
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిలకలగూడ : పార్కింగ్ చేసిన ఆడీ కారు మాయమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారావునగర్ లెజెండ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రోమిత్‌పటేల్ తన స్వస్థలమైన గుజరాత్‌లో ఆడీ కారును సెకండ్స్‌లో రూ.8 లక్షలకు కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నగరానికి తీసుకువచ్చాడు.
సోమవారం ఉదయం అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో పార్కు చేశాడు. మ.1.30 గంట సమయంలో చూడగా కారు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఐ సంజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment