సీక్రెట్‌ వార్స్‌కు చాన్స్‌ ఇవ్వండి | Sam Raimi Interesting Comments On Possibly Directing Avengers, Deets Inside - Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ వార్స్‌కు చాన్స్‌ ఇవ్వండి

Apr 4 2024 4:53 AM | Updated on Apr 4 2024 1:01 PM

Sam Raimi Comments On Possibly Directing Avengers - Sakshi

– దర్శకుడు శ్యాముల్‌ రైమి

హాలీవుడ్‌ సూపర్‌ డూపర్‌హిట్‌ సూపర్‌ హీరో ఫ్రాంచైజీ ‘అవెంజర్స్‌’. ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా ‘అవెంజర్స్‌: సీక్రెట్‌ వార్స్‌’ సినిమా రానుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్‌ తనకు దక్కితే బాగుంటుందని దర్శక–నిర్మాత, రచయిత శ్యాముల్‌ ఎమ్‌ రైమి చేసిన వ్యాఖ్యలు హాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

ఇక దర్శకుడిగా ‘ది ఈవిల్‌ డెడ్‌’, ‘ది ఈవిల్‌ డెడ్‌  2’, ‘స్పైడర్‌ మేన్‌’, ‘స్పైడర్‌ మేన్‌ 2’, ‘స్పైడర్‌ మేన్‌ 3’ వంటి సినిమాలను తెరకెక్కించారు శ్యాముల్‌. మరి.. ‘అవెంజర్స్‌: సీక్రెట్‌ వార్స్‌’ చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్‌ శ్యాముల్‌ కోరుకున్నట్లు ఆయనకు దక్కుతుందా? అనేది చూడాలి. మరోవైపు ‘అవెంజర్స్‌: సీక్రెట్‌ వార్స్‌’ సినిమాలోని ప్రధాన తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు మార్వెల్‌ సంస్థ. అయితే టామ్‌ హాలండ్, క్రిస్‌ హెమ్‌వర్త్, ఆంథోనీ మాకీ లీడ్‌ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement