ఆ యాక్షన్​ చిత్రాల ఫ్యాన్స్​కు నిరాశే.. మళ్లీ వాయిదా | Tom Cruise Next 2 Mission Impossible Movies Again Postponed | Sakshi
Sakshi News home page

Tom Cruise Mission Impossible Movies: ఆ యాక్షన్​ చిత్రాల ఫ్యాన్స్​కు నిరాశే.. మళ్లీ వాయిదా

Published Sat, Jan 22 2022 9:14 PM | Last Updated on Sat, Jan 22 2022 9:25 PM

Tom Cruise Next 2 Mission Impossible Movies Again Postponed - Sakshi

ప్రేక్షకులను అద్భుతంగా అలరించే హాలీవుడ్​ యాక్షన్​ చిత్రాల్లో మిషన్​ ఇంపాజిబుల్​ సిరీస్​ ఒకటి. ప్రముఖ హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​ హీరోగా నటించే ఈ ఫ్రాంచైజీకి క్రేజ్​ ఎక్కువే. ఈ సినిమాల్లో టామ్​ చేసే యాక్షన్​ సీక్వెన్స్​, సాహసాలు ఆడియెన్స్​ను సీటుకు కట్టిపడేస్తాయి. ఇక ఈథన్ హంట్​ (సిరీస్​లో టామ్​ క్రూజ్​ పాత్ర పేరు) తరచుగా మార్చే గెటప్పులు ఆహా అనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్రాంచైజీలోని ప్రతినాయకుల విలనిజం, హీరోయిన్లు గ్లామర్​ అదనపు ఆకర్షణ. అయితే ఇంతగా అలరించే ఈ సిరీస్​లో వచ్చే సినిమాలు మళ్లీ వాయిదా పడి అభిమానులకు నిరాశకు గురిచేశారు. 

(చదవండి: అత్యధిక నిడివి ఉన్న చిత్రం ఇదేనట !.. భారీగా అంచనాలు)

ఈ సిరీస్​లో ఇదివరకు 6 సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు కొత్తగా 7, 8 సినిమాలు వరుస పెట్టి రానున్న సంగతి తెలిసిందే. మిషన్​ ఇంపాజిబుల్​ 7వ సినిమాను సెప్టెంబర్​ 2022లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్​ చేశారు. ఆ తర్వాత జూలై 2023లో ఎనిమిదవ చిత్రాన్ని రిలీజ్​ చేద్దామనుకున్నారు. కానీ కొవిడ్​ కారణంగా ఈ సినిమాలు మరింత ఆలస్యం కానున్నాయి. ఈ విషయాన్ని పారామౌంట్ పిక్చర్స్​, స్కైడాన్స్​ నిర్మాణ సంస్థలు శుక్రవారం (జనవరి 21) ఒక ప్రకటనలో తెలిపాయి. 

(చదవండి: 'స్క్విడ్‌ గేమ్‌' మళ్లీ రానుంది.. ఈసారి ఎలాంటి గేమ్‌ ?)


అనేక పరిశీలనల తర్వాత ఆలోచించుకుని కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ సినిమాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సిరీస్​లోని 7వ చిత్రాన్ని జూలై 14, 2023న, 8వ మూవీని జూన్​ 28, 2024న విడుదల చేయనున్నట్లు వెల్లడించాయి. ఇక ఈ సినిమాలు ఆ తేదీల్లో విడుదలవుతాయో లేదా కరోనా కారణంగా ఇంకా వాయిదా పడతాయో చూడాలి. 

(చదవండి: ఆస్కార్‌ బరిలో 'నో టైమ్‌ టు డై'.. 4 విభాగాలకు నామినేట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement