Singham Again
-
ఓటీటీలో సడన్ సర్ప్రైజ్ 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
బాలీవుడ్ భారీ యాక్షన్ సినిమా 'సింగం అగైన్'(Singham Again). ఇది సింగం మూవీ బ్లాక్‌బస్టర్ సిరీస్‌లో మూడో భాగంగా గతేడాదిలో విడుదలైంది. భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో హిందీ వర్షన్ రన్ అవుతుంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2024 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింగం అగైన్ దాదాపు రూ.372 కోట్లు రాబట్టింది.సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి పోలీస్ కాప్ చిత్రాలతో దర్శకుడు రోహిత్‌శెట్టి ( Rohit Shetty) హిట్స్ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో సింగం అగైన్ తెరకెక్కించాడు. అయితే, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి ఆదరణ లభించింది. సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ్ వర్షన్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2011లో సింగం సినిమా రాగా దానికి సీక్వెల్‌గా 2014లో సింగం రిటర్న్స్ వచ్చింది. దశాబ్దకాలం తర్వాత దీనికి కొనసాగింపుగా సింగం అగైన్ తెరకెక్కించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి బర్సూర్,థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ వర్ధంతి.. ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళి)బాలీవుడ్ అగ్ర దర్శకుడు రోహిత్ శెట్టి... కాప్ యూనివర్స్‌లో పోలీసు బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తెరకెక్కించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అనే ట్యాగ్ ఉంది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సింగమ్, సింగమ్ రిటర్న్స్, సింబా, సూర్యవన్షీ వంటి చిత్రాలే అని చెప్పవచ్చు. తన చిత్రాలలోని పాత్రలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘సింగమ్ అగైన్’లో దీపికా పదుకొణెని (Deepika Padukone) డి.సి.పి శక్తి శెట్టిగా అతిథి పాత్రలో ఆయన చూపించారు. కానీ లేడీ సింగమ్‌తో పూర్తిస్థాయి ప్రాధాన్య ఉన్న ఒక చిత్రం చేయాలనే ఆలోచన ఉన్నట్లు రోహిత్ చెప్పారు. చాలా రోజులుగా ఇదే విషయంపై ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, అది పట్టాలెక్కడం లేదు. కానీ, సింగం అగైన్ విడుదల తర్వాత దీపిక పదుకొణెతో లేడీ సింగమ్ తరహా సినిమాకచ్చితంగా ఉంటుందన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ కథకు సంబంధించిన బలమైన ఆలోచన ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని స్క్రిప్ట్‌గా మార్చడానికే కుదర లేదని చెప్పారు. ఏది ఏమైనా లేడీ సింగమ్ సినిమా అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పడంతో ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
థియేటర్లలో కొత్త సినిమాలు.. అక్కడ మాత్రం బ్యాన్
దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 31).. థియేటర్లలో లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీర సినిమాలు రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు హిందీ చిత్రాలు భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్.. శుక్రవారం (నవంబర్ 01) థియేటర్లలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రెండు చిత్రాల్ని సౌదీ అరేబియా దేశంలో మాత్రం నిషేధించారు. ఎందుకో తెలుసా?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)'భూల్ భులయ్యా' ఫ్రాంచైజీలో తీసిన మూడో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కార్తిక్ ఆరన్య, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి.. ఇలా స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాని హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే ఇందులో హోమో సెక్సువాలిటీ అనే అంశాన్ని చూపించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సౌదీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.'సింగం' ఫ్రాంచైజీలో వచ్చిన మూడో మూవీ 'సింగం ఎగైన్'. అజయ్ దేవగణ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్.. ఇలా ఆల్మోస్ట్ బాలీవుడ్‌లోని స్టార్స్ అందరూ ఇందులో నటించేశారు! రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ కారణంతో సౌదీ 'సింగం ఎగైన్'పై నిషేధం విధించింది. అక్కడివాళ్లు ఈ మూవీస్ చూడాలంటే ఓటీటీల్లో వచ్చే వరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్) -
భారీ యాక్షన్ సీన్స్‌తో 'సింగం ఎగైన్' ట్రైలర్
బాలీవుడ్లో అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె నటించిన 'సింగం అగైన్' విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన భారీ తారాగణమే ఉంది. ఇప్పటికే విడుదలైన 'సింగం' ఫ్రాంఛైజీలోని చిత్రాలను ప్రేక్షకులు భారీగానే ఆదరించారు.కాప్ యూనివర్స్ సినిమాగా రోహిత్ శెట్టి తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 4.58 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ మెప్పించేలా ఉంది. దీపావళి సందర్భంగా నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది -
'సింగం అగైన్' విడుదల తేదీలో మార్పు
బాలీవుడ్లో 'సింగం' ఫ్రాంఛైజీ చిత్రాలకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరిస్‌లో మూడో చిత్రంగా 'సింగం అగైన్' తెరకెక్కుతుంది. అజయ్ దేవగణ్, దీపిక పదుకొణె జంటగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదొక కాప్ యూనివర్స్ చిత్రం. ఇందులో రణ్వీర్ సింగ్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కూడా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్ర విడుదల విషయంలో మార్పులు చేశారు. దీపావళి కానుకగా 2024 నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా 'సింగం అగైన్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ తదితర కారణాలతో విడుదల విషయంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్లో ఈ ఫ్రాంఛైజీ మొదలైంది. సౌత్‌లో సూర్య సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే.. బాలీవుడ్లో కూడా సింగం చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆధరణ లభించింది. -
Singham Again: 400 మంది డ్యాన్సర్లతో మాస్ డ్యాన్స్!
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది.