
సాక్షి, గుంటూరు : తాడేపల్లి ఎన్టీఆర్ కరకట్ట వద్ద దారుణం వెలుగు చూసింది. ప్రియుడిని ఓ మహిళ మరో ప్రియుడి సాయంతో చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో శవాన్ని పడేసింది. కరకట్ట ప్రాంతానికి చెందిన గాయత్రి అనే మహిళ విజయవాడ చెందిన రాజయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. వారిమధ్య విభేదాలు తలెత్తటంతో సుధాకర్ అనే మరో యువకుడితో కలిసి రాజయ్యను ఇంట్లోనే చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేసింది. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు గాయత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని వెలికి తీయించనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment