
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ కరీనా కపూర్ సందడి చేస్తున్నా రట. అజయ్ దేవగన్, కరీనా కపూర్ జంటగా అక్షయ్ కుమార్, రణ్‌వీర్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సింగమ్ ఎగైన్’. ‘సింగమ్ ఫ్రాంచైజీ చిత్రాలకు దర్శకత్వం వహించిన రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా భారీ ఓ మాస్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నృత్యదర్శకుడు గణేశ్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని టాక్. కీలక తారాగణంతో పాటు దాదాపు నాలుగు వందల మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని భోగట్టా. కాగా ప్రస్తుతం దీపికా పదుకోన్ గర్భవతి కావడంతో ఆమె ఈ పాటలో కనిపించే చాన్స్ లేదని బాలీవుడ్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment