ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా దృష్టి ఈ సారి ఓ కార్ డ్రైవర్‌పై పడింది. ఖరీదైన కార్లున్నా వాటిలో ప్రయాణించేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏమిటంటే వాటిని పార్క్ చేయడానికి స్థలాన్ని కనుగొనడం. అయితే, ఇప్పుడు మనకు పరిష్కారం దొరికినట్లు ఉందంటూ.. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పై అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఉన్న ఓ వీడియోను పంచుకున్నారు.
'కొంతకాలం క్రితం పంజాబ్‌లో ఇలాంటి పరికరం ఉపయోగిస్తున్న వీడియోను చూశాను. పార్కింగ్ కోసం కచ్చితమైన కొలతలతో అతను తయారుచేసిన ఆ మెటల్ ప్యానెల్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. దీన్ని రూపొందించిన వ్యక్తి మా ఫ్యాక్టరీ లే అవుట్‌లను కూడా మరింత సమర్థవంతంగా రూపొందించడానికి కొన్ని ప్రత్యేక సూచనలను ఇవ్వగలరని నేను పందెం వేస్తున్నాను!' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. చదవండి: మూడు విడతలుగా లాక్‌డౌన్ ఎత్తివేత
అయితే ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కారును ఇంటి వెలుపల మెటల్ ప్యానెల్‌పై పార్క్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఈ ప్యానెల్ సాధారణంగా మెకానిక్ షాపుల్లో కనిపించే వాటికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అతడు తన కారును ఆ ప్యానెల్ పై పార్క్ చేసిన తర్వాత, కారు నుంచి బయటకు వచ్చి కారుతో పాటు మొత్తం ప్యానెల్‌ను తన ఇంటి మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలంలోకి నెట్టడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ వీడియోపై స్పందిస్తూ.. కార్ పార్కింగ్ కోసం అక్కడున్న చెట్టును తొలగించకుండా అతను అనుసరించిన విధానం బాగుందంటూ ప్రశంసలు కురుపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment