Sivaraj Kumar
-
సూపర్‌స్టార్ కాళ్లకు మొక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో మెరిసింది. గతేడాది పొన్నియిన్ సెల్వన్‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో నటనకు గానూ ఐశ్వర్య లీడ్ రోల్ ఉత్తమనటిగా(క్రిటిక్స్) సైమా అవార్డ్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌తో కలిసి వేదికపై అవార్డును అందుకుంది.ఈ వేడుకకు హాజరైన ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన తల్లిని చూసి పరుగెత్తుకుంటూ స్టేజీ వద్దకు వచ్చింది. తన తల్లిని గట్టిగా కౌగిలించుకుని అభినందించింది. అదే సమయంలో అక్కడే ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు ఆరాధ్య నమస్కరించింది. ఆయన పాదాలకు మొక్కిన ఆరాధ్య ఆశీస్సులు తీసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌లో ఐశ్వర్యరాయ్ నటించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు గానూ ఫీమేల్ లీడ్ రోల్ (క్రిటిక్స్) విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికైంది. కాగా.. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలను మణిరత్నం తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
'పుష్ప 2' చిత్రంతో పోటీకి దిగుతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ 61 ఏళ్ల వయసులో కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. యంగ్ హీరోలు కూడా ఆశ్చర్యపోయేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ప్రభుదేవాతో 'కరటక దమనక' చిత్రంతో హిట్ కొట్టిన శివన్న.. మరో సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. శివ రాజ్‌కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో 'భైరతి రంగల్' ఒకటి. ఈ చిత్రం గురించి చిత్ర బృందం అభిమానులకు శుభవార్త అందించింది. సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఆగష్టు 15, 2024న విడుదల చేయనున్నట్లు శివరాజ్‌కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈమేరకు పోస్టర్‌ను కూడా వదలడం జరిగింది. అందులో శివన్న రగ్గడ్ లుక్‌లో కనిపస్తున్నారు. కన్నడ సూపర్ హిట్ చిత్రమైన 'ముఫ్తీ'కి 'భైరతి రంగల్' ప్రీక్వెల్‌గా రానుంది. ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' కూడా విడుదల కానుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్' కూడా రానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్ కుమార్ సినిమా ఉంటే.. బాలీవుడ్లో భారీ స్టార్స్‌తో వస్తున్న సింగం ఎగైన్ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలను తట్టుకుని పుష్ప గాడు ఎంతమేరకు అక్కడ నిలబడుతాడో వేచి చూడాలి. Justice Arrives This Independence Day#BhairathiRanagal IN CINEMAS 15th August 2024 @NimmaShivanna @GeethaPictures #Narthan @RahulBose1 @RaviBasrur #Naveen #chethandsouza @dhilipaction @kaanistudio @The_BigLittle #Geethapictures #BhairathiRanagalAug15 #Mufthi pic.twitter.com/ekOhYdqIHR — DrShivaRajkumar (@NimmaShivanna) March 10, 2024 -
'కన్నప్ప' విడుదల ఫిక్స్.. ఆ తేదీలో బిగ్‌ఫైట్
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్‌లో కీలకమైన ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్ భావిస్తోందట. ఇందులో కీ రోల్లో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కన్నప్ప చిత్రం షూటింగ్ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్ కార్యక్రామాలను కూడా సెట్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్. ఒకేరోజులో రామ్ చరణ్, తారక్ సినిమాలు ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు కూడా విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, నయనతార పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు,శరత్‌కుమార్‌లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్‌లో 'మహాభారతం' సిరీస్‌ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
క్షమించమని సిద్ధార్థ్‌ను కోరిన శివరాజ్ కుమార్
కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి నదీ జలాల వివాదం నడుస్తోంది. కర్ణాటకలో ప్రతిచోటా పోరు కొనసాగుతోంది. కావేరి కోసం శాండల్‌వుడ్ తారలు కూడా తమ గళాన్ని పెంచారు. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇప్పటికే కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో తమిళ హీరో సిద్ధార్ధ్‌కు నిరసన సెగ తగలింది. తను నటించిన 'చిన్నా' చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో ప్రమోషన్ కార్యక్రమం చేపట్టాడు. దీనిని పలువురు కన్నడ అనుకూల వ్యక్తులు అడ్డుకున్నారు. అక్కడి మీడియా సమావేశం నుంచి సిద్ధార్థ్‌ను బయటకు పంపించేశారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోపణలపై కేంద్రం రియాక్షన్.. వాళ్లకు మద్ధతుగా బాలీవుడ్ ) వారు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. ప్రస్తుతం ఈ చర్య సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఇలా ప్రస్తావించారు. 'నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం.. మా ఇండస్ట్రీ తరపున సిద్ధార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్ధార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం.. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు' అంటూ నటుడు సిద్ధార్థ్‌కి శివన్న సారీ చెప్పాడు. అలాగే కన్నడ ప్రజలు చాలా మంచివారు.అన్ని భాషలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను చూస్తారు.ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. చేతులు జోడించి క్షమాపణ చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇదే వివాదంపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. 'దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను.' అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. Instead of questioning all the political parties and its leaders for failing to solve this decades old issue.. instead of questioning the useless parliamentarians who are not pressurising the centre to intervene.. Troubling the common man and Artists like this can not be… https://t.co/O2E2EW6Pd0 — Prakash Raj (@prakashraaj) September 28, 2023 -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
'బిగ్ డాడీ' పేరుతో వచ్చేస్తున్న ఘోస్ట్ టీజర్
కన్నడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీనినే ఈ ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన 'సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై' ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్‌ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్‌మెంట్‌ను స్ట్రైకింగ్ పోస్టర్‌తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్‌తో సీరియస్ లుక్‌తో వచ్చిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ) -
ఓటీటీలోకి వచ్చేసిన 'శివ వేద'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివ వేద’. భయం అంటే తెలియని వ్యక్తి కథాంశమే ఈ సినిమా. ఈ చిత్రాన్ని ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అనే బ్యానర్‌పై రూపొందించారు. హర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . అర్జున్ జన్యా సంగీతం అందించగా.. ఈ చిత్రానికి స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ కంటే జీ 5లో వేద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో వేద సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు కథేటంటే.. ఈ సినిమా కథంతా 1985, 1965 ప్రాంతాల కాలంలో జరుగుతుంది. 1985లో వేద(శివరాజ్ కుమార్) కూతురు కనక(అదితి సాగర్) జైలు నుంచి విడుదలవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి చంద్రగిరి వెళ్తారు. అక్కడ పోలీసు అధికార రుద్ర(భరత్ సాగర్)ని కొట్టి చంపుతారు. ఆ తర్వాత మరో ఊరు వెళ్తారు.. అక్కడ ఒకరిని చంపుతారు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ నలుగురిని చంపేస్తారు. రౌడీగా చలమణీ అవుతున్న గిరయ్యను చంపాలన్నదే వాళ్ల లక్ష్యం. అసలు తండ్రి కూతురు కలిసి ఈ మారణ హోమం ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద గతం ఏంటి? అతని భార్య పుష్ప(గానవి లక్ష్మణ్) ఎలా చనిపోయింది? వరుస హత్యలు చేస్తున్నప్పటికీ మహిళా పోలీసు అధికారిణి రమా( వీణా పొన్నప్ప) ఎందుకు అడ్డుకోలేదు? కనకకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే శివ వేద చూడాల్సిందే. థియేటర్లలో చూడలేన వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
వర్మ స్టైల్లో ‘భైరవ గీత’
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మ శిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను వర్మ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. కన్నడ ట్రైలర్‌ను సాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ రిలీజ్ చేశారు. వర్మ మార్క్ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘భైరవ గీత’ ట్రైలర్ రిలీజ్
-
యంగ్ హీరోకి గిఫ్ట్‌గా కాస్ట్లీ సైకిల్
బొమ్మనహళ్లి : కన్నడ నటుడు, హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ 55వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం సదాశివనగరలోని స్వగృహంలో కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాను హిరోగా నటించిన లీడర్ సినిమా స్టిల్‌తో చేసిన కేక్‌ను కట్ చేశారు. ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా పునిత్ రాజ్‌కు శివరాజ్‌కుమార్ రూ.3లక్షల విలువైన బీఎండబ్ల్యూ సైకిల్‌ను బహుమతిగా అందజేశారు.