
హిమాయత్‌నగర్: కింగ్‌కోఠి ప్రాంతంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇక్కడి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా, ఆ ఇంట్లో 48 మంది కుటుంబసభ్యులు ఉండటం, వారందరికీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి వివరాలను కొద్దిరోజులుగా అధికారులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తు లు మార్చి 12న విమానంలో ఢిల్లీ వెళ్లి, 18న నగరానికి తిరిగి వచ్చారని గుర్తించారు.
నాలుగు రోజుల క్రితం వీరిని పట్టుకుని, అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి శనివారం పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివ్ వచ్చిన ఈ వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఆయన ఇంట్లో 48 మంది ఉంటున్నా రు. అలాగే, మిగతా ఐదుగురి ఇళ్లలో కూడా 20 మంది చొప్పున ఉన్నట్టు గుర్తించారు. వీరందరికీ వారిళ్లలోనే వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment