trafic polices
-
కోఠి ప్రాంతంలో మహిళ హంగామా
-
రాంగ్ పార్కింగ్‌కు రూ. 23 వేల జరిమానా
ముంబై: రాంగ్ పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధించేలా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), ముంబై ట్రాఫిక్ పోలీసులు కలిసి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలను పార్క్ చేస్తే రూ. 5 వేల నుంచి 23 వేల వరకూ జరిమానా విధించనున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ద్విచక్ర వాహనాలకు రూ. 5 వేల నుంచి రూ. 8,300 వరకు, నాలుగు చక్రాల వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 23,500 వరకు జరిమానా విధిస్తారు. అలాగే మధ్య స్థాయి వాహనదారులకు రూ. 11 వేల నుంచి 17,600 వరకు, లైట్ మోటార్ వాహనాలకు రూ. 10 వేల నుంచి రూ. 15,100 వరకు, మూడు చక్రాల వాహనాలకు రూ. 8 వేల నుంచి రూ. 12,200 వరకు పెనాల్టీ పడనుంది. వాహనదారులు ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్క్ చేస్తున్నారని, దాని వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందని బీఎంసీ అధికారులు తెలిపారు. తాజా నిబంధనలతో ట్రాఫిక్ జామ్ తగ్గుతుందన్నారు. జరిమానా వెంటనే చెల్లించకపోతే, రోజురోజుకూ అది పెరుగుతుందన్నారు. ట్రాఫిక్ పోలీసులకు తోడుగా విశ్రాంత సిబ్బందిని, ప్రైవేటు సిబ్బందిని కూడా తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. పార్కింగ్ వసతి ఉన్న ప్రాంతాల్లో మొదట ఈ నిబంధనలు అమలవుతాయని తెలిపారు. ముంబైలో 30 లక్షల వాహనాలున్నట్లు ఓ అంచనా. -
హైదరాబాద్: ఆరుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగర్ రాహుల్
-
తాగి నడిపితే జైలుకే..
మంచిర్యాలక్రైం: మద్యం తాగి వాహనాలు నడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ డ్రైవింగ్ ప్రమాదమని తెలిసినా మత్తులోనే వాహనం నడుపుతున్నారు. వారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతరుల మరణాలకూ కారణమవుతున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం డ్రంక్‌అండ్‌డ్రైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ తాగి వాహనం నడిపే వారిని జైలుకు పంపిస్తున్నారు. పెరుగుతున్న కేసులు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరుతుండడంతో ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. మద్యం తాగి వాహనాలు నడపడంతో మంచిర్యాల జిల్లాలో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జాతీయ రహదారిపై మంచిర్యాల జిల్లా మీదుగా వెళ్లడంతో మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించేందుకు శ్రీరాంపూర్, సీసీసీ, ఏసీసీ, పాత మంచిర్యాల సమీపంలో పోలీసులు తరుచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూర్, బెల్లంపల్లి ప్రాంతాలకు ప్రధాన కేంద్రం మంచిర్యాల కావడంతో నిత్యం రోజుకు లక్షాలాది మంది ప్రజలు వ్యాపారులు, ఉద్యోగులు, మంచిర్యాలకు వచ్చి పోతుంటారు. ఈ క్రమంలో ఇక్కడనే మందు, విందు అన్ని రకాల పనులు చేసుకొని వెళ్తుంటారు. ఈ క్రమంలో శ్రీరాంపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై, శ్రీ రాంపూర్, లక్సెట్టిపేట వైపునకు వెళ్లే రహదారులపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే రహస్యంగా బెల్ట్‌షాపులు, దాబాల్లో అక్రమ సిట్టింగులు ఉండటంతో వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. పర్సెంటేజీ ప్రకారమే శిక్ష డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి మద్యం తాగిన పర్సేంటేజీని బట్టి కేసు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపే విధానాన్ని ఖరారు చేశారు. సుమారు 30కి పైగా పర్సెంటేజీ వస్తే పోలీసులే జరిమానా విధించి, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. రెండుసార్లు పట్టుబడితే కేసులు నమోదు చేసి జైలుపు పంపుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో 9,477 మందిపై కేసులు నమోదు కాగా, ఇందులో 459 మంది జైలుకు వెళ్లారు. శిక్ష పడిన వారి లైసెన్స్‌ను కూడా రద్దు చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారు ప్రమాదంలో మృతి చెందినా, గాయపడ్డ ఎలాంటి బీమా సదుపాయం వర్తించదని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడం గమనార్హం. అవగాహన కల్పిస్తున్నా.. జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌తో జరుగుతున్న ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీడ్రైవర్లు ఇతర ప్రైవేటు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ ఇటీవల కళాకారుల మద్యం, పేకాట, డ్రంకన్ డ్రైవ్, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల నిర్మూలనకు కళాబృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళాబృందాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కళాబృందాలతో ఆటాపాటల ద్వారా మద్యం తాగడం వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా మందుబాబులు పట్టుపడుతూనే ఉన్నారు. -
జూబ్లీహిల్స్,బంజారాహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్
-
ఫైన్ వేసినా మారడం లేదు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ సూచించారు. హెల్మెట్లు ధరించని వారికి ఫైన్ (జరిమానా) వేస్తున్నామని, అయినా వారిలో మార్పులు రావటం లేదన్నారు. అందుకే హెల్మెట్లు ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ వాడకంపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో సీపీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. సీపీ స్వయం గా బైక్‌ను నడిపారు. కంఠేశ్వర్ కమాన్, ధర్నాచౌక్, రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవిరోడ్డు చౌరస్తా, గాంధీచౌక్, నెహ్రూ పార్కు పెద్దబజార్, న్యాల్కల్ చౌరస్తా, పూలాంగ్‌చౌరస్తా, ఎల్లమ్మగుట్టచౌరస్తా, రైల్వేకమాన్, కంఠేశ్వర్ బైపాస్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం సీపీ మాట్లాడుతూ తల భాగం ఎంతో సున్నితమైందని, రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించక పోవటంతోనే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్‌ను ధరించాలన్నారు. అదనపు ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్రావు, ట్రాఫిక్ ఎస్సైలు పాల్గొన్నారు. సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ పోలీస్ కమిషనర్ కార్తికేయ గురువారం మధ్యహ్నం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎస్సైలతో మాట్లాడారు. ఆదివారం శ్రీరామ నవమి పండుగ నేపథ్యలో నిర్వహించే ర్యాలీలకు బందోబస్తు చర్యలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రామాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడు ప్రధాన అంశాలపై కరపత్రాల విడుదల రహదారి భద్రత, ఆత్మహత్యల నివారణ వంటి ఏడు ప్రధాన అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పోలీస్‌శాఖ ఏడు కరపత్రాలను విడుదల చేసింది. సీపీ కార్తికేయ గురువారం కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కళాబృందాలకు ఆయా కరపత్రాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో కళాబృందాలు పర్యటిస్తాయన్నారు. ప్రజలలో చైత్యనం వచ్చినప్పుడే ఆ ప్రాంతంలో నేరాలు తగ్గుతాయని, అందుకోసం పోలీస్‌శాఖ తరపున ఏడు అంశాలపై కరపత్రాలు రూపొందించిందని చెప్పారు. ఎస్బీ సీఐ–2 రాజశేఖర్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సాయాగౌడ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఏఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం గుండె నొప్పితో మృతి చెందిన ఏఎస్సై కుటుంబానికి సీపీ కార్తికేయ గురువారం ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. మాక్లూర్ పోలీస్‌స్టేష¯న్కు చెందిన ఏఎస్సై పోచయ్య జనవరి 11న గుండె నొప్పితో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబానికి పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మొత్తం ఒకరోజు వేతనాన్ని డెత్ ఫండ్ (ఆర్థిక సాయం) రూపంలో రూ.1,29,300 చెక్కును సీపీ పోచయ్య భార్య రుక్మాబాయికు అందజేశారు. ఎస్బీ సీఐ వెంకన్న, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా, రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి ఎస్ఎస్ జై కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సిలింగ్‌కు వస్తాడా...?
-
మా రూల్స్.. మేమే పాటించం
పంజగుట్ట సర్కిల్లో హైదరాబాద్ సెంట్రల్ ముందు నో పార్కింగ్ బోర్డును పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ పార్కింగ్ చేస్తే ఫొటోలు తీసుకొని ఈ–చలానాలు పంపిస్తుంటారు. అయితే పోలీసు వెహికల్ మాత్రం నిత్యం ఇక్కడే పార్కింగ్ చేసి ఉంటుంది. మరి చలానా వేసి ఎవరికి పంపుతారో..! -
100 సీసీ బండి..ఒక్కరికేనండీ
సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా పోలీసు, విద్యా శాఖలు ఉమ్మడిగా ముందుకు సాగనున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిలో కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు, శిక్షలు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు రోడ్ల దురవస్థ ప్రధాన కారణం కాగా, ద్విచక్ర వాహనాలు రెండో కారణం. ఈ విషయం గుర్తించిన రవాణా శాఖ వివిధ శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టనుంది. కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల్లో వెనక మరొకరు కూర్చొని ప్రయాణం చేయడం నిషిద్ధం. అయినా ఇది అమలు కావడం లేదు. మైసూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సందర్భంగా కొంతమంది హైకోర్టులో గతంలో ప్రజాహిత వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయం పై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల పై ఇక పై పిలియన్ రైడర్స్ (వెనక కుర్చొని ప్రయాణం)కు అవకాశం కల్పించబోరు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో ద్విచక్రవాహనాల్లో దాదాపు 25 శాతం ద్విచక్రవాహనాలు, స్కూటీల్లో ఒక్కరే ప్రయాణించాల్సిందే. ఈ విధానాన్ని మొదట బెంగళూరులో అమలు చేస్తారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. 50 సీసీలకు తగ్గించే ఆలోచన ఉంది: రవాణాశాఖ కమిషనర్ : ఈ విషయమై రవాణాశాఖ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ... న్యాయస్థానం సూచన మేరకు 100 సీసీ, అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడ్‌కు అనుమతించబోము. ఈ నిబంధన కొత్త వాహనాలకు మాత్రమే. ఇప్పటికే కొనుగోలు చేసిన వాటికి వర్తించదు. అయితే 100 సీసీ విషయంలో కొంత వెలుసుబాటు కల్పించే ఆలోచన ఉంది. ఆ సామర్థ్యాన్ని 50 సీసీకు తగ్గించే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపనున్నాం.’ అని పేర్కొన్నారు. విద్యార్థుల బైక్‌లపై నియంత్రణ : నగరంలో ఇటీవల డ్రాగ్రేసులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఈ డ్రాగ్రేసులో ఎక్కువ టీనేజర్లు పాల్గొంటున్నారు. ఈ రేసులు వికటించి యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ డ్రాగ్రేసుల్లో పాల్గొనేవారు ఎక్కువగా విద్యార్థులేనని తేలింది. పాఠశాలలకు బైక్‌లు తీసుకువెళ్లి అక్కడి నుంచి రేసింగ్‌కు వెళుతున్నారు. వీరిలో చాలమందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డీఎల్లేని వారికి విద్యార్థులకు విద్యాసంస్థల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించకూడదని రవాణాశాఖ విద్యాశాఖను కోరింది. ఇందుకు విరుద్ధంగా జరిగితే సదరు విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలన్న రవాణాశాఖ సూచనను కూడా విద్యాశాఖ అంగీకరించింది. మొదట విద్యా సంస్థల్లో అటు పై మాల్స్, సినీథియోటర్లలో ఈ నిబంధనను అమలు చేయనున్నారు. పిల్లలు నడిపితే పెద్దలపై చర్యలు : ఇక మైనర్లు డీఎల్ లేకుండా బైకులు, కార్లు నడిపితే ఆ వాహనం ఎవరి పైన రిజిస్టర్ అయ్యిందో వారిపై కేసు వేసి అపరాధరుసుం వసూలు చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇందుకు అవసరమైన నిర్థిష్ట చట్టం కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989లో లేదు. దీంతో పోలీసులు, న్యాయశాఖతో చర్చలు జరిపి మైనర్లు తప్పుచేస్తే వారి తల్లిదండ్రులు లేదా సదరు వాహనం రిజిస్టర్ అయిన వారి పై క్రిమినల్ కేసులు నమోదుచేయనున్నారు. ఈ పరిణామాలతో ద్విచక్రవాహనాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను చాలా వరకూ నియంత్రిచవచ్చునని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లలో బెంగళూరులో రోడ్డు ప్రమాదాలు ఏడాది మొత్తంప్రమాదాలు మృతులు గాయపడినవారు 2015 4828 740 4047 2016 7506 793 4193 2017 3818 499 3182(సెప్టెంబర్ 30) -
తాగి నడపవద్దు... కాన్సెప్ట్
♦ హెయిర్ కటింగ్‌లోనూ సామాజిక కోణం ♦ తాగి వాహనాలు నడపొద్దన్న కాన్సెప్ట్ ♦ విజయ్‌కుమార్ సృజన గోపాలపట్నం (విశాఖపట్నం) : ఎంఎఫ్‌డీ సెలూన్ నిర్వాహకుడు ఆతవ విజయకుమార్ తన నైపుణ్యాన్ని మరోమారు ప్రదర్శించారు. తన సృజనాత్మకతకు సామాజిక కోణాన్ని జోడించి హెర్ స్టయిల్ రూపొందించారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న అనర్ధాలపై ప్రచారం చేపట్టాలని భావించిన ఆయన పరమేశ్వర్ అనే ఔత్సాహికుని తలపై శనివారం ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని మోడలింగ్ హెయిర్ డిజైనింగ్ చేశారు. విజయకుమార్లో వున్న సామాజిక స్పృహను ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్, ఎస్ఐ డీవీఎస్ వర్మ, ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. -
ఆటోవాలాలకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఆటో, టాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఊరట లభించే నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కారు తీసుకుంది. ఓవర్ చార్జింగ్, ప్రయాణీకులు అడిగిన చోటికి రానని నిరాకరించడం, పీఎస్బీ బ్యాడ్జిలు, యూనిఫారం ధరించకుండా వాహనం నడపడం వంటి చిన్న నేరాలకు ఆటో, టాక్సీ డ్రైవర్లపై కేసు నమోదు చేసే అధికారాన్ని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ కమిషనర్ గీతాంజలి గుప్తా అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర రవాణా అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయవలసి ఉంది. ఆ తరువాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మోటారు వాహనచట్టం నిబంధనల ప్రకారం 66/192ఏ కింద యూనిఫారం ధరించకపోవడం, అడిగిన చోటికి రానని నిరాకరించడం, స్టాండ్ వద్ద ప్రయాణికున్ని ఎక్కించుకోకపోవడం, పోలీస్‌ల హెల్ప్‌లైన్ నంబర్లను ప్రదర్శించకపోవడం వంటి చిన్న నేరాలకు జరిమానా విధించడం, వాహనాలను స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు ట్రాఫిక్ పోలీసులకు ఉన్నాయి. ఇటువంటి మామూలు ఉల్లంఘనలకు ఆటోవాలాలను శిక్షించే అధికారాన్ని ట్రాఫిక్ పోలీసుల వద్ద నుంచి తొలగించనున్నారు. కాగా, లెసైన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ లేకుండా వాహనాలను నడపడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడేవారిపై మాత్రం ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడతారు.