అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్‌ | Kannappa Movie Poster Released Now | Sakshi
Sakshi News home page

Kannappa Poster: అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్‌

Nov 23 2023 11:53 AM | Updated on Nov 23 2023 11:58 AM

Kannappa Movie Poster Released Now - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్‌ వెయిటేడ్‌ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్‌ వర్క్‌ చేశారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్‌ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్‌ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన షేర్‌ చేశారు.

'కన్నప్ప' పోస్టర్‌ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే  అనేలా రూపొందించారు. ఈ పోస్టర్‌లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్‌ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్‌ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్‌ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి  మెహన్‌లాల్‌, కన్నడ నుంచి శివరాజ్‌ కుమార్‌, కోలీవుడ్‌ నుంచి నయనతార, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, మోహన్‌బాబు,శరత్‌కుమార్‌లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.  స్టార్‌ ప్లస్‌లో 'మహాభారతం' సిరీస్‌ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement