Delhi Woman Son Chop Husband Body Store Them In Fridge - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో శ్రద్ధ తరహా ఘటన.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. శవాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో..

Published Mon, Nov 28 2022 1:10 PM | Last Updated on Mon, Nov 28 2022 2:16 PM

Delhi Woman Son Chop Husband Body Store Them In Fridge - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహా ఘటన మరొకటి వెలుగు చూసింది. కుమారుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. అనంతరం శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచింది. ఆ తర్వాత రోజుకు కొన్ని శరీర భాగాల చొప్పున తీసుకెళ్లి గ్రౌండ్‌లో పడేసింది. పాండవ్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. తల్లి, కుమారుడిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఇద్దరు కలిసే హత్య చేసి, శవాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్రిజ్‌లో దాచిన శరీర భాగాలను పాండవ్ నగర్‌లోని గ్రౌండ్‌తో పాటు, తూర్పు ఢిల్లీలో ఓ చోట పడేసినట్లు వెల్లడించారు. మొదట తూర్పు ఢిల్లీలో ఓ శవం శరీర భాగాన్ని గుర్తించామని.. సీసీటీవీలు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు.

చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement