
సాక్షి, హైదరాబాద్: కింగ్ కోఠి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ సమయానికి అందక కోవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యం కావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఉన్న ఫిల్లింగ్ ట్యాంక్‌లో ఆక్సిజన్ అయిపోయింది. ఆక్సిజన్ అట్టఅడుగు స్థాయికి చేరే వరకు ఫిల్ చేయకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించారని బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఇప్పటీకి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 20 మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment