lover murdered
-
దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు..
చెన్నై: తమిళనాడు పుడుక్కొట్టాయ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ ఘటన తరహాలో ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికింది ప్రియురాలు. అనంతరం శరీర భాగాలాను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. ఈ దారుణ ఘటనలో మృతుడి పేరు జయంతన్ (29). చెన్నై ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడ్ని కిరాతకంగా హత్య చేసిన ప్రియురాలిని భాగ్యలక్ష్మిగా(38) గుర్తించారు పోలీసులు. ఈమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయిన భాగ్యలక్ష్మి మార్చి 20న జయంత్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని చంపి కాళ్లు, చేతులు నరికినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ శరీర భాగాలను కోవలం బీచ్ తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో పాతిపెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మికి మరో ముగ్గురు పురుషులు సహకరించారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జయంతన్ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళ్తానని తన సోదరి జెయకృభ (41)కు ఫోన్లో చెప్పాడు. అయితే రెండు రోజులైనా ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడు అతని జాడ కనుగొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు హత్య విషయం తెలిసింది. వెలుగులోకి కీలక విషయాలు.. ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష్మితో జయంతన్ తరచూ ఫోన్లో మాట్లాడున్నట్లు కాల్ రికార్డులో వెళ్లడైంది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష్మి ఓ సెక్స్ వర్కర్‌గా పనిచేసేది. 2020 మే నెలలో జయంతన్ ఆమెను ఓ లాడ్జిలో కలిశాడు. ఆ తర్వాత ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఆమెను గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టాడు. అయితే 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు. అయితే పుడుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష్మి జయంతన్ను మార్చి 19న ఇంటికి రావాలని పిలిచింది. దీంతో అతను వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే తన స్నేహితుడు శంకర్‌కు ఫోన్ చేసింది భాగ్యలక్షి. అతను మరో ఇద్దరిని వెంటపెట్టుకుని వచ్చాడు. అనంతరం నలుగురూ కలిసి మార్చి 20 తెల్లవారుజామున జయంతన్ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఇంటికి తిరిగివెళ్లారు. అయితే ఇంట్లో ఇంకా మిగిలిన శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్ బుక్ చేసుకుని మళ్లీ చెన్నై వెళ్లింది భాగ్యలక్ష్మి. వీటిని కూడా కోవలంలో పాతిపెట్టింది. అనంతరం తిరిగి పుడుక్కొట్టాయ్ చేరుకుంది. కాగా.. ఢిల్లీలో కొద్ది నెలల క్రితం వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. వీటిని కొన్నిరోజుల పాటు బ్యాగులో తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేశాడు. గతేడాది మేలో జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఇప్పుడు జయంతన్ హత్య కూడా ఢిల్లీ ఘటననే తలపిస్తోంది. చదవండి: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష -
భార్యతో వివాహేతర సంబంధం.. భర్త, మరో ముగ్గురు కలిసి..
సాక్షి, జోగిపేట(మెదక్): పాతకక్షలు, వివాహేతర సంబంధంతో హత్య చేసినట్లు.. ఒక గ్రామంలో హత్య చేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మరో ఊరుకు తీసుకెళ్లి అక్కడ ఒక ఇంటికి మృతదేహాన్ని వేలాడదీసినట్లు విచారణలో తేలిందని పోతులబొగుడ హత్య గురించి పోలీసులు వివరించారు. ఆదివారం జోగిపేట సీఐ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 28 డిసెంబర్, 2021న వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్(26) హత్యకు గురయ్యాడు. కాగా అశోక్ అదే గ్రామానికి చెందిన బోడ అంబయ్య స్నేహితులు. ఈ నేపథ్యంలో అశోక్.. అంబయ్య భార్యతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేశ్, ఆత్కూరి నాగరాజులకు గొర్రెల వ్యాపారంలో అశోక్‌తో గొడవలు ఉన్నాయి. గణేశ్ నిమజ్జనం, బీరప్ప జాతర సమయంలో కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడని బోడ అంబయ్య... ప్రతి విషయంలో గొడవ పడుతున్నాడని రాజు, రమేశ్, నాగరాజు పగ పెంచుకున్నారు. నలుగురు కలిసి ఎలాగైనా అశోక్‌ను అంతం చేయాలని ప్లాన్ చేశారు. డిసెంబర్ 28వ తేదీన రాత్రి అశోక్ తన రేకుల షెడ్డులో మద్యం సేవిస్తుండగా నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవపడి అశోక్ గొంతును టవల్‌తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వారు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్ మృతి చెందాడు. నేరం నుంచి బయటపడేందుకు.. హత్య చేసిన తర్వాత నేరం నుంచి బయటపడేందుకు బోడ అంబయ్య తన భార్య సొంతూరైన పోతులబొగుడ గ్రామానికి రెండు బైక్‌లపై అశోక్ మృతదేహాన్ని తరలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబయ్య అత్తగారి ఇంటి గోడకు మృతదేహాన్ని వేలాడదీశారు. అక్కడి నుంచి ఎవరికంట పడకుండా ఎవరింటికి వారు వెళ్లిపోయారు. సోదరుడి హత్యపై మల్కగోని మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా, నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను గొర్రెకల్ గ్రామంలో అదుపులోకి తీసుకొని విచారించడంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం జోగిపేట కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వట్పల్లి ఎస్ఐ దశరథ్, పుల్కల్ ఎస్ఐ నాగలక్ష్మి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య
సాక్షి, పెదకాకాని (పొన్నూరు): ప్రేమించినందుకు ఓ యువకుడి కాళ్లు, చేతులు నరికేశారు యువతి బంధువులు. రెండు గంటల పాటు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ యువకుడు.. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన విన్నకోట వెంకటేష్ అలియాస్ బండ్రెడ్డి (23) మంగళగిరికి చెందిన ఓ డాక్టర్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక వెంటపడుతున్నాడు. కొందరు పెద్దల ద్వారా ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పి, వివాహం చేసుకుంటానని రాయబారం కూడా పంపించాడు. కోపోద్రిక్తులైన బాలిక కుటుంబసభ్యులు ఆ యువకుడిని తీవ్రంగా మందలించారు. దీనిపై జరిగిన స్వల్ప పంచాయితీలో యువకుడి తరఫు బంధువులు కొద్ది రోజులుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలని వెంకటేష్‌ను హెచ్చరిస్తున్నారు. నెల రోజులుగా మంగళగిరిలో ఉంటున్న వెంకటేష్ అప్పుడప్పుడూ కొప్పురావూరు పరిసర ప్రాంతాల్లో కనిపించి కవ్వించడం బాలిక తల్లిదండ్రులను ఆవేదనకు, ఆగ్రహావేశాలకు గురి చేసింది. ప్లాన్ చేసి నరికారు.. ఎన్నిసార్లు చెప్పినా కుమార్తెను గ్రామంలో అల్లరి చేయడం వల్ల పరువు పోతోందని భావించిన తండ్రి కొట్టే భాస్కరరావు, కుమారుడు తేజ మరికొందరితో కలిసి వెంకటేష్ కాళ్లూ చేతులు నరకాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30కు మాట్లాడాలంటూ భరత్ ద్వారా వెంకటేష్‌ను గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. వెంకటేష్ కళ్లలో కారం కొట్టి వెంట తెచ్చుకున్న కత్తులతో కాళ్లూ చేతులు నరికేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు రెండు గంటల పాటు రక్తస్రావంలో పడి ఉన్న వెంకటేష్‌ను రాత్రి పది గంటలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకటేష్ మరణించాడు. మృతుడి తల్లి విన్నకోట కుమారి ఫిర్యాదు మేరకు సీఐ శోభన్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇలా ఉండగా, బాలిక సోదరుడు వైష్ణవ్ తేజను హతమార్చడానికి వెంకటేష్ ప్లాన్ చేశాడని, అందుకు కోపోద్రిక్తులై వెంకటేష్‌పై బాలిక కుటుంబసభ్యులు దాడికి పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! -
ప్రియుడి సాయంతో మాజీ ప్రియుడిని..
సాక్షి, గుంటూరు : తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద దారుణం వెలుగు చూసింది. ప్రియుడిని ఓ మహిళ మరో ప్రియుడి సాయంతో చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో శవాన్ని పడేసింది. కరకట్ట ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ విజయవాడ చెందిన రాజయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. వారిమధ్య విభేదాలు తలెత్తటంతో సుధాకర్ అనే మరో యువకుడితో కలిసి రాజయ్యను ఇంట్లోనే చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేసింది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని వెలికి తీయించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గొంతునులిమి...గోళ్లతో రక్కి...
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రేమించిన యువతి లైంగికంగా లొంగలేదనే కారణంతోనే అరుణ ను దినేష్ హతమార్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నై తలమై శయలగం కాలనీకి చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిదినేష్ చూలైకి చెందిన తన ప్రేయసి అరుణను సోమవారంరాత్రి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అరుణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి మంగళవారం సాయంత్రం అప్పగించారు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి శనివారం జల్సాలు చేస్తూ ఇంటికి కూడా రాకుండా స్నేహితులతో గడిపే అలవాటున్న దినేష్ చర్యలను తల్లిదండ్రులు సైతం అనుమానించలేదు, ఏనాడు ప్రశ్నించలేదు. దినేష్ స్నేహితులంతా అరుణ ఇంటి పరిసరాల్లోని ఉండడం, చిన్ననాటి నుంచి కలిసి చదవడం మూలాన వారిద్దరిలో ప్రేమ చిగురించింది. అరుణను ఏకాంతంగా కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న దినేష్, తన తండ్రి ఆస్పత్రిలో అడ్మిట్ కావడం, తల్లి, సోదరి ఆయనకు తోడుగా ఉండడంతో, ఇల్లు ఖాళీగా ఉండటాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయమే అరుణను ఇంటికి పిలిపించుకున్న దినేష్ ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. దీంతో కోపగించుకున్న అరుణపై ఆగ్రహంతో ఊగిపోయాడు. గొంతు నులిమాడు, పక్కనే పూలతొట్టితో కొట్టాడు. అద్దాలను పగులగొట్టి విచక్షణా రహితంగా పొడిచాడు. దినేష్ నుంచి ప్రాణాలతో బయటపడాలని ప్రయత్నించినట్లుగా ఆమె ముఖంపై అనేక ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తప్పించుకో జూసిన అరుణను పట్టుకునే ప్రయత్నంలో ఆమె ముఖమంతా దినేష్ గోళ్లతో రక్కినట్లుగా తేలింది. దినేష్ ఆచూకీ కోసం 4 బృందాలు అరుణను హతమార్చి పరారైన నిందితుడు దినేష్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హత్యచేయగానే దినేష్ తల్లిదండ్రులను కలుసుకుని తన సెల్‌ఫోన్‌ను వారికి ఇచ్చివెళ్లాడు. పరారీలో తన తెలివితేటలను వినియోగించి సెల్‌ఫోన్ లేకుండా జాగ్రత్తపడటం వల్ల దినేష్ ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. దినేష్ ఫోన్‌కు పోలీసులు ఫోన్ చేయడం వల్లనే తమ కుమారుని కోసం వెతుకుతున్నారని కన్నవారు తెలుసుకుని కృంగిపోయారు. దినేష్ స్నేహితులు, బంధువులు ఎవ్వరూ తమకు తెలియదని చెప్పడంతో గాలింపును తీవ్రతరం చేశారు. 24 గంటల్లోగా దినేష్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.