Prashanth Neel Likely To Plan Pan World Movie With Jr NTR, Deets Inside - Sakshi
Sakshi News home page

Jr NTR Hollywood Entry: చెర్రీకి పోటీగా ఎన్టీఆర్ హాలీవుడ్ మూవీ..ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది!

Published Tue, Mar 21 2023 10:45 AM | Last Updated on Tue, Mar 21 2023 1:17 PM

jr NTR Ready To Do Hollywood Movie - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఇమేజ్ మారిపోయింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను దాటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు. ఇక హాలీవుడ్ లో వీరిద్దరి క్రేజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయింది. వీళ్లిద్దరి తో హాలీవుడ్ సినిమాలు తీసేందుకు అక్కడ మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్లు రామ్ చరణ్‌ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఎన్టీఆర్ కూడా ఓ పాన్ వరల్డ్ మూవీ స్కేచ్ వేసినట్లు తెలిసింది. 

రామ్ చరణ్‌, తారక్ ఇద్దరు మంచి ప్రెండ్స్...ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఆ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అయితే కెరీర్ విషయంలో మాత్రం ఇద్దరు పోటీపడుతున్నట్లుగానే అనిపిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రామ్ చరణ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్ ఫినిషింగ్ లో  ఉన్నప్పుడే శంకర్ తో ఆర్.సి.15 అనౌన్స్ చేశాడు.

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబుతో  ఆర్.సి.16 లైన్ లో ఉంది. అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్, లోకేష్ కనగరాజ్, సుకుమార్ రామ్ చరణ్‌ కి టచ్ లోనే ఉన్నారు. తన చేతిలోని సినిమాలు పూర్తి చేసి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ చరణ్‌ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాడు .

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక మార్చి 23న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ సంవత్సర కాలం ఎదురుచూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వాటర్ మాఫియా బ్యాక్  డ్రాప్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టి ఉంచాడు. ప్రశాంత్ సలార్ కంప్లీట్ కాగానే...అక్టోబర్ లో ఎన్టీఆర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఇక ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్ సాధించిన తర్వాత...ప్రశాంత్ నీల్ ప్లాన్ మారింది. ఎన్టీఆర్ తో తెరకెక్కించాలనుకున్న పాన్ ఇండియా మూవీని...పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్ అమెరికా టూర్ లో ఉన్నప్పుడు హాలీవుడ్ ఎంట్రీ గురించి న్యూస్ వచ్చినా..ఆ తర్వాత ఎన్టీఆర్ ఎక్కడా హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడలేదు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం భారీ యాక్షన్ డ్రామా ప్లాన్ చేసిన ఎన్టీఆర్ మూవీని హాలీవుడ్ టార్గెట్ గా ఇంగ్లీష్‌ లో కూడా ప్లాన్ చేస్తున్నాడట. 

ఇక ఎన్టీఆర్ 31 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని, హాలీవుడ్ యాక్టర్స్‌ని రంగంలోకి దింపుతాడనే మాట పిల్మ్ సర్కిల్స్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. తన కెరీర్ లోనే ఎన్టీఆర్ తో బెస్ట్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉన్నాడు.  ఆర్‌ఆర్‌ఆర్‌తో ఎన్టీఆర్ కి వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని హాలీవుడ్ రేంజ్ లో కూడా సత్తా చాటే విధంగా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేలా స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాడట. ఈ విషయం తెలియటంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement