వ్యాపారవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్భుతమైన పోస్ట్‌తో అభిమానులను ఫిదా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ,ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలను, విజ్ఞానదాయక అంశాలను పంచుకునే ఆయన తాజాగా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
విషయం ఏమిటంటే...
ఇటీవల అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ చెన్నైలోని ఒక వీధి వ్యాపారి గురించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్‌లో పనిచేస్తున్న పీహెచ్‌డీ స్టూడెంట్ రేయాన్‌ని పరిచయం చేశాడు. అంతేకాదు ఇందులో యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి రేయాన్ ప్రశ్నించగా, దానికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్‌లైన్‌లో చూపించడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. దీంతో రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. అతణ్ని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడంతో పాటు, ఇన్క్రెడిబుల్..యూనిక్. ఇండియన్ అంటూ అభినందించడం విశేషం. దీంతో ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన వ్యక్తి అంటూ తెగపొగిడేస్తున్నారు.
This clip went viral a while ago.
An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.
What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG— anand mahindra (@anandmahindra) October 4, 2024
Comments
Please login to add a commentAdd a comment