King Koti Hospital Doctor Illegal Relation With Woman, Attacked By Wife Relatives - Sakshi
Sakshi News home page

కింగ్‌ కోఠి వైద్యుడి నిర్వాకం, భార్యను వదిలేసి యువతితో సంబంధం.. ఆస్పత్రి గోడ దూకి..

Published Fri, May 19 2023 7:59 AM | Last Updated on Fri, May 19 2023 10:26 AM

King Koti Hospital Doctor Illegal Relation With Woman Attack By Relatives - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కింగ్‌ కోఠి జిల్లా ఆస్పత్రికి చెందిన ఓ వైద్యుడికి భార్య, ఆమె తరుపు బంధువులు దేహశుద్ధి చేశారు. భార్య, పిల్లల్ని వదిలేసి వేరే యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కారణాలతో భార్య వైపు బంధువులు ఈ దాడికి తెగబడ్డారు. డయల్‌–100 ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు భార్య వైపు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్‌ విభాగంలో పనిచేసే వైద్యుడు కొంతకాలంగా కొందరు యువతిలో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నాడు.

గతంలో కామారెడ్డిలో వైద్యుడిపై కేసు నమోదు అయిన విషయం ఈ వ్యవహారంతో బయటపడింది. ఈ క్రమంలో ఎల్బీనగర్‌లో నివాసం ఉండే భార్య, ఇద్దరి పిల్లల వద్దకు వెళ్లడం లేదు. వారి ఆలనా పాలన కూడా చూసుకోవడం లేదు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో వైద్యుడికి నైట్‌ డ్యూటీ కావడంతో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుడి వెంట ఓ యువతి కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న వైద్యుడి భార్య, ఆమె తరుపు బంధువులు కింగ్‌కోఠి ఆస్పత్రికి అర్ధరాత్రి చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద కాపు కాశారు. వీరు వచ్చిన విషయం వైద్యుడికి తెలియడంతో గోడ దూకి పరారయ్యాడు.

ఇతని వెంట ఉన్న యువతి తప్పించుకునేందుకు ఆస్పత్రి బిల్డింగ్‌ పైకి వెళ్లింది. వైద్యుడు గోడదూకి పారిపోవడంతో యువతిని పట్టుకున్నారు. అనంతరం వైద్యుడు కూడా అక్కడకు రావడంతో భార్య, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ తతాంగాన్ని చూసిన అక్కడున్న సిబ్బంది డయల్‌–100కు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ షఫీ సంఘటన స్థలానికి వెళ్లి దాడికి పాల్పడ్డ వారిని, వైద్యుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ వ్యవహారం కాబట్టి తాము స్వస్థలమైన వనపర్తి వెళ్లి అక్కడి పోలీసులను ఆశ్రయిస్తామని చెప్పడంతో వారిని ఇక్కడ నుంచి పంపివేయడం జరిగింది.
చదవండి: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. మండపంలో విషం తాగిన వధూవరులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement