తిరువనంతపురం : హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్కింగ్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చిన్న సందు దూరినా ఎలాంటి ఆలోచన లేకుండానే మన వాహనాలను పార్క్ చేస్తాం. కారు పట్టే సందు ఉందా.. లేదా అనేది ఆలోచించకుండానే అడ్డగోలుగా పార్క్ చేసినా.. తీరా అది బయటకు తీయాలంటే మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. బైక్ అయితే అంతో ఇంతో కష్టపడి తీయొచ్చు గాని.. కార్లు అలా కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వాహనాలు దెబ్బతినడం గ్యారంటీ. కానీ కేరళకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన డ్రైవింగ్ స్కిల్స్‌తో అబ్బురపరిచాడు. (చదవండి : వైరల్: పబ్‌జీకి అంతిమ వీడ్కోలు)
వివరాలు.. కేరళలోని మనంతవాడికి చెందిన పిఎస్ బిజూ ఒకపని మీద తన ఇన్నోవా కారులో వచ్చాడు. తన బండిని పార్క్‌ను చేసేందుకు చిన్న స్థలాన్ని ఏంచుకున్నాడు. నిజానికి ఆ స్థలాన్ని చూస్తే కారు పడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ బిజూ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఇన్నోవాను పార్క్ చేశాడు. తరువాత పని ముగించుకొని వచ్చిన బిజూ కారును ఎలా బయటకు తీస్తాడో చూడాలనిపించింది. కేవలం చిన్నపాటి ట్రిక్ ఉపయోగించి బైక్‌ను బయటకు తీసినంత సులువుగా ఇన్నోవాను చిన్న దెబ్బ కూడా తగలకుండా తీశాడు. ఇదంతా బిజూ భార్య అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. మళయాలి డ్రైవర్ అద్భుతమైన స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతమని.. అతని నైపుణ్యతకు జోహార్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి : ఫేక్ న్యూస్’ను ప్రశ్నించడం తప్పా!?)
That’s Malayalee Driver for you , salute his skill and confidence!
— Vijay Thottathil (@vijaythottathil) September 7, 2020
Few saw how he took out the car earlier this has both how he parked and how took it out from parking !
Kudos to the guy 👏🏼👏🏼 pic.twitter.com/JwJrCIjTyn
ఇదే విషయమై బిజూను అడిగితే.. అది నా స్నేహితుడి కారు.. కారుకు సంబంధించి పేయింట్ వర్క్ ఉంటే అతను బిజీగా ఉండడంతో ఆదివారం కారును తీసుకొని వర్క్‌షాప్‌కు వెళ్లాను. కారుకు సంబంధించి పని ముగించుకున్న తర్వాత నా భార్యతో కలిసి అదే కారులో షాపింగ్‌కు వెళ్లా.. నేను కారు పార్క్ చేసే సమయంలో నా భార్య వీడియో తీస్తుందని తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. వీడియోలో ఉన్నది నేనే అని తెలుసుకొని ఆశ్చర్యపోయా. కానీ బేసిక్‌గా నేను 12 మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద వాహనాలను నడిపిన అనుభవం ఉండడంతో కారును బయటకు తీయడం పెద్ద కష్టమనిపించలేదు. వాహనం పార్క్ చేసే ముందు కారు సైజ్ ఎంత.. అది అక్కడ పడుతుందా లేదా అన్నది తెలుసుకొని రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment