కాలర్స్‌తో మాట్లాడుతున్న కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్
హిమాయత్‌నగర్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆస్పత్రికి రావాలంటే గజగజ వణుకుతున్నారు. వైద్యులు కూడా ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉండి పలు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనాను జయిద్దాం’ అనే కాన్సెప్‌్టతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్‌తో సోమవారం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలకు చెందిన పలువురు ఫోన్స్ చేసి డాక్టర్ రాజేంద్రనా«థ్ నుంచి అనేక సలహాలు, సూచనలను తీసుకున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన ఈ ‘ఫోన్‌ఇన్’కు ప్రజల నుంచి విశేష స్పందన వచి్చంది. సుమారు 179 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేయడం విశేషం.
పాఠకుల ప్రశ్నలు, డాక్టర్ రాజేంద్రనాథ్ సమాధానాలు ఇలా..
ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి సమయంలో జ్వరం వస్తుంది. డోలో వేస్తున్నా తగ్గట్లేదు ఏం చేయాలి?
– ఉదయ్‌కృష్ణ, బంజారాహిల్స్
జవాబు: పారాసెటమాల్ ట్యాబ్లెట్‌ను వరుసగా రెండు రోజులు వాడండి. రెండు రోజులు వాడినా తగ్గకుండా జ్వరం అలాగే ఉన్నా.. వచ్చి పోతున్నా.. తక్షణమే మీ దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి.
ప్రశ్న: కాళ్లు నొప్పులు బాగా వస్తున్నాయి డాక్టర్ గారు. నాకు కరోనా ఏమైనా వచ్చిందంటారా?
– సాయిరాం, హిమాయత్‌నగర్
జవాబు: పారాసెటమాల్ లేదా డోలో ట్యాబ్లెట్స్ రెండు లేదా మూడు రోజులు వాడండి. అప్పటికీ తగ్గకుండా ఆయాసం లాంటిది వస్తే వెళ్లి టెస్ట్ చేయించుకోండి.
ప్రశ్న: రెండ్రోజులుగా చల్లనీళ్లు తాగుతున్నా. గొంతు బాగా ఎండిపోతుంది. నాకు కరోనా ఏమైనా వచి్చనట్టా?
– అమీన్, హిమాయత్‌నగర్
జవాబు: భయపడాల్సిన అవససరం ఏమీ లేదు. మీరు రెండ్రోజుల పాటు క్రమం తప్పకుండా డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్స్‌ను వాడండి. అలాగే కొద్దిగా ఈ టైంలో చల్లని నీటిని తగ్గించండి.
ప్రశ్న: డాక్టర్ గారూ ఒకసారి తడి దగ్గు కొద్దిసేపు అయ్యాక పొడి దగ్గు వస్తుందండి. దగ్గు రాకుండా ఉండేందుకు సిరప్ తాగుతున్నాను.
– రమా, నారాయణగూడ
జవాబు: చల్లటి నీరు తాగడం మానేయండి. డాక్సీసైక్లిన్ 100 ఎంఎమ్‌జీ ట్యాబ్లెట్ వాడండి. మూడు రోజులుగా ఇలాగే ఉండి తగ్గకపోతే వెంటనే కోవిడ్ ర్యాపిడ్ లేదా ఆరీ్టపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి.
ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి జ్వరం వస్తుంది. ఉదయం తగ్గిపోతుంది.
– చంద్రకళ, హిమాయత్‌నగర్
జవాబు: ఆందోళన ఏమీ వద్దు. డోలో 650 ట్యాబ్లెట్ అయితే రెండు పూటలా వేసుకోండి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే మూడు పూటలా వేసుకోండి. తగ్గకపోతే ఖచి్చతంగా వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. నిర్లక్ష్యం వద్దు ఇలా జ్వరం తరచూ వస్తుంటే.
ప్రశ్న: రెండ్రోజులుగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. కాస్త భయంగా ఉంది డాక్టర్ గారు.
– సర్ఫరాజ్, దత్తానగర్
జవాబు: ఎక్కువగా అవుతుంటే దగ్గర్లోని డాక్టర్‌ని సంప్రదించండి. విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్‌ను కూడా వాడొచ్చు.
ప్రశ్న: కొద్దిరోజులుగా తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. నాకు సహజంగానే డస్ట్ ఎలర్జీ ఉంది. వ్యాక్సిన్ వేసుకోవచ్చా?
– నీలిమా, పంజగుట్ట
జవాబు: డస్ట్ ఎలర్జీ ఉన్నంత మాత్రాన వ్యాక్సిన్‌కు భయపడక్కర్లేదు. ధైర్యంగా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మీరు మొదటి డోస్ వేసుకున్నాక ఎలర్జీ రాలేదు కాబట్టి రెండో డోస్ టైం రాగానే టీకా వేసుకోండి.
ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పాజిటివ్ ఏమైనా వస్తుందా?
– భారాతి, ముషీరాబాద్
జవాబు: వ్యాక్సిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: ఉదయమే వేడి నీళ్లల్లో పసుపు వేసుకుని తాగొచ్చా డాక్టర్?
– రమా, బాగ్ అంబర్‌పేట
జవాబు: హా.. నిశ్చంతంగా తాగొచ్చు. నీళ్లు కాగుతున్న సమయంలోనే చిటికెడు పసుపు వేయండి. కాస్త చల్లారినాక వాటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో షుగర్ వేయొద్దు.
ప్రశ్న: కోవిడ్ వచ్చినా.. రాకున్నా.. ఇంట్లో ఉండి ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చు?
– ప్రతిమరెడ్డి, లక్డీకాపూల్
జవాబు: ఇంట్లో ఉండి చక్కగా ఉదయం రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఒక గ్లాస్ పాలు తీసుకోండి. దానితో పాటు మాంసాహారం కూడా తినొచ్చు. జీడిపప్పు, బాదం పప్పు కూడా తినండి ప్రొటీన్ శాతం పెరుగుతుంది.
ప్రశ్న: వాంతులు, విరేచనాలు తగ్గడానికి ఏదైనా సలహా ఇవ్వండి డాక్టర్ గారు.
– వైషాలి రెడ్డి, జూబ్లీహిల్స్
జవాబు: ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు తాగండి. అన్నం వంచే సమయంలో గంజి పట్టుకుని దానిని తాగండి. ఈ రెండింటితో పాటు సగ్గుబియ్యం కూ డా తాగండి. విరేచనాలు, వాంతులు తగ్గిపోతాయి. కంటిన్యూగా అవుతుంటే వెళ్లి కరో నా టెస్ట్ చేయించుకోండి.
(చదవండి: అనగనగా అపార్ట్‌మెంట్: కలిసికట్టుగా.. కోవిడ్ కేర్)
Comments
Please login to add a commentAdd a comment