డ్రంకెన్‌డ్రైవ్ కేసులో దొరికిపోయిన టీవీ యాంకర్ ప్రదీప్ వ్యవహారశైలి అంతుపట్టనివిధంగా తయారైంది. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ చౌహాన్‌కు ప్రదీప్ సమాచారం కూడా అందించారు. కానీ ప్రదీప్ బేగంపేట స్టేషన్‌కు వస్తారా, రారా అనే సందిగ్ధంనెలకొంది.