
Samantha Reacts To Christian Bale Gorr Look In Thor Love And Thunder: స్టార్ హీరోయిన్ సమంత ఓ పక్క చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. మరోపక్క సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ మోటివేషనల్ కొటేషన్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సామ్ పెట్టిన స్టోరీ ఆసక్తి కలిగించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 'థోర్' సిరీస్ నాలుగో మూవీ 'థోర్: లవ్ అండ్ థండర్' సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తైకా వైటిటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూసిన సామ్ తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో 'డెడ్' అని రాస్తూ ఫైర్ ఎమోజీస్‌ను పెట్టి థోర్ సినిమా పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే తర్వాత కొద్దిసేపటికి సామ్ స్టోరీలో ఆ పోస్టర్ కనిపించట్లేదు. దానికి బదులు 'థోర్: లవ్ అండ్ థండర్'లో సూపర్ విలన్‌గా నటిస్తున్న క్రిస్టియన్ బాలే లుక్‌ను షేర్ చేస్తూ 'ది గాడ్ ఆఫ్ యాక్టింగ్' అని రాసింది. ఈ పోస్ట్‌లు చూస్తుంటే సమంత కూడా ఈ సూపర్ హీరో సినిమాలకు విపరీతమైన అభిమానిగా తెలుస్తోంది.
అయితే ఇందులో విలన్‌గా నటిస్తున్న క్రిస్టియన్ బాలే 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' చిత్రాల్లో బ్యాట్ మ్యాన్‌గా అదరగొట్టాడు. ప్రస్తుతం థోర్‌లో బాలే విలన్‌గా చేయడం, నటాలియా పోర్ట్‌మన్ లేడీ థోర్‌గా మారడంతో మూవీపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ఈ మూవీ గురించి డైరెక్టర్ తైకా వైటిటి 'నేను చేసిన అత్యంత క్రేజీ థింగ్' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment