015