Incredible India
-
ఆనంద్ మహీంద్రను ఫిదా చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియన్
వ్యాపారవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్భుతమైన పోస్ట్‌తో అభిమానులను ఫిదా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ,ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలను, విజ్ఞానదాయక అంశాలను పంచుకునే ఆయన తాజాగా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే...ఇటీవల అమెరికన్ యూట్యూబర్ క్రిస్టోఫర్ లూయిస్ చెన్నైలోని ఒక వీధి వ్యాపారి గురించి ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో పార్ట్ టైమ్ ఫుడ్ స్టాల్లో పనిచేస్తున్న పీహెచ్డీ స్టూడెంట్ రేయాన్ని పరిచయం చేశాడు. అంతేకాదు ఇందులో యూట్యూబర్ తన సోషల్ మీడియా ఖాతాల గురించి రేయాన్ ప్రశ్నించగా, దానికి బదులు సగర్వంగా తన రీసెర్చ్ పేపర్స్ ఆన్లైన్లో చూపించడం విశేషంగా నిలిచింది. ఈ వీడియోనే ఆనంద్ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. దీంతో రేయాన్ స్ఫూర్తిని ప్రశంసిస్తూ తన ఎక్స్ ఖాతాలో ఆయన షేర్ చేశారు. అతణ్ని అత్యద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించడంతో పాటు, ఇన్క్రెడిబుల్..యూనిక్. ఇండియన్ అంటూ అభినందించడం విశేషం. దీంతో ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. విద్యతో ఉన్నత వ్యక్తిత్వం కలగలిసిన వ్యక్తి అంటూ తెగపొగిడేస్తున్నారు.This clip went viral a while ago. An American vlogger discovers a Ph.D candidate running a food stall, part-time.What struck me as truly special, however, was the end, when he picks up his phone & the vlogger thinks he’s going to show him social media mentions of his… pic.twitter.com/e9zMizTJwG— anand mahindra (@anandmahindra) October 4, 2024 -
హాస్పిటల్ రంగంలోకి ఇన్క్రెడిబుల్ ఇండియా
రాంగోపాల్‌పేట్: రూ.100 కోట్లతో అస్సాంలోని గౌహతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వచ్చే 2021 ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి వస్తుందని ఇన్క్రెడిబుల్ ఇండియ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీవోవో ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ విజయ్‌కుమార్‌లు తెలిపారు. సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో ఈ గ్రూపు ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ వన్ హోటల్‌ను వారు ప్రారంభించారు. గత ఏడాది ఆతిధ్య రంగంలోకి ప్రవేశించి లక్డీకపూల్లో హ్యాంప్‌షైర్ ప్లాజా, కొచ్చిలో రాడిసన్ బ్లూ పేరుతో ప్రారంభించామని ఇప్పుడు రూ.25 కోట్లతో పార్క్‌లేన్‌లో ఇన్క్రెడిబుల్ వన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు.మ్యాన్‌ఫాక్చరింగ్ రంగంలోకి ప్రవేశించి రూ.60కోట్లతో పార్లీ సంస్థతో కలిసి యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లో 3 ఎకరాల స్థలంలో బిస్కెట్, కేక్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆతిథ్య రంగంలోకి ఇన్క్రెడిబుల్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఉన్న ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్... అతిథ్య రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఉన్న హాంప్‌షైర్ ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.42 కోట్లు. ఈ ఏడాదే గోవాలోనూ ఓ హోటల్‌ను టేకోవర్ చేయనున్నట్టు ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సీవోవో ప్రవీణ్ కుమార్ నెడుగండి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఆతిథ్య రంగంలో మరిన్ని ప్రాజెక్టులను చేజిక్కించుకుంటామని ఈ సందర్భంగా చెప్పారాయన. ‘2008లో రియల్టీ రంగంలోకి ప్రవేశించాం. 2,500 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇతర కంపెనీల కంటే 50 శాతం తక్కువ ధరకే ప్లాట్లను విక్రయిస్తున్నాం. ఇప్పటిదాకా 29,000 ప్లాట్లు విక్రయించాం. నిర్మాణ రంగంలోకి సైతం ప్రవేశిస్తున్నాం’’ అని తెలియజేశారు. బిస్కెట్ ఫ్యాక్టరీ.. చౌటుప్పల్ సమీపంలో కంపెనీ 3 ఎకరాల్లో బిస్కెట్ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 2,000 టన్నుల బిస్కెట్లు, 500 టన్నుల కేక్ తయారు చేయగలిగే సామర్థ్యంతో ఇది రానుంది. ప్రాజెక్టు వ్యయం రూ.30 కోట్లు. దీనిద్వారా ప్రత్యక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. 2019లో ఉత్పత్తి కార్యకలాపాలు మొదలవుతాయి. దీనికి సంబంధించి పార్లే కంపెనీతో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ చేతులు కలిపింది. తొలుత ఇక్కడ పార్లే కోసం ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇతర కంపెనీలతోనూ థర్డ్ పార్టీ డీల్ కోసం చర్చిస్తున్నట్టు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బిస్కెట్లు, కేక్స్‌ను సొంత బ్రాండ్‌లో విదేశాల్లో విక్రయించనున్నట్టు చెప్పారు. 2017–18లో కంపెనీ రూ.100 కోట్ల టర్నోవర్ సాధించింది. -
‘స్వచ్ఛభారత్ ప్రచారంలో బిగ్ బీ’
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడులకు సంబంధించి పనామా పేపర్స్‌లో పేరు రావడంతో ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమ ప్రచారంలో భాగం కాలేకపోయిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కేంద్రం మరో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చింది. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచారంలో పాలుపంచుకోవాలని అమితాబ్‌ను కోరుతూ కే ంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్20న లేఖ రాసింది. -
బిగ్‌బీ స్థానాన్ని పీసీ ఎగరేసుకుపోయిందా?
పనామా పేపర్స్‌లో పేరు కనిపించడంతో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోల్పోయిన స్థానాన్ని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఎగరేసుకుపోతోందట. ఇన్క్రెడిబుల్ ఇండియా (అతుల్య భారత్) బ్రాండ్ అంబాసిడర్‌గా మొదట్లో అమీర్‌ఖాన్ ఉండేవాడు. అయితే.. అసహనం గురించిన వ్యాఖ్యల కారణంగా ఆయన కాంట్రాక్టును కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ పొడిగించలేదు. తర్వాత అమితాబ్, ప్రియాంకల మధ్య దాని కోసం పోటీ ఏర్పడంది. కానీ, ఇటీవలే పనామా పేపర్స్‌లో అమితాబ్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని పెద్దాయన చెప్పినా, అంతర్జాతీయంగా భారత బ్రాండ్ ఇమేజికి ఇబ్బంది ఉండకూదదని పర్యాటక శాఖ భావించిందని సమాచారం. దానికితోడు.. ప్రియాంకా చోప్రా అయితే ఈమధ్య క్వాంటికో, బేవాచ్ లాంటి సీరియళ్లతో హాలీవుడ్‌కు కూడా వెళ్లింది కాబట్టి ఆమె అయితే బాగుంటుందని అందరూ అనుకున్నారట. దాంతో అమ్మడి పేరు దాదాపుగా ఖాయం చేసినట్లేనని చెబుతున్నారు. ప్రియాంకను ఈ కార్యక్రమానికి ప్రతినిధిగా చూపిస్తే.. భారతదేశం మహిళలకు అంత సురక్షితం కాదన్న ప్రచారాన్ని ఖండించడానికి కూడా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. వీటన్నింటి గురించి ప్రచారం జరుగుతున్నా... అసలు అమితాబ్ పేరును పక్కకు పెట్టినట్లు, ప్రియాంకను తెరమీదకు తీసుకొచ్చినట్లు వస్తున్న వాదనలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ఖండించారు. -
పనామా ఎఫెక్ట్: 'బ్రాండ్' నుంచి బిగ్ బీ ఔట్!
ముంబై/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటిరెండు దేశాల్లో ప్రభుత్వాలను సైతం కూలదోసింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం. ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అయితే ఆ వార్తలను ఖండించిన అమితాబ్ 'నా పేరును తప్పుగా వాడి ఉంటారు' అని ప్రకటించారు. అంతటితో సమస్య సమసిపోలేదు.. పనామా పేపర్లలో పేరు వెల్లడయినందుకు అమితాబ్ బచ్చన్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారా? తప్పుచేయలేదన్నబింగ్ బీ ప్రకటనతో కేంద్రప్రభుత్వం సంతృప్తి చెందలేదా? అందుకే ఆయనను ఇంకా చేపట్టని ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా కోల్పోనున్నారా? గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలివి. ఇంక్రెడిబుల్ బ్రాండ్ హోదాను అమితాబ్ కు కట్టబెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని, మరో సెలబ్రిటీని ఆ హోదాలో నియమించనుందని పలు సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. వీటిపై బిగ్ బీ కూడా ఘాటుగానే స్పందించారు. 'నిజానికి ఆ హోదా (ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్అంబాసిడర్)లో కొనసాగమని నాన్నెవరూ సంప్రదించలేదు. అంబాసిడరేకాని నన్ను ఆ హోదా నుంచి తొలిగించారని మీడియాలో వార్తలు రావటం విడ్డూరం'అని అమితాబ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా ఊహాగాలు విన్నతర్వాత స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకట చేస్తున్నట్లు బచ్చన పేర్కొన్నారు. పనామా పేపర్ల వ్యవహారంపై స్పందిస్తూ తాను నేరం చేసిందీ లేనిదీ తేల్చాల్సింది చట్టమేకాని, మీడియా కదని, ఏదో తప్పు జరిగినందువల్లే అమితాబ్ ను బ్రాండ్ హోదా నుంచి తొలిగించారని ప్రచారం చేయటం సరికాదన్నారు. విదేశీ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారానికి మొదట్లో ఆమిర్ ఖాన్ అంబాసిడర్ గా ఉన్నారు. అసహనంపై వ్యాఖ్యల అనంతరం ఆమిర్ ను తప్పించిన కేంద్ర ఆ హోదాను అమితాబ్ కు కట్టబెట్టాలనుకుంది. అయితే అధికారికంగా తుదినిర్ణయం ఇంకావెలువడాల్సిఉంది. అంతలోనే పనామా పేపర్లలో బిగ్ బితోపాటు ఆయన కోడలు ఐశ్వర్య పేరు వెలుగులోకి రావటంతో కేంద్రం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. -
ఇక ఆమిర్ స్థానంలో బిగ్ బీ, ప్రియాంక!
న్యూఢిల్లీ: నెలరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు కొత్త బ్రాండ్ అంబాసిడర్లను కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఇక 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. వీరిద్దరినీ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు తెలుస్తున్నది. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా' ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా ఈ ప్రచారానికి ముఖచిత్రంలా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ సేవలందించారు. అయితే ఇటీవల మత అసహనంపై ఆమిర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. దీంతో 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన కాంట్రాక్ట్‌ను కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇక భారత పర్యాటక రంగానికి ప్రచార సారథులుగా అమితాబ్, ప్రియాంక ప్రాచుర్యం కల్పించనున్నారు. -
'ఆయనను దేశద్రోహి అనలేదు'
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌ను 'దేశద్రోహి' అని తాను అనలేదని, అయినప్పటికీ తాను ఆ మాట అన్నట్టు పలు పత్రికలు ప్రచురించాయని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శనివారం వివరణ ఇచ్చారు. 'పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో నేను ఏం చెప్పానన్నది రహస్యం. స్థాయీ సంఘంలో చేసే వ్యాఖ్యలు బయటకు వెల్లడించడం చట్టవిరుద్ధమవుతుంది. ఆమిర్‌ను ఉద్దేశించి నేను 'దేశద్రోహి' అన్న పదాన్ని ఉపయోగించలేదు. నా జీవితం మొత్తంలో ఆయన గురించి అలాంటి మాట అనలేను. అయినా పరువును దెబ్బతీసేందుకు అలాంటి వ్యాఖ్యలను ప్రతికలు ప్రచురించాయి. అసత్యాలను ప్రచురించినందుకు వాటికి నోటీసులు ఇస్తాను' అని మనోజ్ తివారి పేర్కొన్నారు. ఆమిర్‌ఖాన్‌ను 'ఇన్క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించడాన్ని తప్పుబడుతూ పర్యాటకంపై పార్లమెంటు స్థాయీ సంఘం శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆమిర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన మనోజ్ తివారి ఆమిర్ 'ఇన్క్రెడిబుల్ ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండరాదని మాత్రమే తాను పేర్కొన్నానని చెప్పారు. అసహనం వివాదం నేపథ్యంలో భారత్ సురక్షిత దేశం కాదని పేర్కొన్న ఆయన దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సరికాదని తెలిపారు.