king koti
-
హైదరాబాద్ కింగ్ కోఠిలో అగ్నిప్రమాదం
-
HYD: కోఠిలో భారీ శబ్ధంతో పేలుడు.. వ్యక్తి సజీవ దహనం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కింగ్ కోఠిలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కోఠిలోని ఓ కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షెడ్డులో భారీ శబ్ధాలతో పేలుళ్లు సంభవించి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. కాగా, మంటల్లో 5 కారు పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు, కారులో నిద్రపోయిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి
సాక్షి, హైదరాబాద్: ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న ఓ యువతి తలనొప్పి భరించలేక మరణించిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్‌కోఠి ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... నిజామాబాద్ జిల్లా పెద్దభీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష(22) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. అబిడ్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషీయర్‌గా పనిచేస్తూ కింగ్‌కోఠి షేర్‌గేట్ దగ్గర ఉన్న సింధూజ హాస్టల్లో నివాసం ఉంటోంది. సోమవారం తన స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లింది. అప్పటికే తలనొప్పి, వికారంగా ఉండటంతో ఆఫీస్‌కు వెళ్లిన గంటకు వాంతు చేసుకుంది. వెంటనే తాను పనిచేయలేనని మేనేజర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్‌కు వచ్చింది. కొద్దిసేపటికే తలనొప్పి ఎక్కువ కాడంతో పక్క రూమ్ మేట్ ఒకామే జండూబామ్ రాసి తలకు మసాజ్ చేసింది. అయినా సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టి, కనుగుడ్లు తేలేస్తుండటంతో.. ఆందోళన చెందిన స్నేహితులు అనూషను ఆసుపత్రికి తీసికెళుతున్న క్రమంలో మరోసారి వాంతి చేసుకుంది. ఆటోలో ఎక్కించాక నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసికెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య -
కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ
సాక్షి, హైదరాబాద్: నిజాం నవాబ్ పాలించిన ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్ వివాదాల్లో చిక్కుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్యాలెస్ వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలివానలా పరిణమించింది. సదరు స్థలం తమదంటే తమదంటూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ స్థలంలోకి జేసీబీలతో చొరబడ్డ 38 మందిపై సోమవారం నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకీ వివాదం? కింగ్‌కోఠి నజ్రీబాగ్లోని ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్‌ను నగరానికి చెందిన ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’ నుంచి కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’ వారు 2019 జనవరి 28న సేల్‌డీడ్ చేసుకున్నారు. అనంతరం మహ్మద్ ఫరీదుద్దీన్ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’ వాళ్లు.. తిరిగి కశ్మీర్‌కు వెళ్లిపోయారు. ఇటీవల వాచ్‌మన్ ఫరీదుద్దీన్ మృతి చెందడంతో స్థలాన్ని పరిశీలించేందుకు డైరెక్టర్ అర్జున్ ఆమ్లా కశ్మీర్ నుంచి ఈ నెల 4న నగరానికి వచ్చారు. ఆ సమయంలో టోలిచౌకికి చెందిన సయ్యద్ అక్తర్ తన మనుషులతో ప్యాలెస్‌లోకి చొరబడినట్లు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’కు సంబంధించిన ‘ఎంఎస్ అగర్వాల్ రియాల్టీ డెవలపర్స్’కు చెందిన రాజేష్ అగర్వాల్, జి.దినేష్‌కుమార్, మరికొందరి డైరెక్టర్ల పేర్లు సయ్యద్ అక్తర్ తెలపడంతో.. వీరిపై ఈ నెల 8న నారాయణగూడ పోలీసులు సెక్షన్ 452, 506, 109, 120బి కింద కేసు నమోదు చేశారు. తాజాగా 38 మందిపై కేసులు.. తాము కొనుగోలు చేసిన స్థలంలో వేరేవాళ్లు రావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ‘ఐరిస్ హాస్పిటాలికీ’కి సంబంధించిన డైరెక్టర్లు తమ అనుచరులతో కలిసి జేసీబీతో ప్యాలెస్ లోపలికి చొరబడ్డారు. ఈ విషయాన్ని అక్కడున్న వారు పోలీసులకు తెలపగా.. హుటాహుటిన అబిడ్స్ ఏసీపీ కే.వెంకట్‌రెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు, క్రైం ఇన్స్పెక్టర్ ముత్తినేని రవికుమార్, ఎస్సైలు సంఘటన స్థలానికి వచ్చారు. లోపలికి చొరబడ్డ సుమారు 38 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరంతా ‘ఐరిస్ హాస్పిటాలిటీ’కి చెందిన వారని తెలిసింది. దీంతో 38 మందిపై ‘ఎంఎస్ అగర్వాల్ రియాల్టీ డెవలపర్స్’కు చెందిన రాజేష్ అగర్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్యాలెస్‌కు సంబంధించిన స్థలం మొత్తాన్ని నగరానికి చెందిన ‘నిహారిక ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్’ వారు ఎవరి నుంచి కొన్నారు? వీరు కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్ హాస్పిటాలిటీ’కి ఏ విధంగా అమ్మారు? అనే విషయాలపై స్పష్టత లేకుండాపోయింది. ఇదే వ్యవహారంపై 2019లో సీసీఎస్ పోలీసు స్టేషన్‌తో పాటు ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్లో రాజేష్ అగర్వాల్ ఈ ల్యాండ్ తనదేనంటూ కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేయగా..ఆయా పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. -
Photo Feature: ‘పరీక్ష’ కాలం.. తుపాను కల్లోలం
కోవిడ్ విజృంభణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న ప్రజలను ‘టౌటే’ పెను తుపాను వణికించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. -
డాక్టర్‌పై అంబులెన్స్ డ్రైవర్ దాడికి యత్నం
హిమాయత్‌నగర్: తాను చెప్పిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదంటూ అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ ఇన్చార్జి డాక్టర్‌పై దాడికి యత్నించాడు. ఈ సంఘటన కింగ్‌కోఠి ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. డాక్టర్ సాధన తెలిపిన మేరకు.. ఐదు రోజులగా కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ రెండో డోస్ వేస్తున్నారు. ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ముఖేష్‌కు వ్యాక్సిన్ కోసం వచ్చే వారి పేర్లు నమోదు చేసుకునే పనిని సూపరిటెండెంట్ రాజేంద్రనాధ్ ఇటీవల అప్పగించారు. సిబ్బంది తక్కువగా ఉండటంతో సాయం కోసం ఈ పని చేశారు. అయితే ముఖేష్ తనకు సంబంధించిన వారి ఆధార్ జిరాక్స్ పత్రంపై సంతకం చేసి కోవ్యాక్సిన్ వద్దకు పంపుతున్నాడు. ఎవరైనా అడిగితే సెకెండ్ డోస్ అని చెప్పాలని సూచిస్తున్నాడు. ఇది గమనించిన డాక్టర్ సాధన.. ముఖేష్‌ను ప్రశ్నించింది. దీంతో అతను నానా రభస చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు డాక్టర్ ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సూపరిటెడెంట్ డాక్టర్ రాజేంద్రనాధ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. చదవండి: బావిలో పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు -
'ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది'
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): కరోనా రోగులతో ఆసుపత్రి నిండిపోయింది.. ఇంకా బయటి నుంచి వస్తూనే ఉన్నారు. వైద్యులు, సిబ్బంది క్షణం తీరికలేకుండా సేవలు చేయడంలో మునిగిపోయారు.. ఆక్సిజన్ సకాలంలో అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఉదంతం ఇంకా మరవలేదు.. అంతలోనే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలోకి వచ్చి హల్చల్ సృష్టించారు. వైద్యులను, సిబ్బందిని హడలెత్తించారు. చివరికి పోలీసులకు చిక్కి రిమాండ్ పాలయ్యారు. అసలు విషయమేమిటంటే... తస్కీన్, అమరేందర్ అనే ఇద్దరు వ్యక్తులు యూనిట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్ (ఎన్సీఐడీ) పేరిట ఇన్వెస్టిగేషన్ అధికారులుగా అవతారమెత్తారు. ఆదివారం ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయిన ఘటనను ‘సుమోటోగా స్వీకరించిన’వీళ్లు రెండు రోజులు ఆలస్యంగా మంగళవారం సాయంత్రం ఆ దవాఖాన వద్దకు వచ్చారు. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్..? ఫ్లోర్ ఇన్చార్జ్ షాహీదా వద్దకు వెళ్లి ఆక్సిజన్ ప్లాంట్‌కు దారి అడిగారు. ‘వీ ఆర్ ఫ్రం ఎన్సీఐడీ. వేర్ ఈజ్ యువర్ సూపరింటెండెంట్ ఛాంబర్ అండ్ వేర్ ఈజ్ ఆక్సిజన్ ప్లాంట్’ అంటూ గద్దించారు. వీళ్లు నిజమైన సీఐడీ అధికారులుగా భావించిన ఆమె ప్లాంట్‌కు దారి చూపించారు. వారు తమ ఫోన్లతో అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. అక్కడ నుంచి రిసెప్షన్ వద్దకు రాగా... అదే సమ యంలో ఓ మహిళా కోవిడ్ రోగి అడ్మిషన్ కోసం వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం రోగి రక్తంలో ఆక్సిజన్ శాతం గణనీయంగా తగ్గిపోతేనే అడ్మిషన్ ఇవ్వాలి. ఆ మహిళలకు 85 శాతం ఉండటంతో ఆసుపత్రిలో చేర్చుకోవడం కుదరదంటూ సిబ్బంది చెప్పారు. ఇది చూసిన ఈ ఎన్సీఐడీ ద్వయం రెచ్చిపోయింది. అసలు ఈ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది, ప్రతి చోటా లంచం తీసుకుం టున్నారు, డబ్బు ఇవ్వకపోతే అడ్మిట్ చేసుకోవట్లేదు.. అంటూ ఆరోపణలు చేసింది. ఐసీయూలో వైద్యురాలికి బెదిరింపు.. అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు ఐసీయూలోకి దూసుకుపోయి ఫొటోలు, వీడియోలు తీయడం మొదలెట్టారు.. అక్కడ విధుల్లో ఉన్న ఓ వైద్యురాలు వీరిని గమనించి ‘ఎవరండీ మీరు.. ఐసీయూలోకి ఎందుకు వచ్చారు? అంటూ ప్రశ్నించగా.. ‘ఎవతివే నువ్వు? ఉద్యోగం చెయ్యాలని ఉందా లేదా’అంటూ ఆమెపై రంకెలు వేశారు. మా సంగతి మీకు తెలీదంటూ బెదిరింపు.. ఈ హైడ్రామాతో దాదాపు రెండు గంటలపాటు వైద్యులు, సిబ్బంది హడలిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న స్పెషల్ ఆఫీసర్ విజయేంద్ర బోయి అబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డిని అప్రమత్తం చేశారు. ఆయనతోపాటు నారాయణగూడ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు తమ సిబ్బందితో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూశాక కూడా ఆ ఇద్దరూ ‘మా సంగతి మీకు తెలీదు, మేం తలచుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఉద్యోగాలు చేయ్యలేరంటూ’బెదిరింపు ధోరణిని ప్రదర్శించారు. వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించి విచారించగా ఎన్సీఐడీకి సంబంధించిన అసలు విషయం బయటపడింది. వైద్యులను దూషించినందుకు, దౌర్జన్యానికి దిగినందుకు కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హల్చల్ చేస్తున్న సమయంలో వీరి వెంట ఉన్నది ఎవరు? వీరితో సంబంధాలు ఏంటి? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ద్వయం గతంలోనూ ఇలాంటి బెదిరింపుల దందాలు చేసిందా? అనేది ఆరా తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ పోలీసుల లేఖ నారాయణగూడ పోలీసులు ఇరువురినీ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఈ ద్వయం గతంలోనే తమ సంస్థను రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు వీరి వ్యవహారశైలిని వివరిస్తూ, రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. అయితే హల్చల్ చేయడానికి వారు ఇలా యూసీఐడీలుగా అవతారమెత్తారని, ఇక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అసలు వీరెవరంటే... డబీర్పురకుచెందిన మహ్మద్ తస్కీన్ ఆలిండియా సీనియర్ స్పెషల్ ఆఫీసర్, ప్రెసిడెంట్‌గా, మెట్టుగూడ వాసి అమరేందర్ సెక్రటరీగా యూసీఐడీ సంస్థను ఏ ర్పాటు చేశారు. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటూ సంబంధిత రిజిస్ట్రార్‌కు పంపిన దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈలోపే విజిటింగ్ కార్డులు ముద్రించుకు న్న ఈ ద్వయం రోడ్లపైకి ఎక్కింది. ఇందు లో యూనిట్ అనే పదాన్ని చిన్నగా... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్‌ను పెద్దగా ఎర్ర అక్షరాలతో ముద్రించారు. అందులోనే వర్కింగ్ ఎగైనెస్ట్ క్రైమ్ అని రాశారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది అట్నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఛాంబర్‌కు వీళ్లిద్దరూ వెళ్లారు. ఆ సమయంలో ఛాంబర్లో నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ వెరోనికా, ఆర్ఎంవో నీరజ ఉన్నారు. వారిని చూస్తూ రెచ్చిపోయిన ఎన్సీఐడీ ప్రెసిడెంట్, సెక్రటరీలు ‘ఆదివారం ఆక్సిజన్ అందక రోగులు ఎందు కు చనిపోవాల్సి వచ్చింది? ఆక్సిజన్ పూర్త య్యే వరకు మీరేం చేస్తున్నారు?’అంటూ చిందులేశారు. అక్కడున్న అధికారులు ‘మీరు ఎవరు?’అంటూ వీరిని ప్రశ్నించారు. దీంతో ‘ఏం సూపరింటెండెంట్.. నన్నే అడుగుతావా? నేను ఎవర్ని అనుకుంటున్నావ్. ఈటల రాజేందర్ లాంటి వాడినే మంత్రి పదవి నుంచి తప్పించిన కెపాసిటీ నాది. మైండ్ యువర్ వర్డ్స్.. నీ అంతుచూస్తా’అంటూ వారిలో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. -
అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం... అంతలోనే!
సాక్షి, హిమాయత్‌నగర్: ‘అమ్మమ్మా.. హాస్పిటల్‌కు వచ్చేశాం.. నీకేం కాదు. ఇక్కడ నీకు నేనే దగ్గరుండి వైద్యం చేపిస్తా. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు అమ్మమ్మా.. అంటూ తన ఒడిలో పడుకోబెట్టుకున్న అమ్మమ్మకు భరోసా ఇచ్చింది ఓ వైద్యురాలు. ‘పై ఫొటోలో కనిపిస్తున్న వైద్యురాలి పేరు డాక్టర్ హిమజ. అమీర్‌పేటలోని నేచుర్‌క్యూర్ ఆస్పత్రిలో వైద్యురాలు. ఎందరో కోవిడ్ బాధితులను రక్షించింది. కూకట్‌పల్లిలో నివాసం ఉండే తన అమ్మమ్మ మీనాక్షి(62) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. మంగళవారం ఉదయం 11.40గంటల సమయంలో కింగ్‌కోఠి ఆస్పత్రికి తానే ఆటోలో తీసుకొచ్చింది. అడ్మిషన్‌కు లోపల ఆలస్యం అవుతోంది.. బయటేమో మీనాక్షి పల్స్ రేటు పడిపోతోంది. 15 నిమిషాల తర్వాత బయటే ఉన్న ఆక్సిజన్ కాన్సండ్రేటర్ నుంచి మీనాక్షికి ఆక్సిజన్ పెట్టారు. డాక్టర్ హిమజ లోనికి వెళ్లి అడ్మిషన్‌కు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ రూమ్ వద్ద చెప్పి స్లిప్ తీసుకున్నారు. అడ్మిషన్ ప్రక్రియ చేసే సిబ్బంది వద్దకు వచ్చి ఆ స్లిప్‌ను ఇచ్చారు. అప్పుడు సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చూడగా.. 42కంటే తక్కువగా ఉన్నాయి. ఎమర్జెన్సీ కేసు కాబట్టి గాంధీ లేదా ఉస్మానియాకు వెళ్లండన్నారు. గాంధీలో బెడ్స్‌లేని కారణంగా ఉస్మానియాకు రాయించుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రి లోపలికి వెళ్లగానే డాక్టర్ హిమజ చేతిలోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఆక్సిజన్ అందిస్తూ.. డాక్టర్ అయ్యుండి కూడా.. నేను ఒక డాక్టర్ అయ్యుండి కూడా నాకెంతో ఇష్టమైన అమ్మమ్మను రక్షించుకోలేకపోయాను అంటూ కన్నీటిపర్యంతమైయ్యింది డాక్టర్ హిమజ. అమ్మమ్మ బతుకుతుందనే ధైర్యంతో ఇంటిల్లిపాదికి ధైర్యాన్ని నూరిపోశాను. ఓ పక్క అడ్మిషన్‌కు ఆలస్యం.. మరో పక్క ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోవడంతో.. నా చేతిలోనే చనిపోయిందంటూ ‘సాక్షి’తో బోరున విలపించింది. చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు! -
కోవిడ్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు.. సమాధానాలు ఇవిగో!
హిమాయత్‌నగర్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆస్పత్రికి రావాలంటే గజగజ వణుకుతున్నారు. వైద్యులు కూడా ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉండి పలు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనాను జయిద్దాం’ అనే కాన్సెప్‌్టతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్‌తో సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలకు చెందిన పలువురు ఫోన్స్ చేసి డాక్టర్ రాజేంద్రనా«థ్ నుంచి అనేక సలహాలు, సూచనలను తీసుకున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన ఈ ‘ఫోన్‌ఇన్’కు ప్రజల నుంచి విశేష స్పందన వచి్చంది. సుమారు 179 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేయడం విశేషం. పాఠకుల ప్రశ్నలు, డాక్టర్ రాజేంద్రనాథ్ సమాధానాలు ఇలా.. ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి సమయంలో జ్వరం వస్తుంది. డోలో వేస్తున్నా తగ్గట్లేదు ఏం చేయాలి? – ఉదయ్‌కృష్ణ, బంజారాహిల్స్ జవాబు: పారాసెటమాల్ ట్యాబ్లెట్‌ను వరుసగా రెండు రోజులు వాడండి. రెండు రోజులు వాడినా తగ్గకుండా జ్వరం అలాగే ఉన్నా.. వచ్చి పోతున్నా.. తక్షణమే మీ దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. ప్రశ్న: కాళ్లు నొప్పులు బాగా వస్తున్నాయి డాక్టర్ గారు. నాకు కరోనా ఏమైనా వచ్చిందంటారా? – సాయిరాం, హిమాయత్‌నగర్ జవాబు: పారాసెటమాల్ లేదా డోలో ట్యాబ్లెట్స్ రెండు లేదా మూడు రోజులు వాడండి. అప్పటికీ తగ్గకుండా ఆయాసం లాంటిది వస్తే వెళ్లి టెస్ట్ చేయించుకోండి. ప్రశ్న: రెండ్రోజులుగా చల్లనీళ్లు తాగుతున్నా. గొంతు బాగా ఎండిపోతుంది. నాకు కరోనా ఏమైనా వచి్చనట్టా? – అమీన్, హిమాయత్‌నగర్ జవాబు: భయపడాల్సిన అవససరం ఏమీ లేదు. మీరు రెండ్రోజుల పాటు క్రమం తప్పకుండా డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్స్ను వాడండి. అలాగే కొద్దిగా ఈ టైంలో చల్లని నీటిని తగ్గించండి. ప్రశ్న: డాక్టర్ గారూ ఒకసారి తడి దగ్గు కొద్దిసేపు అయ్యాక పొడి దగ్గు వస్తుందండి. దగ్గు రాకుండా ఉండేందుకు సిరప్ తాగుతున్నాను. – రమా, నారాయణగూడ జవాబు: చల్లటి నీరు తాగడం మానేయండి. డాక్సీసైక్లిన్ 100 ఎంఎమ్జీ ట్యాబ్లెట్ వాడండి. మూడు రోజులుగా ఇలాగే ఉండి తగ్గకపోతే వెంటనే కోవిడ్ ర్యాపిడ్ లేదా ఆరీ్టపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి జ్వరం వస్తుంది. ఉదయం తగ్గిపోతుంది. – చంద్రకళ, హిమాయత్‌నగర్ జవాబు: ఆందోళన ఏమీ వద్దు. డోలో 650 ట్యాబ్లెట్ అయితే రెండు పూటలా వేసుకోండి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే మూడు పూటలా వేసుకోండి. తగ్గకపోతే ఖచి్చతంగా వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. నిర్లక్ష్యం వద్దు ఇలా జ్వరం తరచూ వస్తుంటే. ప్రశ్న: రెండ్రోజులుగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. కాస్త భయంగా ఉంది డాక్టర్ గారు. – సర్ఫరాజ్, దత్తానగర్ జవాబు: ఎక్కువగా అవుతుంటే దగ్గర్లోని డాక్టర్ని సంప్రదించండి. విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్‌ను కూడా వాడొచ్చు. ప్రశ్న: కొద్దిరోజులుగా తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. నాకు సహజంగానే డస్ట్ ఎలర్జీ ఉంది. వ్యాక్సిన్ వేసుకోవచ్చా? – నీలిమా, పంజగుట్ట జవాబు: డస్ట్ ఎలర్జీ ఉన్నంత మాత్రాన వ్యాక్సిన్‌కు భయపడక్కర్లేదు. ధైర్యంగా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మీరు మొదటి డోస్ వేసుకున్నాక ఎలర్జీ రాలేదు కాబట్టి రెండో డోస్ టైం రాగానే టీకా వేసుకోండి. ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పాజిటివ్ ఏమైనా వస్తుందా? – భారాతి, ముషీరాబాద్ జవాబు: వ్యాక్సిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఉదయమే వేడి నీళ్లల్లో పసుపు వేసుకుని తాగొచ్చా డాక్టర్? – రమా, బాగ్ అంబర్‌పేట జవాబు: హా.. నిశ్చంతంగా తాగొచ్చు. నీళ్లు కాగుతున్న సమయంలోనే చిటికెడు పసుపు వేయండి. కాస్త చల్లారినాక వాటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో షుగర్ వేయొద్దు. ప్రశ్న: కోవిడ్ వచ్చినా.. రాకున్నా.. ఇంట్లో ఉండి ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చు? – ప్రతిమరెడ్డి, లక్డీకాపూల్ జవాబు: ఇంట్లో ఉండి చక్కగా ఉదయం రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఒక గ్లాస్ పాలు తీసుకోండి. దానితో పాటు మాంసాహారం కూడా తినొచ్చు. జీడిపప్పు, బాదం పప్పు కూడా తినండి ప్రొటీన్ శాతం పెరుగుతుంది. ప్రశ్న: వాంతులు, విరేచనాలు తగ్గడానికి ఏదైనా సలహా ఇవ్వండి డాక్టర్ గారు. – వైషాలి రెడ్డి, జూబ్లీహిల్స్ జవాబు: ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు తాగండి. అన్నం వంచే సమయంలో గంజి పట్టుకుని దానిని తాగండి. ఈ రెండింటితో పాటు సగ్గుబియ్యం కూ డా తాగండి. విరేచనాలు, వాంతులు తగ్గిపోతాయి. కంటిన్యూగా అవుతుంటే వెళ్లి కరో నా టెస్ట్ చేయించుకోండి. (చదవండి: అనగనగా అపార్ట్మెంట్: కలిసికట్టుగా.. కోవిడ్ కేర్) -
‘కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు’
సాక్షి, హిమాయత్‌నగర్: ఆక్సిజన్ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం మరణించిన ముగ్గురివీ సహజ మరణాలని స్పష్టం చేశారు. ఈ విపత్తు వేళలో ఆక్సిజన్ లేక మరణించారన్న వార్తలు పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని చెప్పారు. ఆదివారం ఆక్సిజన్ అందక ముగ్గురు మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ ఓపీ వద్ద పరిస్థితి, ఎంతమంది చికిత్స పొందుతున్నారనే విషయాలను వైద్య బృందం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా అవుతున్న గదిని, ఆక్సిజన్ నింపే ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజతో కలసి పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆస్పత్రుల్లో సహజ మరణాలు జరుగుతూనే ఉంటాయని, ఆదివారం చనిపోయిన ముగ్గురు కూడా సహజంగానే చనిపోయారని పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరాపై ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఉందని, ఆ కమిటీ ఆక్సిజన్ నిల్వలు, అవసరాలపై నిత్యం మానిటరింగ్ చేస్తుందని పేర్కొన్నారు. కాగా, కింగ్‌కోఠి ఆస్పత్రికి 46 కేజీల ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 50 సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ జెనరేటర్ నిర్మాణం పూర్తవుతుందని, అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చదవండి: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ -
రాజధానిలో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బండ్లగూడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయం త్రం 4 గంటల ప్రాంతంలో వర్షం మొదలై అర్ధరాత్రి వరకు పలుదఫాలుగా కుంభవృష్టి కురిసింది. వర్ష బీభత్సానికి పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. కొత్తపేట్, మలక్‌పేట్, కోఠి తదితర ప్రాంతాల్లో నడుములోతున వరదనీరు పోటెత్తి, ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని అనేక చోట్ల సోమవారం మోస్తరు వానలు కురిశాయి. యాదాద్రి భువన గిరి జిల్లాలోని వెంకిర్యాలలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. పెద్దపల్లిలోని సుగ్లాంపల్లిలో 7, మహబూబాబాద్ గూడూరులో 6.5, కరీంనగర్‌లోని తంగుల, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బండ్లగూడలో 6, నల్లగొండలోని కనగల్‌లో 5, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, వరంగల్ రూరల్‌లోని మంగళ వారిపేటలలో 4.8, మంచిర్యాలలోని కొమ్మెరలో 4.7, నల్లగొండ జిల్లా ముల్కచర్లలో 4.6, హైదరాబాద్ నాంపల్లిలో 4.6, రంగారెడ్డిలోని తాటిఅన్నారం, రెడ్డిపల్లెలలో 4.5, హైదరాబాద్ బహదూర్‌పురలో 4.3, చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నేడు, రేపు భారీ వర్షాలు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. -
ఆస్పత్రి నుంచి తప్పించుకుని సొంతూరుకు
సాక్షి, తొర్రూరు : కరోనా వైరస్ బారిన పడి హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి తప్పించుకుని వచ్చాడు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేసేవాడు. అక్కడ ఆయనకు వైరస్ సోకగా.. ఈనెల 15న కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరాడు. అయితే, బుధవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి ఆర్టీసీ బస్సులో సూర్యాపేట వరకు, మరో బస్సులో తొర్రూరుకు చేరుకున్నాడు. కాగా, హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరే సమయంలో తన సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలుపగా.. అతను వెంటనే వైద్య, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం, ఎస్సై నగేష్, సిబ్బందితో కలసి తొర్రూరు బస్టాండ్‌లో కరోనా సోకిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పీపీఈ కిట్ తొడిగాక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కోవిడ్ వార్డుకు తరలించారు. తర్వాత అతను ఏ బస్సులో ఎక్కాడు, అందులో ఎందరు ప్రయాణించారనే అంశాలపై విచారణ చేపట్టారు. -
అతడికి పాజిటివ్.. ఆ ఇంట్లో 48 మంది
హిమాయత్‌నగర్: కింగ్‌కోఠి ప్రాంతంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇక్కడి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, ఆ ఇంట్లో 48 మంది కుటుంబసభ్యులు ఉండటం, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వివరాలను కొద్దిరోజులుగా అధికారులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తు లు మార్చి 12న విమానంలో ఢిల్లీ వెళ్లి, 18న నగరానికి తిరిగి వచ్చారని గుర్తించారు. నాలుగు రోజుల క్రితం వీరిని పట్టుకుని, అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి శనివారం పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఈ వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఆయన ఇంట్లో 48 మంది ఉంటున్నా రు. అలాగే, మిగతా ఐదుగురి ఇళ్లలో కూడా 20 మంది చొప్పున ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ వారిళ్లలోనే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
బట్టీ చదువులు, ర్యాంకుల వేటకు ఇక గుడ్‌బై..
-
కోఠి ప్రసూతి ఆస్పత్రిలో దారుణం
హైదరాబాద్: డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఒక మహిళ ఆరుబయటనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఆదివారం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో జరిగింది. నల్లగొండకు చెందిన సుమలత పురుటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఆరుబయటనే ప్రసవించింది. అయితే, ప్రమాదవశాత్తు అప్పుడే పుట్టిన బాలుడు కింద పడటంతో తల పగిలి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వైద్యుల లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని ఆందోళనకు దిగారు. -
హైకోర్టు భవనం వేటలో కేసీఆర్ !
* కింగ్‌కోఠి, ఎర్రమంజిల్ పరిశీలన * హైకోర్టు వేరైతే.. ఏదో ఒక రాష్ట్రానికి పనికొస్తుందని యోచన * ఢిల్లీ నుంచి రాగానే సీఎస్‌తో కలసి పర్యటన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు విభజన కోరుతున్న సీఎం కేసీఆర్ స్వయంగా తగిన భవనాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుభవనం విభజనలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఇంకో హైకోర్టును మరోచోట ఏర్పాటు చేయక తప్పదు. అందుకే సీఎం చారిత్రక కట్టడాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తును కలసి, ఆదివారం రాత్రి హైదరాబాద్ చే రుకున్న సీఎం సోమవారం మధ్యాహ్నం తర్వాత కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌ను, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయాన్ని పరిశీలించారు. మరికొన్ని భవనాలను కూడా పరిశీలించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా ఈ భవనాలను పరిశీలించారు. రాష్ట్ర విభజనతో సచివాలయం ఇరుకుగా మారినందున, హైకోర్టు విభజన వల్ల అక్కడ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇబ్బంది పడకుండా చూడాలన్న భావనతోనే ఈ భవనాల వేటలో సీఎం పడ్డట్టు తెలి సింది. కింగ్‌కోఠిలోని పర్దా ప్యాలెస్‌లో గతంలో నిజాం నవాబు నివసించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రాజభవనం ఆలనాపాలనా లేక శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించినట్టు ఓ అధికారి వివరించారు. హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలసిన విషయం విదితమే. ఇటీవలి పర్యటనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తును కలసి త్వరగా హైకోర్టును విభజించాలని విన్నవించిన సంగతి తెలిసిందే.