King Koti district hospital
-
వైద్యుడి నిర్వాకం, భార్యను వదిలేసి యువతితో సంబంధం.. ఆస్పత్రి గోడ దూకి..
సాక్షి, హైదరాబాద్: కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడికి భార్య, ఆమె తరుపు బంధువులు దేహశుద్ధి చేశారు. భార్య, పిల్లల్ని వదిలేసి వేరే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణాలతో భార్య వైపు బంధువులు ఈ దాడికి తెగబడ్డారు. డయల్–100 ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు భార్య వైపు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేసే వైద్యుడు కొంతకాలంగా కొందరు యువతిలో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. గతంలో కామారెడ్డిలో వైద్యుడిపై కేసు నమోదు అయిన విషయం ఈ వ్యవహారంతో బయటపడింది. ఈ క్రమంలో ఎల్బీనగర్లో నివాసం ఉండే భార్య, ఇద్దరి పిల్లల వద్దకు వెళ్లడం లేదు. వారి ఆలనా పాలన కూడా చూసుకోవడం లేదు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో వైద్యుడికి నైట్ డ్యూటీ కావడంతో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుడి వెంట ఓ యువతి కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న వైద్యుడి భార్య, ఆమె తరుపు బంధువులు కింగ్‌కోఠి ఆస్పత్రికి అర్ధరాత్రి చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద కాపు కాశారు. వీరు వచ్చిన విషయం వైద్యుడికి తెలియడంతో గోడ దూకి పరారయ్యాడు. ఇతని వెంట ఉన్న యువతి తప్పించుకునేందుకు ఆస్పత్రి బిల్డింగ్ పైకి వెళ్లింది. వైద్యుడు గోడదూకి పారిపోవడంతో యువతిని పట్టుకున్నారు. అనంతరం వైద్యుడు కూడా అక్కడకు రావడంతో భార్య, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ తతాంగాన్ని చూసిన అక్కడున్న సిబ్బంది డయల్–100కు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ షఫీ సంఘటన స్థలానికి వెళ్లి దాడికి పాల్పడ్డ వారిని, వైద్యుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ వ్యవహారం కాబట్టి తాము స్వస్థలమైన వనపర్తి వెళ్లి అక్కడి పోలీసులను ఆశ్రయిస్తామని చెప్పడంతో వారిని ఇక్కడ నుంచి పంపివేయడం జరిగింది. చదవండి: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు -
కింగ్‌కోఠి ఆస్పత్రిలో 4 కిలోల మగ శిశువు జననం
హిమాయత్‌నగర్: కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో ఓ తల్లి నాలుగు కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చినట్లు మెటర్నటీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ జలజ వెరోనికా తెలిపారు. అంబర్‌పేటకు చెందిన ఓంప్రకాష్ భార్య మోనమ్మ ఇటీవల కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శనివారం ఉదయం మోనమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. మొదటి కాన్పులో మోనమ్మ నాలుగు కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. సహజంగా సిజేరియన్ ద్వా రా ఇంత బరువున్న శిశువులకు జన్ననిచ్చేలా చేస్తారని, తమవద్ద మొదటి సారి సహజ కాన్పులో అది కూడా మొదటి కాన్పులో మోనమ్మకు 4 కిలోల బిడ్డ జన్మించడం విశేషమన్నా రు. ఈ ఆస్పత్రిలో ఇలాంటి అరుదైన రీతిలో బరువున్న బిడ్డకు జన్మనివ్వడం తమకు కూడా ఆనందంగా ఉందని డాక్టర్ జలజ పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నారని డాక్టర్ సరిత తెలిపారు. -
మేడమ్.. అలా వచ్చారు.. ఇలా మార్చారు..!
హిమాయత్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రుల గేటు తట్టాలంటేనే అదో రకమైన భయం. గేటు వద్ద నుంచే పారిశుద్ధ్య లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. లైట్లు ఉండవు, ఎటువైపు ఏ బిల్డింగో తెలియదు. ఇక లోపల సిబ్బంది రోగులను కనీసం మనుషులుగా చూడకుండా దురుసు ప్రవర్తించడం వంటివి ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తుంటాయి. అటువంటి నిందా ఆరోపణలన్నింటికీ ఆమె చెక్ పెట్టారు. కేవలం వారం రోజుల్లో ఆస్పత్రి రూపురేఖలను మార్చేశారు. లైట్ల వద్ద నుంచి పారిశుద్ధ్యం, రోడ్లు, కరెంట్ ఇలా ప్రతి ఒక్కటీ నూతనంగా ఏర్పాటు చేసి తనకు తానే సాటిగా నిలుస్తూ కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తున్నారు ఆస్పత్రి స్పెషల్ ఆఫీసర్(రవాణ అండ్ ఆర్అండ్బీ స్పెషల్ ఆఫీసర్) విజయేంద్ర బోయి. అంధకారం నుంచి వెలుగులోకి... కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారం నుంచి పాత, కొత్త బిల్డింగ్ అంతా కూడా లైట్లు వెలగక చిమ్మచీకట్లు అలుముకుని ఉంది. గత ఏడాది కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆస్పత్రి పరిస్థితి ఇలాగే ఉంది. వారం రోజుల క్రితం స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన విజయేంద్ర బోయి మొట్టమొదటగా ఆస్పత్రిలో లైట్లు ఏర్పాటు చేయించారు. ముఖద్వారం నుంచి ఆస్పత్రికి ఇరువైపులా హైమాస్ట్ లైట్లు, అదేవిధంగా ఆస్పత్రి వార్డుల్లో కూడా వెలుగులు నింపారు. దీంతో పాటు ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్ వైపు వెళ్లే రోడ్డు అంతా గతుకుల మయంగా ఉండటంతో.. ఒక్కరోజులో ఆ రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. వ్యాక్సిన్ వద్ద తోపులాట, గందరోగళం పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసుల సాయంతో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వేర్వేరుగా వేసేలా ఏర్పాటు చేయించారు. కోవిడ్ టెస్టుల వద్ద చకాచకా పనులు జరిగేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇంకా చేయాల్సినవి.. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న వారికి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక అడ్మిషన్ చేసేందుకు సుమారు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. దీని పరిష్కారానికి చొరవ చూపించాలి. కోవిడ్ టెస్టుల వద్ద వచ్చిన వారంతా గంటల కొద్ది నిలబడుతూ సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ ప్రాంతంలో టెంట్ ఏర్పాటు చేసి కుర్చీలు వేయాలి. ఎమర్జెన్సీలో భాగంగా వచ్చిన వారిని స్ట్రెచర్, వీల్‌చైర్‌లో లోపలికి తీసుకెళ్లేందుకు సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఈ కారణంగా అంబులెన్స్‌లో నుంచి స్ట్రెచర్‌పైకి ఎక్కించే క్రమంలో రోగులు కిందపడిపోతున్నారు. కాబట్టి సిబ్బందిని కూడా కొంత పెంచాల్సి ఉంది. అడ్మిషన్, రిజిస్ట్రేషన్ వద్ద గందర గోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరు ఏ పని చేస్తున్నారనేది స్పష్టత లేదు. దీంతో రోగుల సహాయకులు ఇటూ..అటూ.. తిరగడంలోనే సమయం వృథా అవుతుంది. ఆస్పత్రి బోర్డులు, సీసీ కెమెరాలు కనిపించకుండా చెట్ల కొమ్మలు దట్టంగా పెరిగాయి. దీనివల్ల ఏవైనా సంఘటనలు జరిగితే ఆ కెమెరాల్లో రికార్డ్ కాలేని పరిస్థితి ఉంటుంది. అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని నారాయణగూడ పోలీసులు నెలా పదిరోజుల క్రితం సంబంధిత శాఖకు లేఖ రాశారు. వాళ్లు ఇంతవరకు పట్టించుకోలేదు. గత ఏడాది ఆస్పత్రి ముఖద్వారానికి ఇరువైపులా చాలా విశాలంగా.. పచ్చదనంగా ఉండేది. ఇప్పుడు తోపుడు బళ్లు అధికంగా ఉండటం వల్ల జనాలు గుమిగూడుతున్నారు. వైద్యులతో విజయేంద్ర బోయి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వారు ముఖద్వారాన్ని చూసి ముచ్చటపడేలా ఉండాలి. అందుకు లైట్లు.. చెత్తాచెదారం లేకుండా నీటిగా ఉండటమే. ప్రైవేటు ఆసుపత్రులు ఎంత క్లీన్‌గా ఉంటున్నాయో.. అంతకంటే క్లీన్‌గా కింగ్‌కోఠి ఆసుపత్రి ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకు వైద్యులు, సిబ్బంది సహకారం నాకు చాలా అవసరం. ప్రతిఒక్కరూ నాతో పాటు అడుగు వేస్తే కింగ్‌కోఠి ఆసుపత్రిని అభివృద్ధి పథంలో తీసికెళ్తా. ఇక్కడకు వచ్చే రోగులకు మీరంతా ధైర్యం నింపే వారు కావాలి. -
Photo Feature: అప్పుల బాధ.. కరోనా పీడ
ప్రకృతి విపత్తులకు తోడు కరోనా మహమ్మారి విజృంభణతో అన్నదాతల కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పుల బాధతో వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో జనం అవస్థలు మరింత పెరిగాయి. ఆస్పత్రుల్లో చేరే దారిలేక, సరైన వైద్యం అందక కరోనా బాధితులు అల్లాడుతున్నారు. -
కోవిడ్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు.. సమాధానాలు ఇవిగో!
హిమాయత్‌నగర్: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆస్పత్రికి రావాలంటే గజగజ వణుకుతున్నారు. వైద్యులు కూడా ఇంటి వద్దనే ఐసోలేషన్‌లో ఉండి పలు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనాను జయిద్దాం’ అనే కాన్సెప్‌్టతో ‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్‌తో సోమవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాలకు చెందిన పలువురు ఫోన్స్ చేసి డాక్టర్ రాజేంద్రనా«థ్ నుంచి అనేక సలహాలు, సూచనలను తీసుకున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన ఈ ‘ఫోన్‌ఇన్’కు ప్రజల నుంచి విశేష స్పందన వచి్చంది. సుమారు 179 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేయడం విశేషం. పాఠకుల ప్రశ్నలు, డాక్టర్ రాజేంద్రనాథ్ సమాధానాలు ఇలా.. ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి సమయంలో జ్వరం వస్తుంది. డోలో వేస్తున్నా తగ్గట్లేదు ఏం చేయాలి? – ఉదయ్‌కృష్ణ, బంజారాహిల్స్ జవాబు: పారాసెటమాల్ ట్యాబ్లెట్‌ను వరుసగా రెండు రోజులు వాడండి. రెండు రోజులు వాడినా తగ్గకుండా జ్వరం అలాగే ఉన్నా.. వచ్చి పోతున్నా.. తక్షణమే మీ దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. ప్రశ్న: కాళ్లు నొప్పులు బాగా వస్తున్నాయి డాక్టర్ గారు. నాకు కరోనా ఏమైనా వచ్చిందంటారా? – సాయిరాం, హిమాయత్‌నగర్ జవాబు: పారాసెటమాల్ లేదా డోలో ట్యాబ్లెట్స్ రెండు లేదా మూడు రోజులు వాడండి. అప్పటికీ తగ్గకుండా ఆయాసం లాంటిది వస్తే వెళ్లి టెస్ట్ చేయించుకోండి. ప్రశ్న: రెండ్రోజులుగా చల్లనీళ్లు తాగుతున్నా. గొంతు బాగా ఎండిపోతుంది. నాకు కరోనా ఏమైనా వచి్చనట్టా? – అమీన్, హిమాయత్‌నగర్ జవాబు: భయపడాల్సిన అవససరం ఏమీ లేదు. మీరు రెండ్రోజుల పాటు క్రమం తప్పకుండా డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్స్ను వాడండి. అలాగే కొద్దిగా ఈ టైంలో చల్లని నీటిని తగ్గించండి. ప్రశ్న: డాక్టర్ గారూ ఒకసారి తడి దగ్గు కొద్దిసేపు అయ్యాక పొడి దగ్గు వస్తుందండి. దగ్గు రాకుండా ఉండేందుకు సిరప్ తాగుతున్నాను. – రమా, నారాయణగూడ జవాబు: చల్లటి నీరు తాగడం మానేయండి. డాక్సీసైక్లిన్ 100 ఎంఎమ్జీ ట్యాబ్లెట్ వాడండి. మూడు రోజులుగా ఇలాగే ఉండి తగ్గకపోతే వెంటనే కోవిడ్ ర్యాపిడ్ లేదా ఆరీ్టపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. ప్రశ్న: ప్రతిరోజూ రాత్రి జ్వరం వస్తుంది. ఉదయం తగ్గిపోతుంది. – చంద్రకళ, హిమాయత్‌నగర్ జవాబు: ఆందోళన ఏమీ వద్దు. డోలో 650 ట్యాబ్లెట్ అయితే రెండు పూటలా వేసుకోండి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ అయితే మూడు పూటలా వేసుకోండి. తగ్గకపోతే ఖచి్చతంగా వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. నిర్లక్ష్యం వద్దు ఇలా జ్వరం తరచూ వస్తుంటే. ప్రశ్న: రెండ్రోజులుగా నీళ్ల విరేచనాలు అవుతున్నాయి. కాస్త భయంగా ఉంది డాక్టర్ గారు. – సర్ఫరాజ్, దత్తానగర్ జవాబు: ఎక్కువగా అవుతుంటే దగ్గర్లోని డాక్టర్ని సంప్రదించండి. విరేచనాలతో పాటు జ్వరం కూడా వస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. డాక్సీసైక్లిన్ ట్యాబ్లెట్‌ను కూడా వాడొచ్చు. ప్రశ్న: కొద్దిరోజులుగా తుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. నాకు సహజంగానే డస్ట్ ఎలర్జీ ఉంది. వ్యాక్సిన్ వేసుకోవచ్చా? – నీలిమా, పంజగుట్ట జవాబు: డస్ట్ ఎలర్జీ ఉన్నంత మాత్రాన వ్యాక్సిన్‌కు భయపడక్కర్లేదు. ధైర్యంగా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మీరు మొదటి డోస్ వేసుకున్నాక ఎలర్జీ రాలేదు కాబట్టి రెండో డోస్ టైం రాగానే టీకా వేసుకోండి. ప్రశ్న: వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పాజిటివ్ ఏమైనా వస్తుందా? – భారాతి, ముషీరాబాద్ జవాబు: వ్యాక్సిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా కోవిడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఉదయమే వేడి నీళ్లల్లో పసుపు వేసుకుని తాగొచ్చా డాక్టర్? – రమా, బాగ్ అంబర్‌పేట జవాబు: హా.. నిశ్చంతంగా తాగొచ్చు. నీళ్లు కాగుతున్న సమయంలోనే చిటికెడు పసుపు వేయండి. కాస్త చల్లారినాక వాటిని తాగితే ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో షుగర్ వేయొద్దు. ప్రశ్న: కోవిడ్ వచ్చినా.. రాకున్నా.. ఇంట్లో ఉండి ఏ విధమైన ఆహారం తీసుకోవచ్చు? – ప్రతిమరెడ్డి, లక్డీకాపూల్ జవాబు: ఇంట్లో ఉండి చక్కగా ఉదయం రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఒక గ్లాస్ పాలు తీసుకోండి. దానితో పాటు మాంసాహారం కూడా తినొచ్చు. జీడిపప్పు, బాదం పప్పు కూడా తినండి ప్రొటీన్ శాతం పెరుగుతుంది. ప్రశ్న: వాంతులు, విరేచనాలు తగ్గడానికి ఏదైనా సలహా ఇవ్వండి డాక్టర్ గారు. – వైషాలి రెడ్డి, జూబ్లీహిల్స్ జవాబు: ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు తాగండి. అన్నం వంచే సమయంలో గంజి పట్టుకుని దానిని తాగండి. ఈ రెండింటితో పాటు సగ్గుబియ్యం కూ డా తాగండి. విరేచనాలు, వాంతులు తగ్గిపోతాయి. కంటిన్యూగా అవుతుంటే వెళ్లి కరో నా టెస్ట్ చేయించుకోండి. (చదవండి: అనగనగా అపార్ట్మెంట్: కలిసికట్టుగా.. కోవిడ్ కేర్) -
కింగ్‌కోఠి ఆస్పత్రిలో దారుణం: ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: కింగ్ కోఠి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సమయానికి అందక కోవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఉన్న ఫిల్లింగ్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోయింది. ఆక్సిజన్ అట్టఅడుగు స్థాయికి చేరే వరకు ఫిల్ చేయకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటీకి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 20 మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు. చదవండి: డాక్టర్ మృతి, 80 మంది సిబ్బందికి కరోనా -
వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి!
సాక్షి హిమాయత్‌నగర్: బద్వెల్ నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాదవ్‌రావు(65)ను అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 70శాతం ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కుటుంబ సభ్యులు అతడిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 45 నిమిషాల తర్వాత ఒక నర్సు వచ్చి ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ చెక్ చేయగా.. 72 ఉంది. అడ్మిట్ చేసుకుంటారో.. లేదో అనే ఆందోళనతో అదే అంబులెన్స్‌లో గంటల తరబడి వేచి చూశారు. గంటన్నర తర్వాత వెంటిలేటర్ లేదనడంతో తిరిగి మరో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఓ పక్క భర్త పరిస్థితి చూడలేక.. మరో పక్క బెడ్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌తో భార్య కన్నీటి పర్యంతమైంది.. మరో ఘటనలో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ 82 ఉంది. వెంటిలేటర్ బెడ్ లేదన్నారు. ఇంకో ఘటనలో యువకుడి పరిస్థితి మరింత ఆందోళనగా మారింది. చేర్చుకోలేమని పంపేశారు. ఇదీ కింగ్‌కోఠి ఆస్పత్రిలో వెంటిలేటర్ బెడ్లు లేక రోగులు, రోగుల బంధువులు పడుతున్న అవస్థలు. గాంధీ ఆస్పత్రిలోని బెడ్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తే నయం అవుతుందనే నమ్మకంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి వస్తున్న రోగులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పడకలన్నీ ఫుల్ కావడంతో గాంధీకి వెళ్లిపోండంటూ మోహంపై చెప్పేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే గంటన్నర వ్యవధిలో 12మంది పేషెంట్లు కింగ్‌కోఠికి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. వారంలో వందకు పైగా.. ప్రాణాలను నిలబెట్టుకునేందుకు వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. వచ్చిన వెంటనే ఇక్కడ బెడ్స్ లేవమ్మా.. వెళ్లిపోండి. టైం వేస్ట్ చేసుకోవద్దంటున్నారు. తిరిగి గాంధీకి వెళ్లలేక ప్రైవేటు ఆస్పత్రిని భరించలేక వెనుదిరుగుతున్నారు. ఇలా వారం రోజుల్లో సుమారు 100మందికి పైగా సీరియస్ కండీషన్లో ఉన్న వారు తిరిగి వెళ్లిపోయారు. వెంటిలేటర్లు పెంచితే.. కింగ్‌కోఠి ఆస్పత్రి చాలా విశాలంగా, సామర్థ్యం కలిగిన ఆస్పత్రి. ఇక్కడ సదుపాయాలను గుర్తించి ప్రభుత్వం వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేయగలిగితే ఎందరో ప్రాణాలను రక్షించినవారవుతారు. కేవలం వెంటిలేటర్ బెడ్స్ లేక నిస్సహాయ స్థితిలో వెనుదిరుగుతున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఒకరు చనిపోతే.. లేదా డిశ్చార్జి అయితేనే మరొకరిని వెంటిలేటర్‌పైకి తీసికెళ్లే పరిస్థితి కింగ్‌కోఠిలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘చాలా మంది వెళ్లిపోతున్నారు’ ఎంతమంది వస్తున్నారు.. ఎంతమంది వెళ్లిపోతున్నారనేది చెప్పలేం. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86కంటే ఎక్కువ ఉంటేనే మేం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి వెంటిలేటర్ బెడ్స్ అన్నీంటిలోనూ పేషెంట్లు ఫుల్‌గా ఉన్నారు. ఎమర్జెన్సీపై వస్తున్న వారిని తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నవరకు మేం పేషెంట్లకు నయం చేసి బయటకు పంపిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి చదవండి: లాక్డౌన్ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: హైకోర్టు -
కరోనా: ఆసుపత్రి బయట టీ, కాఫీలకు వెళ్లొస్తున్న రోగులు
సాక్షి, హిమాయత్‌నగర్: కోవిడ్‌కు గురై కింగ్‌కోఠి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులు కాస్తంత తేరుకున్నాక బయటకెళ్లొస్తున్నారు. పక్క బెడ్ వారికి ఓ మాట చెప్పేసి బయటకు వెళ్లి అలా ఓ టీ లేదా కాఫీ తాగి కొద్దిసేపు చెట్ల కింద కూర్చుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలేవీ కూడా అక్కడున్న సిబ్బంది, సూపరింటెండెంట్, నోడల్ అధికారి, స్టాఫ్ నర్సులకు కానీ అస్సలు తెలియడం లేదు. సిబ్బంది కారణంగా ఏ ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ లేని కారణంగా కోవిడ్ రోగులు ఇష్టారాజ్యాంగా బయటకెళ్లొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు బెడ్లకు ఒకరు ఉండాలి ఆస్పత్రిలో మొత్తం మీద 350 పడకలు ఉన్నాయి. వీటిలో 50 ఐసీయూ పడకలు, 33 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. మిగిలినవన్నీ ఆక్సిజన్ బెడ్సే. అయితే ఐసీయూలో పేషెంట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రతి ఐదు బెడ్లకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ.. ఇక్కడ జరుగుతుంది వేరు. ఐసీయూలోని వెంటిలేటర్ బెడ్ల వద్ద వైద్యుడి పర్యవేక్షణ కొరవడింది. దీనికి కారణం వైద్యులు తక్కువ ఉండటమే. ఆస్పత్రి మొత్తం సూపరింటెండెంట్, అడిషినల్ సూపరింటెండెంట్, నోడల్ అధికారి వంటి వారితో కలిపి సీనియర్, జూనియర్, డిప్యూటేషన్‌పై వచ్చిన వారు ఇలా మొత్తం మీద 28 మంది వైద్యులు ఉన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు మొదలుకొని వ్యాక్సిన్ వేసే వరకు అన్ని చోట్ల వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీని కారణంగా ఐసీయూలో సరైన పాత్ర పోషించలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది కొరతతోనే.. వైద్యులతో పాటు స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్, 4వ తరగతి ఉద్యోగుల కొరత సైతం తీవ్రంగా పట్టి పీడిస్తుంది. దీని కారణంగా కోవిడ్ రోగుల వద్ద సరైన పర్యవేక్షణ లేదు. రోగులను పట్టించుకునే వారు లేరు. దీంతో కాస్త కోలుకున్న కోవిడ్ రోగులు లోపల వార్డులో ఉండలేక ఆస్పత్రి బయటకు వెళ్లి మరీ టీ తాగి, కాస్త కాలక్షేపం చేసి వస్తున్నారని సీనియర్ వైద్యులు బహిర్గతంగా చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు చెప్పినప్పటికీ.. ఎవరూ కరోనా రోగి ఎవరూ అటెండెంట్ అనేది తాము గుర్తించలేమనే జవాబు ఎదురవుతుంది. ఇలా పేషెంట్లు బయటకు వెళ్లి వస్తే వారి నుంచి ఇతరులకు కోవిడ్ సోకే ప్రమాదం పొంచి ఉందని సిబ్బంది వాపోతున్నారు. మూడు రోజుల క్రితం ఒక పేషెంట్ ఏకంగా ఉద యం అనగా వెళ్లి రాత్రి 7 గంటలకు తిరిగి రాకపోవడాన్ని ‘సాక్షి’ ప్రచురించిన విషయం విధితమే. కోవిడ్ బారీన పడుతున్న సిబ్బంది కింగ్ కోఠి ఆస్పత్రి సిబ్బంది సైతం కోవిడ్ బారిన పడుతుండటంతో మరింత పనిభారం ప్రస్తుతం చేస్తున్న వారిపై పడుతుంది. ప్రతిరోజూ టెస్టుల కోసం వచ్చే వారి ఓపీ 350 నుంచి 400 మధ్య ఉంటుంది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, వైద్యులు అదే విధంగా కోవిడ్ వార్డులో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది, 4వ తరగతి ఉద్యోగులు సైతం కరోనాకు గురవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా 35 మందికి పైగా సిబ్బ ందికి కరోనా వ్యాపించింది. వారందరూ తిరిగి కోలుకుని విధులకు హాజరవుతున్నప్పటికీ.. మరికొంత మందికి మళ్లీ వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఆరుగురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం కొద్దిగా తేరుకున్నాక కొందరు రోగులు బయటకు వెళ్లి వస్తున్న విషయం తెలిసింది. అటెండెంట్స్ వచ్చి మా పేషెంట్ ఎక్కడా అని మమ్మల్నే అడుగుతున్నారు. వారం రోజుల క్రితం శంకర్ అనే యువకుడు ఉదయం 7 గంటల ప్రాంతంలో వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి మళ్లీ వచ్చాడు. ఈ విషయంపై నారాయణగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆ పరిణామాలను కట్టడి చేసే దిశగా ఆలోచిస్తున్నాం. – డాక్టర్ రాజేంద్రనాథ్, సూపరింటెండెంట్, కింగ్‌కోఠి ఆస్పత్రి చదవండి: కరోనా టెస్ట్ చేయలేదని వ్యక్తి హల్చల్! -
తాత చనిపోయాడని.. ఆస్పత్రిలో యువతి బీభత్సం
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కరోనాతో తమ తాతయ్య ప్రాణం పోవడం తట్టుకోలేక ఓ యువతి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. గురువారం కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రిలో బోడుప్పల్‌కు చెందిన సంజీవ్‌రావు (88) నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో అడ్మిట్ అయ్యాడు. సంజీవరావును కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా తమవంతుగా ప్రయత్నించారు. మూడ్రోజులపాటు 12 లీటర్ల ఆక్సిజన్‌ను అతనికి పెట్టారు. అయితే అతడిలో ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో వెంటిలేటర్ పెట్టాలని వైద్య సిబ్బంది సంజీవరావు కుటుంబ సభ్యులకు సూచించగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. ఆస్పత్రిలో ధ్వంసమైన వెంటిలేటర్ చివరికి గురువారం మధ్యాహ్నం సంజీవరావు ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పెట్టగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో ఆవేదన చెందిన మనవరాలు ఆస్పత్రి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సంజీవరావుకు పెట్టిన వెంటిలేటర్‌ను పగుల గొట్టడంతో వెంటిలేటర్ పాడైంది. కాగా, యువతి చర్యపై కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వైద్యులు నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
‘కింగ్‌కోఠి’కి ఉస్మానియా రోగులు
* తొలి విడతగా 24 మంది రోగులు.. పలువురు వైద్య సిబ్బంది తరలింపు * దశలవారీగా మిగిలిన విభాగాలు.. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. * రోగుల తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు * రెండు వర్గాలుగా విడిపోయి.. వాగ్వాదానికి దిగిన వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి రోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా బుధవారం సాయంత్రం 24 మంది రోగులను రెండు అంబులెన్సుల్లో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా పాత భవనంలో 130 ఆర్థోపెడిక్ పడకలుండగా.. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పురుషులు, 12 మంది మహిళలను తరలించారు. వీరితో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు స్పెషలిస్టులు, ఆరుగురు జూనియర్ డాక్టర్లు, ఒక డీఎస్వో, 14 మంది స్టాఫ్ నర్సులను కూడా తరలించారు. మిగిలిన వారిని దశలవారీగా తరలించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి మరో భవనం కట్టాలని కొంతమంది వైద్యులు వాదిస్తుంటే.. పాతభవనం ఉన్న రెండెకరాల స్థలాన్ని వదిలేసి, మిగిలిన ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టవచ్చని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఒకరిద్దరితో మాట్లాడి ఏకపక్షంగా రోగులను తరలించడం ఎంత వరకు సమంజసమని కార్డియో థొరాసిక్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ప్రశ్నించగా.. తెలంగాణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు బొంగు రమేష్ అడ్డుతగలడంతో వాగ్వాదం చోటు చేసుకుని.. ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన ఉస్మానియా పాత భవనంలో 875 పడకలున్నాయి. వీటిలో 130 పడకల ఎముకల విభాగాన్ని కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్‌లోని 8 యూనిట్లు, జనరల్ సర్జరీలోని 8 యూనిట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్, గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్‌ను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని భావించింది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డుల్లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తై తర్వాతే ఉస్మానియా రోగులను తరలించాలని నిర్ణయించింది. అయితే తమ ఆస్పత్రిని తరలించవద్దంటూ సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యులు బుధవారం ఆందోళనకు దిగారు. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. ఉస్మానియా పాత భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని ఖాళీ చేయడం అనివార్యమైంది. అయితే క్యాజువాలిటీ సహా అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు మాత్రం ఉస్మానియాలోనే అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే క్షతగాత్రులకు ఇక్కడే చికిత్స లభించనుంది. ఎమర్జెన్సీ రోగులను కాక ఎలక్టివ్ పేషెంట్లను మాత్రమే నిర్దేశిత ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఆయా ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఓపీ సేవలతోపాటు ఇన్‌పేషెంట్ల అడ్మిషన్ ప్రక్రియంతా ఉస్మానియా నుంచే జరుగుతుందని ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ రఘురామ్ తెలిపారు.