ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : కేరళలో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని ఓ పోలీసు కర్కశంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. సనాల్ అనే వ్యక్తి రోడ్డు పక్కన కారు నిలిపాడు. ఇది గమనించిన నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలపొద్దని చెప్పాడు.
కారు తియ్యాలని హెచ్చరిస్తూ తోసేశాడు. దీంతో సనాల్ రోడ్డుపై పడడంతో అటుగా వెళ్తున్న వాహనం అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన సనాల్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. నిందితుడు హరికుమార్ పరారీలో ఉన్నాడు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. డీఎస్పీని సస్సెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేసును దర్యాప్తును ఏఎస్పీకి అప్పగించామని తెలిపారు. హరికుమార్‌పై మర్డర్ కేసు నమోదు చేశామనీ, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. డీఎస్పీ హరికుమార్ డ్యూటీలో లేడనీ, తన నివాసానికి వెళ్తున్న క్రమంలో సనాల్‌ను కారుకింద తోసేసి చంపేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment