Tamilnadu Chennai Woman Killed Lover, Later Body Chopped Into Pieces - Sakshi
Sakshi News home page

దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో..

Apr 4 2023 5:53 PM | Updated on Apr 4 2023 6:51 PM

Woman Kills Lover Tamilnadu - Sakshi

చెన్నై: తమిళనాడు పుడుక్కొట్టాయ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ ఘటన తరహాలో ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికింది ప్రియురాలు. అనంతరం శరీర భాగాలాను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. ఈ దారుణ ఘటనలో మృతుడి పేరు జయంతన్‌ (29).  చెన్నై ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడ్ని కిరాతకంగా హత్య చేసిన ప్రియురాలిని భాగ్యలక్ష‍్మిగా(38) గుర్తించారు పోలీసులు. ఈమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి చేసుకుని విడిపోయిన భాగ్యలక్ష‍్మి మార్చి 20న జయంత్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని చంపి కాళ్లు, చేతులు నరికినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ శరీర భాగాలను కోవలం బీచ్‌ తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో పాతిపెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో భాగ్యలక్ష‍్మికి మరో ముగ్గురు పురుషులు సహకరించారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

జయంతన్‌ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళ్తానని తన సోదరి జెయకృభ (41)కు ఫోన్‌లో చెప్పాడు. అయితే రెండు రోజులైనా ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడు అతని జాడ కనుగొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు హత్య విషయం తెలిసింది.

వెలుగులోకి కీలక విషయాలు..
ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష‍్మితో జయంతన్ తరచూ ఫోన్‌లో మాట్లాడున్నట్లు కాల్ రికార్డులో వెళ్లడైంది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

భాగ్యలక్ష‍్మి ఓ సెక్స్ వర్కర్‌గా పనిచేసేది. 2020 మే నెలలో జయంతన్‌ ఆమెను ఓ లాడ్జిలో కలిశాడు. ఆ తర్వాత ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఆమెను గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టాడు. అయితే 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు. 

అయితే పుడుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష‍్మి జయంతన్‌ను మార్చి 19న ఇంటికి రావాలని పిలిచింది. దీంతో అతను వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే తన స్నేహితుడు శంకర్‌కు ఫోన్ చేసింది భాగ్యలక్షి. అతను మరో ఇద్దరిని వెంటపెట్టుకుని వచ్చాడు. అనంతరం నలుగురూ కలిసి మార్చి 20 తెల్లవారుజామున జయంతన్‌ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఇంటికి తిరిగివెళ్లారు.

అయితే ఇంట్లో ఇంకా మిగిలిన శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్‌ బుక్ చేసుకుని మళ్లీ చెన్నై వెళ్లింది భాగ్యలక్ష‍్మి. వీటిని కూడా కోవలంలో పాతిపెట్టింది. అనంతరం తిరిగి పుడుక్కొట్టాయ్‌ చేరుకుంది.

కాగా.. ఢిల్లీలో కొద్ది నెలల క్రితం వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న తన ప్రియుడు అఫ్తాబ్‌ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు.  వీటిని కొన్నిరోజుల పాటు బ్యాగులో తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేశాడు. గతేడాది మేలో జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఇప్పుడు జయంతన్ హత్య కూడా ఢిల్లీ ఘటననే తలపిస్తోంది.
చదవండి: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement