'కన్నప్ప' విడుదల ఫిక్స్‌.. ఆ తేదీలో బిగ్‌ఫైట్‌ | Kannappa 2024 Movie Release Date Locked, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Kannappa Release Date: 'కన్నప్ప' విడుదల ఫిక్స్‌.. ఆ తేదీలో బిగ్‌ఫైట్‌

Published Sat, Feb 3 2024 9:05 AM | Last Updated on Sat, Feb 3 2024 10:26 AM

Kannappa Movie Release Date Locked - Sakshi

హీరో  మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్‌లో కీలకమైన  ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్‌ భారత్‌కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్‌ భావిస్తోందట. ఇందులో కీ రోల్‌లో నటిస్తున్న ప్రభాస్‌ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట.

కన్నప్ప చిత్రం షూటింగ్‌ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్‌ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌.  ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ అనుకుంటుందట. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్‌ కార్యక్రామాలను కూడా సెట్‌ చేయాలనే ఆలోచనతో టీమ్‌ ఉందని టాక్‌. 

ఒకేరోజులో రామ్‌ చరణ్‌, తారక్‌ సినిమాలు
ఈ దసరాకు జూనియర్‌ ఎన్టీఆర్‌ 'దేవర', రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రాలు కూడా  విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్‌ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్‌ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్‌ వస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో  మోహన్‌లాల్‌, కన్నడ స్టార్​ శివరాజ్‌కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  ప్రభాస్‌, నయనతార పేర్లు ఇంకా ఫైనల్‌ కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement