Car Parking
-
కారు పార్కింగ్ వివాదం.. కొట్టుకున్న రెండు కుటుంబాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ సంత్ నగర్‌లోని ఒక అపార్ట్మెంట్లో పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఒక పెద్దాయనతో సహా ఆ కుటుంబంలోని మహిళలు పార్కింగ్ చేసిన వ్యక్తిని కర్రతో చితకబాదారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వీరు అంతరించిపోతున్న భారతీయ కళకు ఊపిరి పోశారన్నారు. ఒకప్పుడు వీధుల్లో కుళాయి వద్ద సర్వసాధారణంగా బిందెలతో కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఇప్పుడు నాగరికత పెరిగిన కారణంగా వీధిలోని సంప్రదాయాన్ని అపార్ట్మెంట్లకు బదిలీచేశారు. వేషధారణ అయితే మారింది కానీ గుణం మారలేదు. సంత్ నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముండే దుష్యంత్ గోయెల్ కారు పార్కింగ్ చేశాడన్న కోపంతో ఆ కుటుంబ పెద్ద కనీసం వారించకుండా ఒక కర్రతో దాడి తెగబడ్డారు. పాపం భర్తను కాపాడేందుకు అతని భార్య మోనా గోయెల్ తోపాటు వారి కుమార్తె కౌశికి కూడా ఎంత అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆ పెద్దమనిషి ఇంట్లోని వారంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో దుష్యంత్ కుటుంబంలోని అందరూ గాయపడ్డారు. అనంతరం దుష్యంత్ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పెద్దమనిషి దల్జీత్ సింగ్ అతని కుమారుడు హర్జాప్ ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అదే కుటుంబంలోని ఆడవాళ్లు కూడా దాడిచేసినటు వీడియోలో స్పష్టంగా కనిపించడంతో వారిపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు రెండుసార్లు నిరాకరించింది. ఒక్కరికి మాతం కోర్టు ఉపశమనం కలిగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ మధ్య కార్ పార్కింగ్ వివాదాలు ఒకప్పటి బిందుల ఫైట్ కంటే రసవత్తరంగా సాగుతున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. Kalesh b/w Two Neighbour’s in New Delhi over Car Parking issuepic.twitter.com/A21HCcknf6 — Ghar Ke Kalesh (@gharkekalesh) July 22, 2023 ఇది కూడా చదవండి: మణిపూర్‌లొ మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం -
కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్‌మహల్‌ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్‌మహల్ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తాజ్‌మహల్ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది. కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్‌లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు. A dog died due to heat and suffocation as his owners left him in their parked car to visit Taj Mahal. If you can’t treat your pets properly then don’t adopt them. https://t.co/4ZI7iMj6n1 — Rishi Bagree (@rishibagree) July 3, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
డింపుల్‌తో డీసీపీ అసభ్యంగా ప్రవర్తించారు : న్యాయవాది
హీరోయిన్ డింపుల్ హయాతి, డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ ఇష్యూపై డింపుల్ న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జంతువులను హింసిస్తుంటే డీసీపీని డింపుల్ వారించిందని, దీంతో ఆయన కక్ష పెంచుకున్నారని తెలిపారు. ''డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు ర్యాష్‌గా మాట్లాడారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. డింపుల్ పార్లింగ్ ప్లేసులో కావాలనే కోన్స్ పెట్టారు. అయినా రోడ్డుపై వుండాల్సిన సిమెంట్ బారికేడ్స్, కోన్స్ ప్రైవేట్ స్థలంలోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. జంతువులను హింసిస్టుంటే డింపుల్ వారించింది. అందుకే ఆ కక్షతోనే డీసీపీ ఇలా తప్పుడు కేసు పెట్టారు. డింపుల్ ఎక్కడా కారును తన్నిన ఫుటేజీ లేదు. కానీ ఆమెను తప్పుగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. జరిగిన పరిణామాలు చూసి డింపుల్ మానసిక ఒత్తిడికి గురైంది, ఆమె బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతుంది. డీసీపీ నుంచి డింపుల్‌కు ప్రాణహాని ఉంది. ఇప్పటికే ఆమెకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ కేసను న్యాయపరంగా ఎదుర్కొంటాం'' అంటూ ఆమె న్యాయవాది పేర్కొన్నారు. -
డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు.. స్పందించిన నటి
రామబాణం ఫేం డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు) ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్ పరోక్షంగా చెప్పుకొచ్చింది. అసలేం జరిగింది? హైదరాబాద్‌లోని జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్మెంట్లో డింపుల్ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్ చేతన్ కుమార్ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్లో పార్కింగ్ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుంది. . దీనిపై వారికి పలు మార్లు గొడవైంది.అయితే తాజాగా డింపుల్ సదరు ఆఫీసర్ కారుని ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు కాలితో తంతూ గొడవ చేసింది. అక్కడున్న డ్రైవర్‌తోనూ ఆమె గొడవ పడింది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ జూబ్లీ హిల్స పోలీసులకు ఫిర్యాదు చేశారు. Using power doesn’t stop any mistake . 😂 — Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023 -
HYD: కోఠిలో భారీ శబ్ధంతో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కింగ్ కోఠిలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కోఠిలోని ఓ కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షెడ్డులో భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కాగా, మంటల్లో 5 కారు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు, కారులో నిద్రపోయిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
యంగ్ హీరో కారుకు ఫైన్.. ఎందుకంటే?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌కు ముంబయి పోలీసులు ఫైన్ వేశారు. ఆయన కారును రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేశారంటూ ముంబయి పోలీసులు చలానా విధించారు. ఈ విషయాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే కారు పార్కింగ్ చేసేటప్పడు కార్తీక్ కారు నడపలేదని తెలుస్తోంది. ఇవాళ ముంబయిలోని సిద్ధి వినాయకస్వామి దేవాలయాన్ని సందర్శించగా ఈ సంఘటన జరిగింది. ఈ క్రమంలోనే సిద్ధివినాయక ఆలయం వెలుపల పార్క్ చేసిన కార్తీక్ ఆర్యన్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ముంబయి పోలీసు సిబ్బంది చలాన్ జారీ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ట్రాఫిక్ పోలీసులు కార్తీక్ కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని సినిా డైలాగ్స్లోని రెండు సినిమాలను ప్రస్తావించారు. ట్విటర్లో రాస్తూ..'కారు రాంగ్ సైడ్‌లో పార్క్ చేయబడి ఉంది. షెహజాదా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించగలడని భావించొద్దు.' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. కాగా.. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో షెహజాదా పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి సనన్, రోనిత్ రాయ్, మనీషా కొయిరాలా, సన్నీ హిందూజా నటించారు. ఆ తర్వాత సత్యప్రేమ్ కి కథలో కియారా అద్వానీతో కలిసి నటించనున్నారు. అనురాగ్ బసుతో ఆషికీ 3, కెప్టెన్ ఇండియా, కబీర్ ఖాన్ చిత్రాల్లో కనిపించనున్నారు. Problem? Problem yeh thi ki the car was parked on the wrong side! Don't do the 'Bhool' of thinking that 'Shehzadaas' can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl — Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023 -
Yadagirigutta: యాదాద్రి ఆలయంలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం కావడంతో జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద కల్యాణ కట్ట, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి ప్రాంతాలతో పాటు కొండపై ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో భక్తులు కిటకిటలాడారు. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు. కొండ కింద రింగ్ రోడ్డులో బస్సుల కోసం భక్తులు వేచి చూడాల్సి వచ్చింది. బస్సులు సరైన సమయానికి రాకపోవడంతో పాటు నిండుగా రావడంతో పుష్కరిణి నుంచి కొండ పైకి వెళ్లాల్సిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. మి వారిని 25,219 మంది భక్తులు దర్శించుకోగా, వివిధ పూజలతో రూ.39,44,918 నిత్య ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్‌తో రూ.2,78,250, వీఐపీ దర్శనాలతో రూ.4,65,000, ప్రసాద విక్రయంతో రూ.18,04,830, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,00,000, సువర్ణ పుష్పర్చనతో రూ.1,91,748, ఇతర పూజలతో రూ.2,87,340 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..) వాహనాద్రి! యాదాద్రి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తమ వాహనాలను యాదాద్రి కొండకు దిగువన పార్కింగ్ చేశారు. పార్కింగ్ స్థలం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వీటిని చూస్తే.. ఏదైనా భారీ సభకు వచ్చిన వారి వాహనాల్లా అనిపించింది. – సాక్షి ఫొటోగ్రా ఫర్ యాదాద్రి భువనగిరి -
చార్మినార్ వద్ద మల్టీలెవల్ కారు పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద త్వరలో మల్టీలెవల్ కారు పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్విట్టర్లో తెలిపారు. ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఓ స్థలంలో ఘన వ్యర్థాలను పడవేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తోందని పేర్కొంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో ఆయన ఈ జవాబిచ్చారు. ఈ పనులు చేపట్టేందుకు డిజైన్లు రూపొందించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రతినిధుల బృందం ఇటీవల కోయంబత్తూర్ని సందర్శించి మల్టీ లెవల్ కారు పార్క్ విధానాన్ని అధ్యయనం చేసిందని వెల్లడించారు. (క్లిక్: బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార పోరు.. బల్దియాకు 30 లక్షల రాబడి) -
కొట్టుకుని కేసులు పెట్టుకున్న సీఐలు
పీఎం పాలెం (భీమిలి): ఏదైనా గొడవ జరిగితే సామాన్యులు వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తారు. అటువంటిది.. ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు గొడవ పడటమేగాక కొట్టుకున్నారు. ఇద్దరూ గాయపడ్డారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. జీవీఎంసీ ఆరో వార్డులోని పీఎంపాలెం ఆఖరు బస్టాప్ సమీపంలోగల షిప్‌యార్డు కాలనీలోని శ్రీనిలయం అపార్టుమెంట్లో ఏసీబీలో సీఐగా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్, వీఆర్‌లో ఉన్న సీఐ రాజులనాయుడు కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరిద్దరు సెల్లార్‌లోని కారు పార్కింగ్ విషయంలో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సీఐలతో పాటు వారి కుటుంబసభ్యుల మధ్య మరోమారు వివాదం తలెత్తింది. కొట్లాటకు దారితీసింది. సీఐలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. సీఐ ప్రేమ్‌కుమార్ 100కు డయల్ చేసి సమాచారం అందించడంతో పీఎం పాలెం పోలీసులు అక్కడకు వెళ్లి ఘర్షణపై వివరాలు సేకరించారు. మంగళవారం సీఐలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (క్లిక్: ఔను.. ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
8 లక్షలు పెట్టి ఆడీ కారు.. పార్కు చేసిన చోటే మాయం
సాక్షి, చిలకలగూడ : పార్కింగ్ చేసిన ఆడీ కారు మాయమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ లెజెండ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న రోమిత్‌పటేల్ తన స్వస్థలమైన గుజరాత్లో ఆడీ కారును సెకండ్స్లో రూ.8 లక్షలకు కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు. సోమవారం ఉదయం అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కు చేశాడు. మ.1.30 గంట సమయంలో చూడగా కారు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఐ సంజయ్‌కుమార్ తెలిపారు. చదవండి: నిన్న రోడ్డెక్కిన తండ్రి.. నేడు చెట్టెక్కిన కొడుకు -
వారెవ్వా.. వాట్ ఏ డ్రైవింగ్ స్కిల్స్
తిరువనంతపురం : హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పార్కింగ్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ చిన్న సందు దూరినా ఎలాంటి ఆలోచన లేకుండానే మన వాహనాలను పార్క్ చేస్తాం. కారు పట్టే సందు ఉందా.. లేదా అనేది ఆలోచించకుండానే అడ్డగోలుగా పార్క్ చేసినా.. తీరా అది బయటకు తీయాలంటే మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. బైక్ అయితే అంతో ఇంతో కష్టపడి తీయొచ్చు గాని.. కార్లు అలా కాదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వాహనాలు దెబ్బతినడం గ్యారంటీ. కానీ కేరళకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన డ్రైవింగ్ స్కిల్స్‌తో అబ్బురపరిచాడు. (చదవండి : వైరల్: పబ్జీకి అంతిమ వీడ్కోలు) వివరాలు.. కేరళలోని మనంతవాడికి చెందిన పిఎస్ బిజూ ఒకపని మీద తన ఇన్నోవా కారులో వచ్చాడు. తన బండిని పార్క్‌ను చేసేందుకు చిన్న స్థలాన్ని ఏంచుకున్నాడు. నిజానికి ఆ స్థలాన్ని చూస్తే కారు పడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ బిజూ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఇన్నోవాను పార్క్ చేశాడు. తరువాత పని ముగించుకొని వచ్చిన బిజూ కారును ఎలా బయటకు తీస్తాడో చూడాలనిపించింది. కేవలం చిన్నపాటి ట్రిక్ ఉపయోగించి బైక్‌ను బయటకు తీసినంత సులువుగా ఇన్నోవాను చిన్న దెబ్బ కూడా తగలకుండా తీశాడు. ఇదంతా బిజూ భార్య అతనికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. మళయాలి డ్రైవర్ అద్భుతమైన స్కిల్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అద్భుతమని.. అతని నైపుణ్యతకు జోహార్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(చదవండి : ఫేక్ న్యూస్’ను ప్రశ్నించడం తప్పా!?) That’s Malayalee Driver for you , salute his skill and confidence! Few saw how he took out the car earlier this has both how he parked and how took it out from parking ! Kudos to the guy 👏🏼👏🏼 pic.twitter.com/JwJrCIjTyn — Vijay Thottathil (@vijaythottathil) September 7, 2020 ఇదే విషయమై బిజూను అడిగితే.. అది నా స్నేహితుడి కారు.. కారుకు సంబంధించి పేయింట్ వర్క్ ఉంటే అతను బిజీగా ఉండడంతో ఆదివారం కారును తీసుకొని వర్క్‌షాప్‌కు వెళ్లాను. కారుకు సంబంధించి పని ముగించుకున్న తర్వాత నా భార్యతో కలిసి అదే కారులో షాపింగ్‌కు వెళ్లా.. నేను కారు పార్క్ చేసే సమయంలో నా భార్య వీడియో తీస్తుందని తెలియదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. వీడియోలో ఉన్నది నేనే అని తెలుసుకొని ఆశ్చర్యపోయా. కానీ బేసిక్‌గా నేను 12 మీటర్ల పొడవున్న పెద్ద పెద్ద వాహనాలను నడిపిన అనుభవం ఉండడంతో కారును బయటకు తీయడం పెద్ద కష్టమనిపించలేదు. వాహనం పార్క్ చేసే ముందు కారు సైజ్ ఎంత.. అది అక్కడ పడుతుందా లేదా అన్నది తెలుసుకొని రంగంలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చాడు. -
పార్కింగ్ చేయడానికి సూపర్ ఐడియా..
ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా దృష్టి ఈ సారి ఓ కార్ డ్రైవర్‌పై పడింది. ఖరీదైన కార్లున్నా వాటిలో ప్రయాణించేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏమిటంటే వాటిని పార్క్ చేయడానికి స్థలాన్ని కనుగొనడం. అయితే, ఇప్పుడు మనకు పరిష్కారం దొరికినట్లు ఉందంటూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పై అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఉన్న ఓ వీడియోను పంచుకున్నారు. 'కొంతకాలం క్రితం పంజాబ్‌లో ఇలాంటి పరికరం ఉపయోగిస్తున్న వీడియోను చూశాను. పార్కింగ్ కోసం కచ్చితమైన కొలతలతో అతను తయారుచేసిన ఆ మెటల్ ప్యానెల్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. దీన్ని రూపొందించిన వ్యక్తి మా ఫ్యాక్టరీ లే అవుట్లను కూడా మరింత సమర్థవంతంగా రూపొందించడానికి కొన్ని ప్రత్యేక సూచనలను ఇవ్వగలరని నేను పందెం వేస్తున్నాను!' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. చదవండి: మూడు విడతలుగా లాక్డౌన్ ఎత్తివేత అయితే ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కారును ఇంటి వెలుపల మెటల్ ప్యానెల్‌పై పార్క్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఈ ప్యానెల్ సాధారణంగా మెకానిక్ షాపుల్లో కనిపించే వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అతడు తన కారును ఆ ప్యానెల్ పై పార్క్ చేసిన తర్వాత, కారు నుంచి బయటకు వచ్చి కారుతో పాటు మొత్తం ప్యానెల్‌ను తన ఇంటి మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలంలోకి నెట్టడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ వీడియోపై స్పందిస్తూ.. కార్ పార్కింగ్ కోసం అక్కడున్న చెట్టును తొలగించకుండా అతను అనుసరించిన విధానం బాగుందంటూ ప్రశంసలు కురుపిస్తున్నారు. -
ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు
చండీగఢ్ : కారు పార్కింగ్‌లో గొడవ జరిగి ప్రముఖ కబడ్డీ ఆటగాడిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది. మృతి చెందిన కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్‌గా గుర్తించారు. కాగా, కాల్పులకు పాల్పడిన ఏఎస్సై పరమ్‌జీత్ సింగ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే.. పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్ గురువారం రాత్రి తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్(ఎస్యూవీ) కారులో రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు ఓ రోడ్డు పక్కన వారి కారును పార్క్ చేసి అందులోనే కూర్చొని ఉన్నారు. ఇదే సమయంలో... మరో ఎస్‌యూవీలో ఏఎస్సై పరంజీత్‌సింగ్ అటుగా వచ్చాడు. ఇక్కడ ఎందుకు పార్కింగ్ చేశారు? అని అర్విందర్‌ను ప్రశ్నించారు. దీనికి అర్విందర్ సమాధానం చెప్పకుండా కారును స్టార్ట్ చేసి స్పీడ్‌గా దూసుకెళ్లాడు. దీంతో ఏఎస్సైకి అనుమానం వచ్చి వారి కారును ఛేజింగ్ చేశారు. అర్విందర్ సింగ్(ఫైల్ ఫోటో) పోలీసులు వదలట్లేదని భావించిన అర్విందర్... ఓ చోట కారు ఆపి తనతోపాటూ కారులో ఎవరెవరు వచ్చారో చెప్పడానికి వెనక్కి తిరిగాడు. ఇంతలో తన వెహికిల్ నుంచి కిందకు దిగిన ఏఎస్సై... అర్విందర్‌పై కాల్పులు జరిపాడు.దీంతో అర్వింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు ప్రదీప్ సింగ్‌కి గాయాలయ్యాయి. వెంటనే అతని ఫ్రెండ్స్... కారు దిగి... ఫైరింగ్ ఆపమని వేడుకున్నారు. దాంతో ఏఎస్సై ఆగాడు. ఆ తర్వాత అదే వెహికిల్‌లో అర్విందర్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. కాగా, అర్విందర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సైపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. -
చెన్నైలోని ఓ కారు గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం
-
మరో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 150 కార్లు
సాక్షి, చెన్నై: చెన్నై సమీపంలోని పోరూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. ఓ ప్రైవేటు కారు గోడౌన్లో భారీగా మంటలు వ్యాపించాయి. సుమారు 150కు పైగా కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కార్లలోని ఇంధనం అగ్నికి ఆజ్యం పోసింది. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా శనివారమే బెంగళూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో 150కు పైగా కార్లు బుగ్గిపాలైన విషయం తెలిసిందే. -
కారుకింద తోసి చంపిన డీఎస్పీ.. అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ ఓ వ్యక్తిని నెట్టేసి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ హరికుమార్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే, 34 ఏళ్ల సనాల్ మృతికి కారణమైన హరికుమార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. కాగా, ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.. ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (మాట్లాడుతుండగానే కారుకింద తోసేశాడు..!) ఇదిలాఉండగా.. సనాల్ మృతి చెందినప్పటి నుంచి (నవంబర్,5) పరారీలో ఉన్న హరికుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కేరళతో పాటు తమిళనాడులో సైతం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హరికుమార్‌ను ఈ కేసు నుంచి తప్పించేందుకు అధికార కమ్యూనిస్టు పార్టీ యత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. నిందితున్ని పట్టుకోవడంలో కావాలనే జాప్యం చేస్తోందని పోలీసు శాఖపై ఆరోపణలు చేశాయి. సనాల్ మృతి అనంతరం డీఎస్పీ హరికుమార్ పారిపోయేందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. -
మాట్లాడుతుండగానే..
తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని ఓ పోలీసు కర్కశంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. సనాల్ అనే వ్యక్తి రోడ్డు పక్కన కారు నిలిపాడు. ఇది గమనించిన నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలపొద్దని చెప్పాడు. కారు తియ్యాలని హెచ్చరిస్తూ తోసేశాడు. దీంతో సనాల్ రోడ్డుపై పడడంతో అటుగా వెళ్తున్న వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన సనాల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. నిందితుడు హరికుమార్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. డీఎస్పీని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేసును దర్యాప్తును ఏఎస్పీకి అప్పగించామని తెలిపారు. హరికుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేశామనీ, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. డీఎస్పీ హరికుమార్ డ్యూటీలో లేడనీ, తన నివాసానికి వెళ్తున్న క్రమంలో సనాల్‌ను కారుకింద తోసేసి చంపేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
సెల్‌ఫోన్ చూస్తే.. ఇలాంటి చావులే?!
మొబైల్.. ఇప్పుడు హస్తాలంకార భూషణంగా మారిపోయింది. చిన్నాపెద్దా, ఆడమగా అన్నా తేడా లేకుండా.. స్మార్ట్‌ఫోన్ చూస్తూ పనులు చేస్తున్నాం. ఇంట్లో ఉన్నా.. ప్రయాణాల్లో ఉన్నా... ఎక్కడున్నా కళ్లు మాత్రం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీదే. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న యువతి కూడా అచ్చం మనలాంటిదే. పేరు తెలియదు కానీ.. చైనాలోని నాన్జింగ్ సిటీలో నివసిస్తోంది. సఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లేందుకు పార్కింగ్ ప్లేస్‌కు వచ్చింది. అక్కడ కూడా కార్ పార్కింగ్‌ను గమనించకుండా.. స్మార్ట్ స్క్రీన్ మీద వేళ్లు టకటకలాడిస్తూ.. ముందుకు నడుస్తోంది. చైనాలోని కార్యాలాయాల్లో పార్కింగ్ మొత్తం అడ్వాన్స్డ్ స్థాయిలో ఉంటుంది. అండర్‌గ్రౌండ్‌లో కార్లను వరుసగా.. ఒకదానిమీద ఒకటి పేరుస్తారు. అవసరమైన కారును లిఫ్ట్ సహాయంతో బయటకు తెస్తారు. ఆ సమయంలో కార్ లిఫ్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫొన్ చూసుకుంటున్న యువతి.. ఆ ధ్యాసలోనే కార్ లిఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లకు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టం ఉండడంతో యువతి అక్కడే ఆగిపోయింది. ఇంతలో లిఫ్ట్ కిందకు దిగడం.. అదే సమయంలో.. వెంటనే ఎదురుగా కారు రావడం.. ఆమెను ఢీ కొట్టడం వేగంగా జరిగిపోయాయి. ప్రాణం పోయినంత పనైనా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సీసీటీవీలో రికార్డయిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
మా రూల్స్.. మేమే పాటించం
పంజగుట్ట సర్కిల్లో హైదరాబాద్ సెంట్రల్ ముందు నో పార్కింగ్ బోర్డును పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ పార్కింగ్ చేస్తే ఫొటోలు తీసుకొని ఈ–చలానాలు పంపిస్తుంటారు. అయితే పోలీసు వెహికల్ మాత్రం నిత్యం ఇక్కడే పార్కింగ్ చేసి ఉంటుంది. మరి చలానా వేసి ఎవరికి పంపుతారో..! -
ఢిల్లీకి చేరిన కారు పార్కింగ్ గొడవ
నగరంలో నైజీరియన్ దేశస్తుడిపై దాడి కేసు నమోదు.. ఒకరి అరెస్టు ఘటనపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర మంత్రి సుష్మ బంజారాహిల్స్: ఇంటి ముందు అక్రమంగా కారు పార్కింగ్ చేయడమే కాకుండా తీయమని అడిగినందుకు వాగ్వాదానికి దిగిన నైజీరియన్ దేశస్తుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అబ్దుల్ గఫూర్‌పై కేసు నమో దు చేశారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడికుంటలో నైజీరియాకు చెందిన డమిలోలా ఖాజీం(26) అద్దెకు ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న అబ్దుల్ గఫూర్ ఇంటి ముందు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం ఖాజీం తన కారును (ఎంహెచ్ 02 ఏఎల్ 7491) పార్కింగ్ చేశాడు. అయితే తన ఇంటి ముందు కారును ఎందుకు పార్కింగ్ చేశావంటూ గఫూర్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అదే సమయంలో స్థానికంగా నివసించే అయిదారుగురు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నైజీరియన్ విద్యార్థి ఖాజీంపై దాడి జరిగింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను సమీపంలోని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో బస్తీ పెద్దలు కూర్చొని సమస్యను సద్దుమణిగేలా చేశారు. అయితే శుక్రవారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అసోసియేషన్ ఆఫ్ నైజీరియన్స్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు ఓమో బోవాలే సివెన్ గిడియోన్ రంగప్రవేశం చేసి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్తో కేసు వ్యవహారం మాట్లాడారు. అంతే కాదు ఈ దాడి విషయం శుక్రవారం ఢిల్లీదాకా వెళ్లింది. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఈ కేసు విషయంపై మాట్లాడాల్సిన పరిస్థితి రావడంతో దాడి ఘటన పెద్దదైంది. ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడ్డాడంటూ గఫూర్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 324కింద అరెస్టు చేశారు. పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందంటూ నైజీరియన్ తమకు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే తాను వాగ్వాదానికి దిగిన మాట వాస్తవమేనని దాడికి పాల్పడలేదని గఫూర్ తెలిపాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో నైజీరియన్‌పై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నివేదిక కోరారు. బుధవారం హైదరాబాద్‌లో పార్కింగ్ విషయంలో 23 ఏళ్ల నైజీరియన్ యువకుడిపై స్థానిక యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందే ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ కాంగో యువకుడిని స్థానికులు చిన్న వివాదానికే చంపారు. భారతదేశంలో చదువుకునే వేలమంది ఆఫ్రికన్ విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పించకపోవడంతో ఆ దేశాల రాయబారులు అసహనానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నివేదిక కోరినట్లు తెలిసింది. -
కారును పార్క్‌చేసే రోబో
సినిమాకో, షాపింగ్ పనిమీదనో బయటికి వెళ్లినపుడు కారు పార్కింగ్ కోసం పెద్దగా హైరానా పడాల్సిన పనిలేదిక. అత్యాధునిక టెక్నాలజీతో తయారైన రోబో అందుబాటులోకి వచ్చేసింది. డ్రైవర్‌తో పనిలేకుండా... డ్రైవర్‌తో పోల్చితే ఈ రోబో అదే స్థలంలో 60శాతం ఎక్కువ కార్లను పార్క్ చేయగలదని దీన్ని తయారుచేసిన కంపెనీ చెబుతోంది. ‘రే’గా పిలుచుకునే ఈ అధునాతన రోబో ప్రస్తుతం జర్మనీ దేశంలోని దసెల్డోర్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిలో బిజీగా ఉంది. వెహికల్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో మనం కారును వదిలేస్తే చాలు ఇదే తన పని కానిచ్చేస్తుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే రోబో... కారు పొడవు, వెడల్పు, ఎత్తులను స్కాన్‌చేసి నాలుగు ఫోర్క్‌ల సాయంతో కారును పెకైత్తి కారుకు సరిపోయే స్థలాన్ని ఎంపికచేసి అక్కడ పార్క్ చేస్తుంది. మనకు కారు కావాల్సినపుడు టికెట్‌ను ఇచ్చేస్తే దగ్గరిలోని వెహికల్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌కు కారును తెచ్చి వదిలేస్తుంది. -
హార్ట్ ఆఫ్ ది సిటీ
=అందమైన మురికి కూపం! =జాడ లేని మల్టీ లెవల్ కాంప్లెక్స్ =ఫైళ్లలో మూలుగుతున్న కార్ పార్కింగ్ జోన్ = అడుగు ముందుకేయని టెండర్లు గ్రేటర్ సిటీకి గుండెకాయ లాంటి స్థలం. నగరం నడిబొడ్డున హన్మకొండ చౌరస్తాకు వెళ్లే మెయిన్ రోడ్డుపై, డీసీసీ భవన్‌ను ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ఈ స్థలం ఖాళీగా ఉంటోంది. హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ను తలపించే ఖరీదైన సెంటర్లో ఇదో మురికి కూపంగా నగరానికి వచ్చి వెళ్లే వారందరినీ వెక్కిరిస్తోంది. ఆరు వేల చదరపు గజాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని... ఉపయోగించుకునే ఆలోచన లేకపోవడం అధికారుల ప్రణాళికాలోపానికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: థియేటర్లు, హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు... ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కిక్కిరిసిన చోట ఉన్న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థిరాస్తి... పాత మునిసిపల్ కార్యాలయ ఖాళీ స్థలం వైపు కార్పొరేషన్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మయం కలిగిస్తోంది. 2004లో అప్పటి పాలకవర్గం ఇక్కడ మల్టీ లెవల్ కమర్షియల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని తీర్మానించింది. రెండు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2005లో రాజీవ్ నగరబాటలో భాగంగా జిల్లాకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రూ. 13 కోట్లతో ఇక్కడ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ లేకపోవడంతో కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. దీంతో ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిన పూర్తి చేయాలని టెండర్లను ఆహ్వానించింది. అప్పట్లో ఐదు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా.. చివరకు రెండు సంస్థలు నిర్మాణానికి ముందుకొచ్చాయి. కానీ... అప్పటి పాలకవర్గంలో పెద్దల ఆధిపత్య పోరుతో ఈ నిర్మాణం పెండింగ్‌లో పడింది. కమర్షియల్ కాంప్లెక్స్ టు కార్ పార్కింగ్ జోన్ గత ఏడాది ఈ ప్రాజెక్టుపై ఇటీవల బదిలీపై వెళ్లిన బల్దియూ కమిషనర్ వివేక్‌యాదవ్, ఎస్ఈ శ్రీధర్ దృష్టి సారించారు. ఐదంతస్తుల మల్టీ లెవల్ పార్కింగ్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. కార్పొరేషన్ వద్ద ప్రాజెక్టుకు సరిపడే నిధులు లేనందున పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఫైళ్లు కదిపారు. అండర్ గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లో వాహనాల పార్కింగ్, మూడు, నాలుగో అంతస్తులో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. వరంగల్ గ్రేటర్ సిటీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయూల్సి ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు ఐదో అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. హన్మకొండ చౌరస్తా సమీపంలో ఉండడంతో.. షాపింగ్ కాంప్లెక్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా నిట్ ప్రొఫెసర్లతో అధ్యయనం చేయించారు. చివరకు కాంప్లెక్స్‌కు బదులుగా 750 కార్లు పార్కింగ్ చేసేందుకు వీలుగా ‘కంప్యూటర్ కంట్రోల్డ్ మల్టీ టైర్ కార్ పార్కింగ్ జోన్’ నిర్మించాలని నిర్ణయించారు. ఒప్పందం దశలో మూలకుపడ్డ ఫైళ్లు కార్ పార్కింగ్ జోన్ డిజైన్ మొదలు నిర్మాణం, నిధులు, నిర్వహణ బాధ్యతలన్నీ టోల్గేట్ తరహాలో పీపీపీ పద్ధతిన అప్పగించేందుకు కార్పొరేషన్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచారు. నాలుగు కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా... పూణేకు చెందిన ఇక్రా(ఐసీఆర్ఏ), హైదరాబాద్‌కు చెందిన నావోలిన్, ఇగిస్ ఇండియా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీలు సాంకేతికంగా అర్హత సాధించాయి. సాంకేతిక, ఆర్థిక ప్రమాణాలు, అర్హతల ఆధారంగా ఈ ప్రాజెక్టును వీటికి కట్టబెట్టాలి. తీరా.. నిర్ణయం తీసుకునే సమయంలో అధికారులు ఫైళ్లు పక్కన పడేశారు. దీంతో ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ఒప్పందం దశకు చేరుకోలేదు. దీంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలం మళ్లీ ఫైళ్లలోనే మూలనపడింది. పెద్ద గుంత తవ్వి ఉండడంతో నీళ్లు నిలిచి ఈ ప్రాంతం మురికికూపంలా తయూరైంది. రోడ్డు వైపు కచోరి బండ్లు, చలికాలంలో నేపాలీల స్వెటర్ల వ్యాపారం ఇక్కడ వర్ధిల్లుతోంది. కానీ.. తొమ్మిదేళ్ల కిందట తలపెట్టిన ప్రాజెక్టుకు ఇప్పటికీ మోక్షం లేకపోవడం కార్పొరేషన్ పనితీరుకు అద్దం పడుతోంది.