కోవిడ్ విజృంభణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న ప్రజలను ‘టౌటే’ పెను తుపాను వణికించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించింది.
1/9
వనస్థలిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మామూలు చెకప్, వైద్య చికిత్సల కోసం దాదాపు వంద మంది గర్భిణిలు రాగా.. వారంతా గంటల తరబడి ఇలా లైనులో నిల్చోవాల్సి వచ్చింది.
2/9
కోవిడ్ పేషంట్లతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడ చూసినా కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలే కన్పిస్తున్నాయి. ముషీరాబాద్‌లో కరోనా పరీక్షల కోసం జనం భారీగా క్యూలో వేచిచూశారు.
3/9
రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు.
4/9
టౌటే తుపాన్ ఉధృతికి ముంబై వద్ద ఎగసిపడుతున్న అరేబియా సముద్రపు అలలు
5/9
మంగళూరు తీరానికి సమీపంలో అలల తాకిడికి పాక్షికంగా ధ్వంసమైన ‘కోరమాండల్’ పడవ
6/9
శ్రీనగర్‌లో సోమవారం కోవిడ్‌తో చనిపోయిన తన తండ్రి చితికి కుటుంబ సభ్యులతో కలిసి నిప్పంటిస్తున్న బాలుడు
7/9
నిన్నటి వరకు ఈ చిన్నారులు ఆడిపాడిన ఇల్లు అది.. అంతలోనే అదేచోట వారి బాల్యం ఓ ‘శిథిల’ జ్ఞాపకంగా మిగిలింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ధ్వంసమైన తమ ఇంటి నుంచి ఆటబొమ్మలను తెచ్చుకుంటున్న చిన్నారులు వీరు. వరుస బాంబు దాడులతో గాజా నగరం తల్లడిల్లుతోంది. ఈ యుద్ధంలో చిన్నారులే సమిధలుగా మారుతున్నారు.
8/9
ఓ వృద్ధుడి కాలికి గాయంతో హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రికి బంధువు తీసుకురాగా.. కనీసం వీల్‌చైర్ కూడా లభించక ఇలా ఎత్తుకుని తీసుకెళ్లాల్సి వచ్చింది.
9/9
కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం తెరుచుకున్నాయి. సంప్రదాయబద్ధంగా పూజలు జరిగాయి. కోవిడ్ నియంత్రణల నేపథ్యంలో ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు
Comments
Please login to add a commentAdd a comment