సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని ఎలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన దుండగులు తల, మొండెం, కాళ్లను వేర్వేరుగా పడేశారు. ఎలమంచిలి కొత్తపాలెం బ్రిడ్జి కింద శరీర భాగాలు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన స్థానిక యువకులు మృతదేహాన్ని మొదటగా చూసి పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment