Is Salman Khan About To Join Guardians Of The Galaxy, Details Inside - Sakshi
Sakshi News home page

Guardians Of The Galaxy: అది సల్మాన్ రేంజ్ అంటే.. హాలీవుడ్ కూడా సల్లూ భాయ్ ను వాడాల్సిందే

Published Tue, May 2 2023 5:10 PM | Last Updated on Tue, May 2 2023 5:38 PM

Is Salman Khan about to join Guardians of the Galaxy - Sakshi

కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. సల్లూ భాయ్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఈ మధ్యనే కిసీకా భాయ్.. కిసీకా జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. కానీ, అది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం సల్లూ భాయ్ టైగర్ 3 పనుల్లో బిజీగా ఉన్నాడు. సరే ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ, నిన్నటి నుంచి సల్మాన్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏంటి అంటే.. మార్వెల్ వరల్డ్ లోకి సల్మాన్ ఎంట్రీ ఇస్తున్నాడట.. ఏంటి నిజమా.. హాలీవుడ్ లో సల్మాన్ కనిపిస్తున్నాడా..? అంటే.. అబ్బే కాదండీ.. మార్వెల్ సినిమాకు ప్రమోషన్స్ ఇస్తున్నాడు.

(చదవండి: మహిళల శరీరాలు ఎంతో విలువైనవి.. సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు )

ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ కూడా ఇండియన్ సినిమాలపై మక్కువ పెంచేసుకుంది. మన సినిమాలను వాళ్లు ప్రమోట్ చేసినట్టే.. వాళ్ల సినిమాలను మనం ప్రమోట్ చేస్తున్నాం. మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన హిట్ సినిమాల్లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఒకటి. అందులో గ్రూట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పటికే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ నుంచి రెండు వాల్యూమ్స్ రిలీజ్ అవ్వడం, హిట్ అందుకోవడం జరిగింది. ఇక ముచ్చటగా మూడో వాల్యూమ్ మే 5 న రిలీజ్ చేస్తున్నారు  మేకర్స్. అందుకోసమే ఈ సినిమా ప్రమోషన్స్ లోకి సల్మాన్ ఖాన్ ను దింపేశారు. 

(చదవండి:  ‘ది కేరళ స్టోరీ’ వివాదం ఏంటి? సీఎం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? )

ప్రమోషన్స్ అంటే.. ఏదో అల్లాటప్పా అనుకునేరు. ఏకంగా ఒక యాడ్ షూట్ నే ప్లాన్ చేశారు. తాజాగా ఈ యాడ్ రిలీజ్ అయ్యి నెట్టింట వైరల్ గా మారింది.  ఐ యామ్ గ్రూట్.. ఐ యామ్ గ్రూట్..ఐ యామ్ గ్రూట్.. అంటూ సల్మాన్ గ్రూట్ మాయలో పడి ప్రెస్ మీట్ లో కూడా అలానే మాట్లాడుతూ కనిపించాడు.  తన నెక్స్ట్ సినిమా ఏంటీ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఐ యామ్ గ్రూట్.. లాగా ఐ యామ్ సల్మాన్ అని చెప్పుకొచ్చాడు.

ఆ ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలు అన్నింటికి కూడా ఐ యామ్ సల్మాన్ అని చెప్పుకొచ్చాడు. దీంతో సల్మాన్ కు ఏమైంది అని రిపోర్టర్లు అడుగుతుండగా.. మే 5 వరకు ఆగండి .. తెలుస్తుంది అంటూ సల్మాన్ టీ షర్ట్ పై  గ్రూట్ బొమ్మను చూపించారు. ఇక ఈ యాడ్ ను చూసిన  అభిమానులు.. అది సల్లూ భాయ్ రేంజ్ అంటే.. బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా సల్లూ భాయ్ ను వాడకపోతే పని ఎవ్వడు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కండల వీరుడు చేసిన ప్రమోషన్స్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ వరకు  ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement