Driving Skills
-
భక్తితో దైవదర్శనం..నవ్వుతూ మృత్యు ఒడిలోకి! వైరల్ వీడియో
TW ⚠️Instead of hitting the brake, she pushed the accelerator at the edge of the hill…Despite not knowing how to drive, she reversed a Toyota Etios as her friend Shivraj Mule recorded. Shweta Survase, 23, from Ch. Sambhaji Nagar, died while making a reel near Dutt Dham… pic.twitter.com/eadsWau9AT— Sneha Mordani (@snehamordani) June 18, 2024అతి ఉత్సాహం, నిర్లక్ష్యం వెరసి ఒక నిండు జీవితం. కొత్త కారు.. డ్రైవింగ్ సరిగ్గా రాదు. పైగా ఎత్తైన కొండ మీద రివర్స్ తీసుకుంటోంది. ఈ క్రమంలో బ్రేక్ వేయాల్సింది పోయి, యాక్సిలరేటర్ రైజ్ చేసింది. అంతే కళ్లు మూసి తెరిచే లోపే 300 అడుగుల కొండపై నుండి లోయలోకి జారి పడి కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను శ్వేతా దీపక్ సుర్వాసే (23)గా గుర్తించారు. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఎల్లోరా గుహలకు వెళ్లే మార్గంలో దత్ ధామ్ టెంపుల్ వద్ద చోటు చేసుకుంది.స్నేహితుడు సూరజ్ సంజౌ ములేతో కలిసి శ్వేతా సోమవారం మధ్యాహ్నం ఔరంగాబాద్‌లోని సులిభంజన్ వద్ద దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించుకున్నారు. తరువాత ఇక్కడ కొండమీద టయోటా ఎటియోస్ కారు డ్రైవ్ చేయాలని ఉత్సాహ పడింది. ఎత్తైన కొండమీద కారును రివర్స్ చేస్తోంది. దీన్ని ములే రికార్డు చేస్తున్నాడు. మెల్లిగా వెనక్కి తీసుకుంటూ ఉండగా పొరపాటున యాక్సిలరేటర్ మీది కాలు వేసింది. దీంతో కారు వేగం పుంజుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అతడు ఆమెను స్లో చేయమని హెచ్చరిస్తూనే, "క్లచ్, క్లచ్, క్లచ్" అంటూ అరిచాడు. ఆమెను ఆపడానికి పరిగెత్తాడు కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది.ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, కారు 300 అడుగుల ఎత్తును నుంచి జారి లోయలోకి పల్టీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
90 ఏళ్ల వయసులోనూ “తగ్గేదే లే” అంటున్న బామ్మా
-
లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా. ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..? -
ఖరీదైన ఫెరారీ కారుతో ఆకాశ్ అంబానీ చక్కర్లు: దీని ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, వ్యాపారవేత్త ఆకాశ్ అంబానీ ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.. లగ్జరీ కార్లంటే ఇష్టపడే ఆకాశ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్ కార్లున్నాయి. ఖరీదైన, స్పోర్ట్స్ కార్లను డ్రైవ్ చేస్తూ తరచుగా ముంబై మహానగరంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆకాశ్. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) స్వతహాగా ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో డ్రైవింగ్ థ్రిల్ అనుభవించడం కూడా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్చల్ చేయడంలో ఫ్యాన్స్ దృష్టిలో పడింది. ఆకాష్ అంబానీ తన డ్రైవింగ్ నైపుణ్యంతో ఫెరారీ SF90ని పరుగులు పెట్టించడం విశేషం. ఇన్‌స్టాలో ఆకాశ్ అంబానీ ఫ్యాన్ పేజీ రెడ్ ఫెరారీ SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. నివేదికల ప్రకారం 'ప్రాన్సింగ్ హార్స్' లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది. 7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్ మెక్లారెన్ కారులో ఆకాశ్ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ కారు ధర సుమారు రూ. 3.30 - 4.85 కోట్లు. మెక్లారెన్ కారులో ఫోల్డబుల్ డ్రైవర్ డిస్ప్లే, స్టాటిక్ అడాప్టివ్ హెడ్లైట్లు, వేరియబుల్ డ్రిఫ్ట్ కంట్రోల్, మెక్లారెన్ ట్రాక్ టెలిమెట్రీ ,కార్బన్-సిరామిక్ బ్రేక్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc) -
డ్రైవర్ కు గుండెపోటు.. ఆగిఉన్న వాహనాలపై దూసుకెళ్లిన బస్సు
-
వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్
తిరువనంతపురం : హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్కింగ్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చిన్న సందు దూరినా ఎలాంటి ఆలోచన లేకుండానే మన వాహనాలను పార్క్ చేస్తాం. కారు పట్టే సందు ఉందా.. లేదా అనేది ఆలోచించకుండానే అడ్డగోలుగా పార్క్ చేసినా.. తీరా అది బయటకు తీయాలంటే మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. బైక్ అయితే అంతో ఇంతో కష్టపడి తీయొచ్చు గాని.. కార్లు అలా కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వాహనాలు దెబ్బతినడం గ్యారంటీ. కానీ కేరళకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన డ్రైవింగ్ స్కిల్స్‌తో అబ్బురపరిచాడు. (చదవండి : వైరల్: పబ్జీకి అంతిమ వీడ్కోలు) వివరాలు.. కేరళలోని మనంతవాడికి చెందిన పిఎస్ బిజూ ఒకపని మీద తన ఇన్నోవా కారులో వచ్చాడు. తన బండిని పార్క్‌ను చేసేందుకు చిన్న స్థలాన్ని ఏంచుకున్నాడు. నిజానికి ఆ స్థలాన్ని చూస్తే కారు పడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ బిజూ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఇన్నోవాను పార్క్ చేశాడు. తరువాత పని ముగించుకొని వచ్చిన బిజూ కారును ఎలా బయటకు తీస్తాడో చూడాలనిపించింది. కేవలం చిన్నపాటి ట్రిక్ ఉపయోగించి బైక్‌ను బయటకు తీసినంత సులువుగా ఇన్నోవాను చిన్న దెబ్బ కూడా తగలకుండా తీశాడు. ఇదంతా బిజూ భార్య అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. మళయాలి డ్రైవర్ అద్భుతమైన స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతమని.. అతని నైపుణ్యతకు జోహార్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి : ఫేక్ న్యూస్’ను ప్రశ్నించడం తప్పా!?) That’s Malayalee Driver for you , salute his skill and confidence! Few saw how he took out the car earlier this has both how he parked and how took it out from parking ! Kudos to the guy 👏🏼👏🏼 pic.twitter.com/JwJrCIjTyn — Vijay Thottathil (@vijaythottathil) September 7, 2020 ఇదే విషయమై బిజూను అడిగితే.. అది నా స్నేహితుడి కారు.. కారుకు సంబంధించి పేయింట్ వర్క్ ఉంటే అతను బిజీగా ఉండడంతో ఆదివారం కారును తీసుకొని వర్క్‌షాప్‌కు వెళ్లాను. కారుకు సంబంధించి పని ముగించుకున్న తర్వాత నా భార్యతో కలిసి అదే కారులో షాపింగ్‌కు వెళ్లా.. నేను కారు పార్క్ చేసే సమయంలో నా భార్య వీడియో తీస్తుందని తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. వీడియోలో ఉన్నది నేనే అని తెలుసుకొని ఆశ్చర్యపోయా. కానీ బేసిక్‌గా నేను 12 మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద వాహనాలను నడిపిన అనుభవం ఉండడంతో కారును బయటకు తీయడం పెద్ద కష్టమనిపించలేదు. వాహనం పార్క్ చేసే ముందు కారు సైజ్ ఎంత.. అది అక్కడ పడుతుందా లేదా అన్నది తెలుసుకొని రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చాడు. -
హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..
నోటిఫికేషన్ వివరాలు... మొత్తం పోస్ట్‌లు 150 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి. ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి. 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు. లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. దరఖాస్తు విధానం... అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి. ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ... అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్‌లో వివరాలు పూరించండి. విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి. 4 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు. స్థానికత ధ్రువీకరణ పత్రం. రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు) చెక్‌లు, డీడీలు అనుమతించరు. దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్‌బాగ్‌లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి. దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి. అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్ జారీ చేస్తారు. అభ్యర్థుల ఎంపిక విధానం... డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వీటితోపాటుగా మెడికల్‌గా ఫిట్నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు. గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్‌లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు.