
హిమాయత్‌నగర్: కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో ఓ తల్లి నాలుగు కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చినట్లు మెటర్నటీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ జలజ వెరోనికా తెలిపారు. అంబర్‌పేటకు చెందిన ఓంప్రకాష్ భార్య మోనమ్మ ఇటీవల కాన్పు నిమిత్తం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శనివారం ఉదయం మోనమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. మొదటి కాన్పులో మోనమ్మ నాలుగు కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది.
సహజంగా సిజేరియన్ ద్వా రా ఇంత బరువున్న శిశువులకు జన్ననిచ్చేలా చేస్తారని, తమవద్ద మొదటి సారి సహజ కాన్పులో అది కూడా మొదటి కాన్పులో మోనమ్మకు 4 కిలోల బిడ్డ జన్మించడం విశేషమన్నా రు. ఈ ఆస్పత్రిలో ఇలాంటి అరుదైన రీతిలో బరువున్న బిడ్డకు జన్మనివ్వడం తమకు కూడా ఆనందంగా ఉందని డాక్టర్ జలజ పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యకరంగా ఉన్నారని డాక్టర్ సరిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment