
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది.
ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం.
డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్‌లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా.
ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment