తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
(ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?)
ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్‌లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
(ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!)
Comments
Please login to add a commentAdd a comment