దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 31).. థియేటర్లలో లక్కీ భాస్కర్, క, అమరన్, బఘీర సినిమాలు రిలీజయ్యాయి. అన్నింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు హిందీ చిత్రాలు భూల్ భులయ్యా 3, సింగం ఎగైన్.. శుక్రవారం (నవంబర్ 01) థియేటర్లలోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రెండు చిత్రాల్ని సౌదీ అరేబియా దేశంలో మాత్రం నిషేధించారు. ఎందుకో తెలుసా?
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)
'భూల్ భులయ్యా' ఫ్రాంచైజీలో తీసిన మూడో సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. కార్తిక్ ఆరన్య, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, తృప్తి దిమ్రి.. ఇలా స్టార్ యాక్టర్స్ నటించిన ఈ సినిమాని హారర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే ఇందులో హోమో సెక్సువాలిటీ అనే అంశాన్ని చూపించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సౌదీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.
'సింగం' ఫ్రాంచైజీలో వచ్చిన మూడో మూవీ 'సింగం ఎగైన్'. అజయ్ దేవగణ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, టైగర్ ష్రాఫ్.. ఇలా ఆల్మోస్ట్ బాలీవుడ్‌లోని స్టార్స్ అందరూ ఇందులో నటించేశారు! రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీ తీశారు. ఈ కారణంతో సౌదీ 'సింగం ఎగైన్'పై నిషేధం విధించింది. అక్కడివాళ్లు ఈ మూవీస్ చూడాలంటే ఓటీటీల్లో వచ్చే వరకు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: ఆగస్టులో పెళ్లి.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment