
తాగి నడపవద్దు... కాన్సెప్ట్
♦ హెయిర్ కటింగ్‌లోనూ సామాజిక కోణం
♦ తాగి వాహనాలు నడపొద్దన్న కాన్సెప్ట్
♦ విజయ్‌కుమార్ సృజన
గోపాలపట్నం (విశాఖపట్నం) : ఎంఎఫ్‌డీ సెలూన్ నిర్వాహకుడు ఆతవ విజయకుమార్ తన నైపుణ్యాన్ని మరోమారు ప్రదర్శించారు. తన సృజనాత్మకతకు సామాజిక కోణాన్ని జోడించి హెర్ స్టయిల్ రూపొందించారు. తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న అనర్ధాలపై ప్రచారం చేపట్టాలని భావించిన ఆయన పరమేశ్వర్ అనే ఔత్సాహికుని తలపై శనివారం ‘డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్’ అని మోడలింగ్ హెయిర్ డిజైనింగ్ చేశారు. విజయకుమార్‌లో వున్న సామాజిక స్పృహను ట్రాఫిక్ సీఐ మళ్ల మహేష్, ఎస్‌ఐ డీవీఎస్ వర్మ, ట్రాఫిక్ పోలీసులు అభినందించారు.