'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు | Pushpa 2 Movie To Face Big Competition On August 15th | Sakshi
Sakshi News home page

'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు

Published Sun, Mar 10 2024 1:51 PM | Last Updated on Sun, Mar 10 2024 2:00 PM

Pushpa 2 Movie Bigg Competition On August 15th - Sakshi

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్ 61 ఏళ్ల వయసులో కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సౌత్‌ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యంగ్‌ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా ప్రభుదేవాతో 'కరటక దమనక' చిత్రంతో హిట్‌ కొట్టిన శివన్న.. మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.

శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ సినిమాల్లో 'భైరతి రంగల్‌' ఒకటి. ఈ చిత్రం గురించి చిత్ర బృందం అభిమానులకు శుభవార్త అందించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15, 2024న విడుదల చేయనున్నట్లు శివరాజ్‌కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈమేరకు పోస్టర్‌ను కూడా వదలడం జరిగింది. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్‌ హిట్‌ చిత్రమైన 'ముఫ్తీ'కి   'భైరతి రంగల్‌' ప్రీక్వెల్‌గా రానుంది. ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న 'పుష్ప 2' కూడా విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్‌ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్‌' కూడా రానుంది.  ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్‌, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్‌ కుమార్‌ సినిమా ఉంటే.. బాలీవుడ్‌లో భారీ స్టార్స్‌తో వస్తున్న సింగం ఎగైన్‌ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలను తట్టుకుని పుష్ప గాడు ఎంతమేరకు అక్కడ నిలబడుతాడో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement