
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా భైరవ గీత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యాక్షన్ ప్రేమకథలో ధనుంజయ్, ఇర్రా మోర్‌లు హీరో హీరోయిన్లు నటించారు. వర్మ శిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను వర్మ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
కన్నడ ట్రైలర్‌ను సాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ రిలీజ్ చేశారు. వర్మ మార్క్ ప్రొమోషన్‌తో భైరవ గీతపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment