Akash Ambani Drives Red Ferrari SF90 Car On Mumbai Streets - Sakshi
Sakshi News home page

ఫెరారీ కారుతో ఆకాశ్‌ అంబానీ చక్కర్లు: దీని ధర ఎంతో తెలుసా? 

Published Fri, May 5 2023 8:11 PM | Last Updated on Fri, May 5 2023 8:31 PM

Akash Ambani Drives Red Ferrari SF90 Car On Mumbai Streets - Sakshi

సాక్షి, ముంబై:  రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, వ్యాపారవేత్త ఆకాశ్‌ అంబానీ ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు..  లగ్జరీ కార్లంటే ఇష్టపడే ఆకాశ్‌ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్‌ కార్లున్నాయి. ఖరీదైన, స్పోర్ట్స్‌ కార్లను డ్రైవ్‌ చేస్తూ  తరచుగా ముంబై మహానగరంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆకాశ్‌. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!)

స్వతహాగా ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు  ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో  డ్రైవింగ్‌  థ్రిల్‌ అనుభవించడం కూడా  చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్‌చల్‌  చేయడంలో ఫ్యాన్స్‌ దృష్టిలో పడింది.  ఆకాష్ అంబానీ తన  డ్రైవింగ్‌ నైపుణ్యంతో ఫెరారీ SF90ని  పరుగులు పెట్టించడం విశేషం. ఇన్‌స్టాలో ఆకాశ్‌ అంబానీ ఫ్యాన్‌ పేజీ రెడ్‌  ఫెరారీ  SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది.  ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు.   (బీమా పాలసీపై క్రెడిట్‌ కార్డ్‌ లోన్స్‌: ఇకపై ఇలా చేయలేరు!)

ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. నివేదికల ప్రకారం 'ప్రాన్సింగ్ హార్స్' లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది.  7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న  ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్‌ మెక్‌లారెన్ కారులో ఆకాశ్‌ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ  కారు ధర సుమారు రూ. 3.30 - 4.85 కోట్లు. మెక్‌లారెన్ కారులో ఫోల్డబుల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టాటిక్ అడాప్టివ్ హెడ్‌లైట్లు, వేరియబుల్ డ్రిఫ్ట్ కంట్రోల్, మెక్‌లారెన్ ట్రాక్ టెలిమెట్రీ ,కార్బన్-సిరామిక్ బ్రేక్‌ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి.  (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్‌ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్‌ ఎంతో తెలుసా? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement