ప్రకృతి విపత్తులకు తోడు కరోనా మహమ్మారి విజృంభణతో అన్నదాతల కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పుల బాధతో వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉండే ఎద్దులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో జనం అవస్థలు మరింత పెరిగాయి. ఆస్పత్రుల్లో చేరే దారిలేక, సరైన వైద్యం అందక కరోనా బాధితులు అల్లాడుతున్నారు.
1/9
ఆరుగాలం రైతులకు తోడుండే బసవన్నలను వేలం పాట వేయాల్సిన పరిస్థితి వచ్చింది. పంట చేన్లలో రైతులకు సహాయకారిగా ఉండే బసవన్నలకు ప్రస్తుతం మేత లేకపోవడం.. రైతులు అప్పులబాధలో ఉండటం.. ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎద్దుల అంగడి బజార్‌లో ఇలా అమ్ముకుంటూ కన్పించారు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్.
2/9
ఇక్కడ ఉన్నవారిలో కరోనా టీకా కోసం వచ్చిన వారు ఉన్నారు... కరోనా అనుమానంతో నిర్ధారణ కోసం పరీక్షకు వచ్చిన వారూ ఉన్నారు. టీకా కొరత నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వేర్వేరు లైన్లలో ఉండాల్సిన వారు కలగలసిపోయారు. దీంతో తోపులాటలు జరుగుతున్నాయి. టీకా కోసం వస్తే వైరస్‌ను అంటించుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద దృశ్యం ఇది.
3/9
ర్యాపిడ్ టెస్టు కోసం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి స్ట్రెచర్‌పై తీసుకొచ్చిన దండెంపల్లికి చెందిన వెంకన్న
4/9
హైదరాబాద్‌లో వ్యాక్సిన్ కష్టాలకు ఈ చిత్రమే నిదర్శనం. కింగ్‌కోఠి ఆస్పత్రిలో సోమవారం తాకిడి, తొక్కిసలాట ఎక్కువవడంతో సెక్యురిటీ సిబ్బంది అందరి వద్ద ఆధార్ జిరాక్స్ కాపీలు తీసుకుని వరుసలో రావాలని సూచించారు. కొందరు ఇలా టోకెన్, ఆధార్ నెంబరు చెబుతూ తమకు వ్యాక్సిన్ అవకాశం ఇవ్వాలంటూ వేడుకోవడం కనిపించింది.
5/9
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్పత్రిలో బెడ్లు ఖాళీలేక, ఆక్సిజన్ సమస్యతో కరోనా బాధితులు, వారి కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
6/9
కరోనా బాధితుల వైద్యం కోసం హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట వద్ద సోమవారం అంబులెన్స్‌ను ఆపిన పోలీసులు.
7/9
కేరళలోని కోజికోడ్‌లో లాక్‌డౌన్ విధించడంతో సామూహిక వంటశాలలో తయారైన ఆహారాన్ని కోవిడ్ బాధితుల కోసం ప్యాక్ చేస్తున్న వలంటీర్లు
8/9
కోవిడ్ రోగుల కోసం ఢిల్లీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు 11 ఆక్సిజన్ ట్యాంకర్లతో చేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు
9/9
ఢిల్లీలో లాక్‌డౌన్ కారణంగా తిమార్‌పూర్ యార్డులో నిలిపి ఉంచిన మెట్రో రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment