
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కింగ్ కోఠిలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కోఠిలోని ఓ కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షెడ్డులో భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కాగా, మంటల్లో 5 కారు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు, కారులో నిద్రపోయిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment