
పంజగుట్ట సర్కిల్‌లో హైదరాబాద్ సెంట్రల్ ముందు నో పార్కింగ్ బోర్డును పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ పార్కింగ్ చేస్తే ఫొటోలు తీసుకొని ఈ–చలానాలు పంపిస్తుంటారు. అయితే పోలీసు వెహికల్ మాత్రం నిత్యం ఇక్కడే పార్కింగ్ చేసి ఉంటుంది. మరి చలానా వేసి ఎవరికి పంపుతారో..!