hanged himself
-
భార్యపై సుత్తితో దాడి.. ఆ తర్వాత పార్క్‌లో
న్యూఢిల్లీ : ఆవేశంలో భార్యను చితగొట్టి.. అనంతరం భర్త ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. జహంగిరిపురికి చెందిన మహిళకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఏడాది క్రితం ఆమె రిక్షా డ్రైవర్‌ను రెండో వివాహం చేసుకున్నారు. పెళైన తర్వాత కొన్ని నెలలు సజావుగానే సాగిన వీరి దాంపత్యం అనంతరం ముగ్గురు పిల్లల విషయంలో గొడవలు రావడం ప్రారంభమైంది. ఆ ముగ్గురు పిల్లలను రెండో భర్త అంగీకరించకపోవడంతో వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. పిల్లలను తన తల్లి దగ్గర వదిలేయమని తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన భర్త ఇదే విషయంపై మరోసారి వాగ్వాదానికి దిగారు. పిల్లల ముందే భార్యతో కొట్లాటకు దిగి.. ఆవేశంతో సుత్తితో ఆమె తలపై దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన మహిళ గట్టిగా అరవడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అయిన మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. మహిళపై దాడి చేయడంతో కుటుంబ సభ్యులు సదరు భర్తపై కేసు నమోదు చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలోనే ఆదివారం ఉదయం స్థానిక పార్కులోని చెట్టుకు భర్త ఉరి వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
జుట్టు తీయించిదనే మనస్తాపంతో బాలుడు..
చెన్నై: పండగ సెలవులకు విద్యార్థులు ఇంటికి వెళ్లితే.. సరిగా తినటం లేదా? ఏంటి ఇంత చిక్కిపోయావని తల్లిదండ్రులు అంటారు. అదేవిధంగా ఏంటి ఆ జుట్టు.. కట్టింగ్ చేసుకోలేకపోయావా? అని ప్రతి తల్లి తమ పిల్లలను ప్రశ్నిస్తుందన్న విషయం తెలిసిందే. మోహన అనే ఓ తల్లి సంక్రాంత్రి సెలవులకు ఇంటికి వచ్చిన తన కొడుకు భారీ జుట్టును చూసి కట్టింగ్ చేసుకోమ్మని కోరింది. దీనిపై తల్లీకొడుకు ఇద్దరూ వాదులడుకున్నారు. అయితే ఆదివారం తల్లి మోహన తన కొడుకును బలవంతంగా కట్టింగ్ షాప్‌కి తీసుకువెళ్లి మరీ అతని జుట్టును తీయించారు. దాంతో కట్టింగ్ చేసుకోవటం వల్ల భారీ జుట్టు కాస్త చిన్నగా మారిపోయిందని ఆ యువకుడు తీవ్ర మనస్తాపంతో ఉరి వేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చిన తల్లి మోహనకు తన కొడుకు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన చెన్నైలోని కుంద్రతూర్లో చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మృతిపై పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
హిజ్రా ఇంట్లో యువకుడి ఆత్మహత్య కలకలం
సాక్షి, చోడవరం (విశాఖ): స్థానిక వెంకన్నపాలెం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు.. హిజ్రా ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని మృతి చెందాడు. తన తల్లి పాపలక్ష్మి చిన్నతనంలో వదిలివేయడంతో సంగం సురేష్‌కుమార్(18) అనే యువకుడు శివాలయం వీధిలో ఉంటున్న వరసకు పెద్దమ్మ అయిన కర్రిసూరమ్మ వద్ద పెరిగాడు. గాయత్రీ పాన్‌షాప్‌లో ఇతను పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 11గంటల వరకూ సురేష్ ఇంటికి చేరలేదు. దీంతో పెద్దమ్మ నిద్రపోయింది. విశాఖపట్నం జిల్లా వెంకన్నపాలెంలో నివాసముంటున్న లోవ అనే హిజ్రా తెల్లవారుజామున తన రూమ్‌కు వెళ్లగా తలుపు లోపల గడి పెట్టి ఉంది. కిటికిలోంచి చూడగా సురేష్ ఫ్యాన్‌కి ఉరేసువేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే సురేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ మునాఫ్, ఏఎస్ఐ భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు. గత వినాయక నవరాత్రుల నుంచి హిజ్రా లోవతో సురేష్‌కు స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి వెంకన్నపాలెంలో ఆమె రూమ్‌కు తరుచూ వెళుతున్నాడు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వచ్చి ఇలా జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఇంటర్మీడియెట్ వరుకూ చదివిన సురేష్ ప్రస్తుతం పాన్‌షాప్‌లో పనిచేస్తున్నాడని అతని పెద్దమ్మ సూరమ్మ చెప్పింది. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మునాఫ్ తెలిపారు. -
కోడలు కాపురానికి రావట్లేదని మామ సూసైడ్
ముజఫర్‌నగర్: కోడలు కాపురానికి రావడం లేదని పరువుతో మామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముజఫర్ నగర్‌లోని నివాసముంటున్న రాజేందర్ కుమార్(50) అనే వ్యక్తి ఈ మధ్యనే తన కుమారుడికి పెళ్లి చేశాడు. అయితే, కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన మామ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని రైతులు అత్మహత్యలు