chopped into pieces
-
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
దారుణం.. ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు..
చెన్నై: తమిళనాడు పుడుక్కొట్టాయ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ ఘటన తరహాలో ప్రియుడ్ని ముక్కలు ముక్కలుగా నరికింది ప్రియురాలు. అనంతరం శరీర భాగాలాను 400 కిలోమీటర్లు తీసుకెళ్లి కోవలం బీచ్‌లో పాతిపెట్టింది. ఈ దారుణ ఘటనలో మృతుడి పేరు జయంతన్ (29). చెన్నై ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇతడ్ని కిరాతకంగా హత్య చేసిన ప్రియురాలిని భాగ్యలక్ష్మిగా(38) గుర్తించారు పోలీసులు. ఈమెను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయిన భాగ్యలక్ష్మి మార్చి 20న జయంత్‌ను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని చంపి కాళ్లు, చేతులు నరికినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ శరీర భాగాలను కోవలం బీచ్ తీసుకెళ్లి పలు ప్రాంతాల్లో పాతిపెట్టినట్లు చెప్పారు. ఈ ఘటనలో భాగ్యలక్ష్మికి మరో ముగ్గురు పురుషులు సహకరించారు. పరారీలో ఉన్న వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జయంతన్ మార్చి 18న తన సొంతూరు విల్లుపురం వెళ్తానని తన సోదరి జెయకృభ (41)కు ఫోన్లో చెప్పాడు. అయితే రెండు రోజులైనా ఇంటికి వెళ్లలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అప్పుడు అతని జాడ కనుగొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు హత్య విషయం తెలిసింది. వెలుగులోకి కీలక విషయాలు.. ఈ కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష్మితో జయంతన్ తరచూ ఫోన్లో మాట్లాడున్నట్లు కాల్ రికార్డులో వెళ్లడైంది. దీంతో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భాగ్యలక్ష్మి ఓ సెక్స్ వర్కర్‌గా పనిచేసేది. 2020 మే నెలలో జయంతన్ ఆమెను ఓ లాడ్జిలో కలిశాడు. ఆ తర్వాత ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఆమెను గుడికి తీసుకెళ్లి మెడలో తాళి కూడా కట్టాడు. అయితే 2021 జనవరిలో ఇద్దరూ విడిపోయారు. అయితే పుడుక్కొట్టాయ్‌లోనే ఉంటున్న భాగ్యలక్ష్మి జయంతన్ను మార్చి 19న ఇంటికి రావాలని పిలిచింది. దీంతో అతను వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. వెంటనే తన స్నేహితుడు శంకర్‌కు ఫోన్ చేసింది భాగ్యలక్షి. అతను మరో ఇద్దరిని వెంటపెట్టుకుని వచ్చాడు. అనంతరం నలుగురూ కలిసి మార్చి 20 తెల్లవారుజామున జయంతన్ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. వాటిని 400 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో పాతిపెట్టారు. ఆ తర్వాత ఇంటికి తిరిగివెళ్లారు. అయితే ఇంట్లో ఇంకా మిగిలిన శరీర భాగాలు ఉండటంతో మార్చి 26న క్యాబ్ బుక్ చేసుకుని మళ్లీ చెన్నై వెళ్లింది భాగ్యలక్ష్మి. వీటిని కూడా కోవలంలో పాతిపెట్టింది. అనంతరం తిరిగి పుడుక్కొట్టాయ్ చేరుకుంది. కాగా.. ఢిల్లీలో కొద్ది నెలల క్రితం వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న తన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. వీటిని కొన్నిరోజుల పాటు బ్యాగులో తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేశాడు. గతేడాది మేలో జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఇప్పుడు జయంతన్ హత్య కూడా ఢిల్లీ ఘటననే తలపిస్తోంది. చదవండి: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష -
అనకాపల్లిలో వ్యక్తి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి..
సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు. -
దారుణం.. రెండో భార్యను చంపి 50 ముక్కలు చేసిన భర్త!
రాంచీ: జార్ఖండ్ సాహెబ్‌గంజ్‌లో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. రెండో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 50 ముక్కలు చేశాడు. వాటిని తీసుకెళ్లి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనం వెనుక మృతురాలి కాలు దొరకడంతో పోలీసులు శనివారం శునకాలను రంగంలోని దింపి ఆ ప్రాంతమంతా వెతికారు. మొత్తం 18 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొన్ని లభించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో భర్తను అదపులోకి తీసుకున్నారు. అతని కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆదివాసి తెగకు చెందిన మృతురాలి పేరు రూబిక పహాడిన్(22). దిల్దార్ అన్సారీ అనే వ్యక్తిని ఇటీవలే వివాహం చేసుకుంది. అయితే అతనికి అప్పటికే పెళ్లి అయింది. అయినా ఇద్దరూ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండో పెళ్లి విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమె గొడవపెట్టుకుంది. దీంతో రూబికతో వాగ్వాదానికి దిగి ఆమెను హతమార్చాడు అన్సారి. అతని కుటుంబసభ్యుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. రూబిక కన్పించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలు లభ్యం కావడంతో అవి ఆమెవే అని పోలీసులు పేర్కొన్నారు. అయితే హత్య అనంతరం తనపై అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు అన్సారీ. తన భార్య కన్పిచడం లేదని ఫిర్యాదు చేశాడు. కానీ చివరకు దొరికిపోయాడు. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు
బెంగళూరు: కర్ణాటక బాగల్కోట్లో శ్రద్ద వాకర్ హత్య తరహా ఘటన వెలుగుచూసింది. సొంత కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని విఠల కులాలి(20)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53). అయితే పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు విఠల. ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు. చదవండి: మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు -
'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్ -
ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. భర్తను చంపి ముక్కలు చేసిన భార్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్లో పడేసింది. పాండవ్ నగర్లో ఈ దారుణం జరిగింది. తల్లి, కుమారుడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు కలిసే హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్‌లోని గ్రౌండ్‌తో పాటు, తూర్పు ఢిల్లీలో ఓ చోట పడేసినట్లు వెల్లడించారు. మొదట తూర్పు ఢిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch (CCTV visuals confirmed by police) pic.twitter.com/QD3o5RwF8X — ANI (@ANI) November 28, 2022 చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
ముక్కలుగా చేసి, సెప్టిక్ ట్యాంకులో దాచి..
సాక్షి, న్యూఢిల్లీ: డబ్బు కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కిరాతకులు అతన్ని దారుణంగా హతమార్చి ముక్కలు చేశారు. పోలీసులకు పట్టుబడకుండా వాటిని మూటకట్టి సెప్టిక్ ట్యాంకులో దాచిపెట్టారు. ఈ దారుణ ఘటన ద్వారకలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నైరుతి ఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్లో నివాసముండే సచిన్ యాదవ్(21) ఒక ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే షాప్‌లో పనిచేసే వరుణ్ (26), అతని బావమరిది రితురాజ్ అలియాస్ విక్కీ (24)తో కలిసి సచిన్‌ను మే 12ని అపహరించారు. వారి బారినుంచి తప్పించుకునే క్రమంలో సచిన్ యాదవ్ దొరికిపోవడంతో హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు. కొడుకు ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినా సచిన్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించలేదని ద్వారకా డీసీపీ షిబేశ్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ జరిగిన రోజున సచిన్ తల్లిదండ్రులకు ఒక బెదిరింపు కాల్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘మీ కొడుకుని కిడ్నాప్ చేశాం. 50 లక్షల రూపాయలు తీసుకొస్తేనే అతన్ని వదిలేస్తామ’ని సచిన్ తల్లిదండ్రులకు గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అనుమానం నిజమైంది.. సచిన్‌తో పాటు అదే ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్న వరుణ్ కిడ్నాప్ జరిగిన రోజు నుంచి పనిలోకి రావడంలేదు. అతను ఇల్లు ఖాళీ చేయడం, ఫోన్ చేస్తే స్పందించక పోవడంతో వరుణ్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయడంతో నిందితులు పట్టుబడ్డారని డీసీపీ షిబేశ్ తెలిపారు. -
పెళ్లికి ముందే ప్లాన్ చేసి..
ముంబై: పెళ్లైన నాలుగు రోజులకే వధువును పాశవికంగా హత్య చేసిన దారుణ ఘటన ముంబై శివారులో చోటుచేసుకుంది. నవ వధువును ముక్కలుగా నరికి శరీర భాగాలను వేర్వేరు ప్రాంతాల్లో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గతవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి భర్త సిద్ధేశ్(25), అతడి తల్లిదండ్రులు మనోహర్ సీతారామ్(50), మాధురి(48), వారి స్నేహితులు దుర్గేశ్ పట్వా(31), ప్రదీప్ జైన్(34) కలిసి ఈ కిరాతకానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రియాంక(23) అనే యువతికి ఏప్రిల్ 30న సిద్ధేశ్తో పెళ్లి జరిగింది. ప్రియాంక కనిపించడం లేదని వర్లీ పోలీస్ స్టేషన్లో సిద్ధేశ్, అతడి కుటుంబ సభ్యులు మే 6న ఫిర్యాదు చేశారు. మే 5న ఇంటర్వ్యూకు వెళ్లి ఆమె తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిద్ధేశ్, అతడి కుటుంబ సభ్యులను వేర్వేరుగా విచారించడంతో నిజం బయటపడింది. ప్రియాంక మే 5న ఇంటి దగ్గరే ఉన్నట్టు ఆమె మొబైల్ టవర్ లొకేషన్ ద్వారా గుర్తించి కూపీ లాగడంతో దురాగతం బయటపడిందని నవీ ముంబై క్రైమ్‌బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్ జగదీశ్ కులకర్ణి తెలిపారు. ప్రియాంకను మే 4న హత్య చేసినట్టు పోలీసు విచారణలో నిందితులు అంగీకరించారు. నిద్రలో ఉండగా ప్రియాంక ముఖంపై తలగడతో అదిమిపెట్టి ఆమెను చంపేశారు. మృతదేహాన్ని దుర్గేశ్ మూడు ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి మూడు వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. థానెలోని షాహపూర్-నాసిక్ రహదారికి దగ్గరలోని అడవిలో మృతురాలి తల దొరికింది. పెళ్లికి ముందు పథకం పన్నామని, దాని ప్రకారమే ప్రియాంకను హతమార్చినట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసేందుకు ప్రయత్నించిన సిద్ధేశ్‌పై ఒత్తిడి తెచ్చి పెళ్లి చేసుకుందున్న అక్కసుతో ప్రియాంకను హత్య చేశామని నిందితులు వెల్లడించారు.