
చెన్నై: పండగ సెలవులకు విద్యార్థులు ఇంటికి వెళ్లితే.. సరిగా తినటం లేదా? ఏంటి ఇంత చిక్కిపోయావని తల్లిదండ్రులు అంటారు. అదేవిధంగా ఏంటి ఆ జుట్టు.. కట్టింగ్ చేసుకోలేకపోయావా? అని ప్రతి తల్లి తమ పిల్లలను ప్రశ్నిస్తుందన్న విషయం తెలిసిందే. మోహన అనే ఓ తల్లి సంక్రాంత్రి సెలవులకు ఇంటికి వచ్చిన తన కొడుకు భారీ జుట్టును చూసి కట్టింగ్ చేసుకోమ్మని కోరింది. దీనిపై తల్లీకొడుకు ఇద్దరూ వాదులడుకున్నారు. అయితే ఆదివారం తల్లి మోహన తన కొడుకును బలవంతంగా కట్టింగ్ షాప్‌కి తీసుకువెళ్లి మరీ అతని జుట్టును తీయించారు. దాంతో కట్టింగ్ చేసుకోవటం వల్ల భారీ జుట్టు కాస్త చిన్నగా మారిపోయిందని ఆ యువకుడు తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చిన తల్లి మోహనకు తన కొడుకు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన చెన్నైలోని కుంద్రతూర్‌లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతిపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment