బాలీవుడ్‌లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్‌లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్‌వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వీఎఫ్‌ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్‌లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్‌లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్‌లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment