ferrari car
-
ప్రపంచంలోని గ్రేటెస్ట్ సూపర్ కార్లు ఇవే (ఫోటోలు)
-
ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!
కొందరు కార్లు పిచ్చి, మరికొందరకి బైక్స్ పిచ్చి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్‌కి మాత్రం ఇవంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే డబ్బుల్ని దాచుకుంటాడో లేదో తెలీదు గానీ కొత్త కొత్త స్పోర్ట్స్ బైక్స్, కార్స్‌ని ఎప్పటికప్పుడు కొనేస్తుంటాడు. తాజాగా అలానే అత్యంత ఖరీదైన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారుని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఈ కారు స్పెషాలిటీ ఏంటి? రేటు ఎంత?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)అప్పట్లో తెలుగు డబ్బింగ్ సినిమాలతో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న అజిత్.. ఇప్పుడు పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు దాదాపు రూ.9 కోట్ల విలువ చేసే ఎరుపు రంగు ఫెర్రరీ ఎస్ఎఫ్ 90 కారుని కొనుగోలు చేశాడు!ఈ ఫెర్రారీ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. దీనితో పాటు అజిత్ కారు కలెక్షన్స్‌లో బీఎండబ్ల్యూ 740ఎల్ఐ, ఫెర్రారీ 458 ఇటాలియా, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 14ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, హోండా ఎకార్డ్ తదితర వెహికల్స్ ఉన్నాయి. వీటితో పాటు పలు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉండటం విశేషం.(ఇదీ చదవండి: ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?) View this post on Instagram A post shared by Actor Ajithkumar🔵 (@ajithkumar_offll) -
అపరకుబేరుడు ముఖేశ్ అంబానీ లగ్జరీ కార్లు
-
ఇటాలియన్ బ్రాండ్ కారులో 'ఆకాష్ అంబానీ' - వీడియో
ముకేశ్ అంబానీ ఫ్యామిలీ గతంలో చాలాసార్లు ఖరీదైన అన్యదేశ్య కార్లలో కనిపించారు. తాజాగా మరోసారి ఆకాష్ అంబానీ రూ. 10.5 కోట్ల కారును డ్రైవ్ చేస్తూ అగుపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆకాష్ అంబానీ ఇటీవల ముంబైలో ఫెరారీ పురోసాంగ్యూ (Ferrari Purosangue) కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఓ వీడియోలు వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే జియో గ్యారేజ్‌లో ఓ ఫెరారీ పురోసాంగ్యూ కారు ఉంది. కాగా ఇది రెండో ఫెరారీ పురోసాంగ్యూ అని తెలుస్తోంది. ఎరుపురంగులో చూడచక్కగా ఉన్న ఈ ఖరీదైన కారును ఆకాష్ అంబానీ స్వయంగా డ్రైవ్ చేయడం వీడియోలో చూడవచ్చు.ఆకాష్ అంబానీ డ్రైవ్ చేస్తూ కనిపించిన ఫెరారీ పురోసాంగ్యూ 4 డోర్స్ వెర్షన్. ఇది పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. కాబట్టి బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. ఈ కారు 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 725 పీఎస్ పవర్, 716 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్‌లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్‌కార్, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
తప్పు చేసింది కాక.. పోలీసు కాలుపైకి ఎక్కిస్తాడా?
-
ముఖేష్ అంబానీ నయా సూపర్ కారు - ధర ఎంతంటే?
ప్రముఖ వ్యాపారవేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తి 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) ప్రపంచంలో ఖరీదైన నివాసాల్లో ఒకటైన యాంటిలియాలో నివసిస్తూ.. ఖరీదైన కార్లను ఉపయోగించే ఈయన ఇటీవల మరో సూపర్ కారుని కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన కొత్త కారు ఫెరారీ కంపెనీకి చెందిన రోమా. దీని ధర రూ. 4.5 కోట్లు అని తెలుస్తోంది. ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే లెక్కకు మించిన ఖరీదైన కార్లున్న అంబానీ గ్యారేజీకి మరో సూపర్ కారు చేరిపోయింది. అంబానీ కుటుంబ సభ్యుల కాన్వాయ్‌లో మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63లు, రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు, రోల్స్ రాయిస్ కల్లినన్ ఖరీదైన ఎన్నో కార్లు ఉన్నాయి. ముకేశ్ అంబానీ కార్ల ధర వందల కోట్లు ఉంటుందని సమాచారం. ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 ఇంజిన్ కలిగి 690 పీఎస్ పవర్, 760 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2021లో ప్రారంభమైన ఈ కారు మొదటి నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను ఆకర్శించింది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ కారుని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో కారు కొనడం కష్టమేనా.. పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు ముఖేష్ అంబానీ గ్యారేజిలో సూపర్ కార్ల జాబితాలో ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెక్లారెన్ 570S, లంబోర్ఘిని అవెంటడోర్ S రోడ్‌స్టర్, ఫెరారీ 488 GTB, ఫెరారీ పోర్టోఫినో, ఆస్టన్ మార్టిన్ DB11 వంటి కార్లు ఉన్నాయి. కాగా తాజాగా ఇప్పుడు ఫెరారీ రోమా సూపర్ కారు లిస్ట్‌లో చేరింది. -
కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?
టాలీవుడ్లో పలువురు హీరోల దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో మెగాహీరో రామ్ చరణ్ కచ్చితంగా ఉంటాడు. మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం లేటు. దాన్ని తన గ్యారేజీలోకి తెచ్చేస్తుంటాడు. ఇప్పుడు అలానే ఓ ఖరీదైన కారులో డ్రైవ్ చేస్తూ కనిపించాడు. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అదికాస్త వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే పాతిక లక్షలడిగారు: బిగ్ బాస్ సన్నీ) మెగా పవర్‌స్టార్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతుందో లేదో తెలీదు గానీ చరణ్ అయితే హైదరాబాద్ లోనే ఉన్నాడు. తాజాగా కొన్నాళ్ల క్రితం కొన్న ఫెర్రారీ కారు తీసుకుని డ్రైవ్ కి వెళ్లాడు. తిరిగి ఇంట్లోకి వెళ్తున్న టైంలో ఒకరు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సదరు ఫెర్రారీ కారు, దాని కాస్ట్.. మరోసారి డిస్కషన్‌లోకి వచ్చింది. చరణ్ దగ్గరున్న ఫెర్రారీ కారు ఖరీదు దాదాపు రూ.మూడున్నర కోట్లు అని అంటున్నారు. దీనితో పాటు మరో అరడజను కార్లు కూడా చరణ్ దగ్గరున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి ఖరీదు ఏంటనేది కింద లిస్ట్ ఉంది చూసేయండి. రామ్ చరణ్ కార్స్ కలెక్షన్ రోల్స్ రాయిస్ ఫాంటూమ్ — రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 - రూ.4 కోట్లు ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ వీ8 - రూ. 3.2 కోట్లు ఫెర్రారీ ఫోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ - రూ 1.75 కోట్లు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 450 ఏఎమ్‌జీ కూప్ - రూ. కోటి (ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?) View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) -
తుక్కు రేసింగ్ కారుకు వేలంలో రూ.15 కోట్లు
కాలిఫోర్నియా: 1960వ దశకంలో రేసింగ్‌లో పాల్గొంటుండగా మంటల్లో చిక్కుకొని తుక్కుగా మారిన ఫెరారీ కారు తాజాగా వేలంలో రూ.15 కోట్ల(1.8 మిలియన్ డాలర్లు) ధర పలికింది. ఈ ‘ఫెరారీ 500 మాండియార్ స్పైడర్ సిరీస్–1’ కారును 1954లో తయారు చేశారు. ప్రముఖ ఇటాలియన్ రేసర్ అల్బర్టో అస్కరీ 1952, 1953లో ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ దీన్ని తయారు చేసింది. రేసింగ్ డ్రైవర్ ఫ్రాంకో కోర్టెస్ 1954లో కారును కొనుగోలు చేశాడు. అనంతరం 1958లో ఇది అమెరికాకు చేరుకుంది. 1960లలో ఓ రేసులో ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయింది. 1978 వరకూ పలువురి చేతులు మారుతూ వచి్చంది. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉన్న ఈ కారును ఓ వ్యక్తి కొనుగోలు చేసి, దాదాపు 45 ఏళ్లపాటు అలాగే కాపాడుతూ వచ్చాడు. ఇటీవల ఆర్ఎం సోథ్‌బీ సంస్థ ఈ కారును వేలం వేసింది. ఏకంగా రూ.15 కోట్లు పలికింది. కారును బాగుచేసి, మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై తీసుకొస్తానని దాన్ని కొనుక్కున్న వ్యక్తి చెప్పాడు. -
ఖరీదైన ఫెరారీ కారుతో ఆకాశ్ అంబానీ చక్కర్లు: దీని ధర ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు, వ్యాపారవేత్త ఆకాశ్ అంబానీ ఖరీదైన కారుతో ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టాడు.. లగ్జరీ కార్లంటే ఇష్టపడే ఆకాశ్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లతో పాటు వరల్డ్‌లోనే లావిష్ కార్లున్నాయి. ఖరీదైన, స్పోర్ట్స్ కార్లను డ్రైవ్ చేస్తూ తరచుగా ముంబై మహానగరంలో దర్శనమిస్తూ ఉంటాడు ఆకాశ్. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) స్వతహాగా ఖరీదైన కార్ల ప్రేమికుడైన ఆకాశ్‌కు ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడమే కాదు ముంబై వీధుల్లో డ్రైవింగ్ థ్రిల్ అనుభవించడం కూడా చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఎరుపు రంగు ఫెరారీ కారులో హల్చల్ చేయడంలో ఫ్యాన్స్ దృష్టిలో పడింది. ఆకాష్ అంబానీ తన డ్రైవింగ్ నైపుణ్యంతో ఫెరారీ SF90ని పరుగులు పెట్టించడం విశేషం. ఇన్‌స్టాలో ఆకాశ్ అంబానీ ఫ్యాన్ పేజీ రెడ్ ఫెరారీ SF90ని నడుపుతున్న వీడియోను షేర్ చేసింది. ఫ్రంట్ సీట్ లో కూర్చుని వైట్ కలర్ టీ షర్ట్ లో దర్జాగా కనిపించాడు. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) ఫెరారీ SF90 ధర రూ. 7.50 కోట్లు. నివేదికల ప్రకారం 'ప్రాన్సింగ్ హార్స్' లోగో ఉన్న ఈ కారును భారతదేశంలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ కారు ఉంది. 7.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉన్న ఈకారుకు ఇది కారుకు 26 km (16 mi) రేంజ్‌ను అందిస్తుంది. ఇటీవల ఎల్లో కలర్ మెక్లారెన్ కారులో ఆకాశ్ అంబానీ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈ కారు ధర సుమారు రూ. 3.30 - 4.85 కోట్లు. మెక్లారెన్ కారులో ఫోల్డబుల్ డ్రైవర్ డిస్ప్లే, స్టాటిక్ అడాప్టివ్ హెడ్లైట్లు, వేరియబుల్ డ్రిఫ్ట్ కంట్రోల్, మెక్లారెన్ ట్రాక్ టెలిమెట్రీ ,కార్బన్-సిరామిక్ బ్రేక్ లాంటి ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా అజయ్ బంగా: ఆయన వేతనం, నెట్‌వర్త్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Akash Mukesh Ambani (@akashambani_fc) -
జొమాటో సిఈవో కొత్త కారు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన, విలాసవంతమైన కార్లను కొనుగోలు చేస్తారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జొమాటో సిఈవో, వ్యవస్థాపకుడు 'దీపిందర్ గోయల్' ఇటీవల అత్యంత ఖరీదైన 'ఫెరారీ రోమా' కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వెల్లడైన కొన్ని ఫోటోల ప్రకారం, ఈయన కొనుగోలు చేసిన కారు హర్యానాలోని గురుగ్రామ్ రోడ్లపై తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఇది రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఫెరారీ కంపెనీ 2021లో రోమా కారుని ప్రారంభించింది. అయితే ఇది భారతదేశంలో కొంతమంది ధనవంతుల వద్ద మాత్రమే ఉంది. దీనికి కారణం ఈ కారు ధర ఎక్కువగా ఉండటమే. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్లతో స్లిమ్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. అంతే కాకుండా క్వాడ్-ఎగ్జాస్ట్ సెటప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ స్పాయిలర్ కూడా ఇందులో ఉన్నాయి. (ఇదీ చదవండి: బజాజ్ ప్రేమికుల కోసం చేతక్ ప్రీమియం ఎడిషన్.. ధర, రేంజ్ వివరాలు) ఫెరారీ రోమా క్యాబిన్, డ్రైవర్, కో డ్రైవర్ సీటు కూడా భిన్నంగా ఉంటాయి. సెంటర్ కన్సోల్‌లో 8.4 ఇంచెస్ టాబ్లెట్-స్టైల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బటన్లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఇందులో అమర్చబడి ఉంటాయి. ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ వద్ద ఫెరారీ రోమాతో పాటు లంబోర్ఘిని ఉరస్, పోర్షే 911 కారెరా వంటి సూపర్ కార్లు కూడా ఉన్నాయి. -
‘ఆదిపురుష్’ డైరెక్టర్‌కు లగ్జరీ ఫెరారీ కారు బహుమతి, ఎవరిచ్చారంటే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు చర్చించుకుంటున్న సినిమా ఆదిపురుష్. ఇటీవల టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆదిపురుష్ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. టీజర్ అద్భుతమంటు పలువురు ప్రశంసిస్తుంటే ఇందులోని పాత్రలను చూపించిన తీరుపై రాజకీయ ప్రముఖులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఇది కార్టున్ చిత్రంలా ఉందంటూ ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేశారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓం రౌత్ ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నాడు. ఆది పురుష్ మూవీకి టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత భూషన్ కుమార్ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో(uber-luxurious Ferrari F8 Tributo) కారును కానుగా ఇచ్చాడు. దీని ధర రూ. 4.02 కోట్లు ఉంటుందని అంచనా. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్.. అయితే ఇది అప్పటికప్పుడు షో రూంలో తీసుకుంది కాదనీ, ముందుగానే భూషన్ కుమార్ తన పేరు మీద ఈ కారు బుక్ చేశాడని తెలుస్తుంది. చూస్తుంటే ఓం రౌత్‌కు ఈ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా బడా నిర్మాత అయిన భూషన్ కుమార్ ఇలా కాస్ట్లీ కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది విడుదలైన భూల్ భూలయా 2 సినిమా సక్సెస్ నేపథ్యంలో హీరో కార్తిక్ ఆర్యన్‌కు ఆయన రూ. 4.70 విలువ చేసే లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. -
ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయిన రూ.4 కోట్ల కారు
ప్రముఖ లగ్జరీ ఫెరారీ రోమా వి8 సూపర్ కారు డ్రైవర్ చేసిన నిర్వహకం వల్ల అది ఇటాలియన్ సందుల్లో ఇరుక్కుపోయింది. ఆ కారు తాను హీరో అనుకున్నడెమో సినిమాలో చూపించినట్లు సందులో నుంచి రూ.4 కోట్ల విలువైన కారును తీసుకోని వెళ్లాలని ప్రయత్నించాడు. అయితే, అది అనుకోకుండా ఆ సందులో ఇరుక్కొని పోయింది. చివరకు ఆ కారును ఆ సందులో నుంచి తీసుకోని వచ్చాడా? లేదా అనేది అస్పష్టంగా ఉంది. యూట్యూబ్ వీడియోలో మాత్రం డ్రైవర్ ఇరుకైనా సందు నుంచి సూపర్ కారును బయటకు తీయడానికి చాలా కష్టపడటం మనం చూడవచ్చు. ఫెరారీ రోమా ఏమి చిన్న కారు కాదు. ఇది 183.3 అంగుళాల పొడవు, 77.7 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఈ సూపర్ కారు బరువు 1,472 కిలోలు. రూ.4 కోట్ల విలువైన కారు సందులో ఇరుక్కొని పోవడం వల్ల దానికి ఎంతో కొంత నష్టం వాటిల్లింది అనే విషయం వీడియోలో చూస్తే మనకు అర్ధం అవుతుంది. ఫెరారీ రోమాలో 4.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5,750 - 7,500 ఆర్ పీఎమ్ వద్ద 603 బిహెచ్ పీ పవర్, 3,000 - 5,750 ఆర్ పీఎమ్ వద్ద 760 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కారు 3.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫెరారీ రోమా కారును ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో విడుదల చేశారు. దీని ధర మన దేశంలో రూ.3.76 కోట్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. -
గోల్డెన్ ఫెరారీ వీడియో చక్కర్లు, ఆనంద్ మహీంద్ర అసహనం
సాక్షి,ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. సాధారణంగా చలోక్తులు, ఆసక్తికర విషయాలు, విజ్ఞాన దాయక విషయాలనే సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నంగా ఆయన చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తరుచూ ఆటో మొబైల్ పరిశ్రమలోని నూతన ఆవిష్కరణలపై స్పందించే ఆనంద్ మహీంద్రఅతి ఖరీదైన గోల్డెన్ ఫెరారీపై మాత్రం అసహనం వ్యక్తం చేశారు. హంగూ, ఆర్భాటాలతో లగ్జరీ కారు ఓనరు హడావిడి, జనాల క్రేజ్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వీడియోలను ఎందుకు చూస్తున్నారో తెలియదు, డబ్బును ఎలా ఖర్చుచేయకూడదో నెర్పే విషయం అయితే తప్ప అని వ్యాఖ్యానించారు. సంపద ఉంటే ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటివి సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతాయో అర్థం కాదంటూ విసుగు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కమెంట్లు కూడా చేశారు. ఆనంద్ మహీంద్రా ఆటోమొబైల్స్ ప్రపంచంలో వివిధ పరిణామాలపై తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల గ్రీన్ మొబిలిటీకి తన మద్దతు అంటూ రాబోయే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ట్విట్ చేశారు. వాస్తవానికి పూర్తిగా బంగారు పూత పూసిన ఈ వీడియో 2017లో తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. సౌదీ నంబరు ప్లేట్‌తో ఈ కారు నిజమైన యజమాని ఎవరు, అసలు యజమాని నుండి ఈ కారును ఇండో-అమెరికన్ కొనుగోలు చేశారా అనేది స్పష్టత లేదు. కాగా ఇటలీకి చెందిన కార్ల కంపెనీ ఫెరారి అత్యంత విలువ గల కార్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. I don’t know why this is going around on social media unless it is a lesson on how NOT to spend your money when you are wealthy… pic.twitter.com/0cpDRSZpnI — anand mahindra (@anandmahindra) July 19, 2021 -
కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా
వాషింగ్టన్: కరోనా ముప్పేట దాడితో అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కోట్లాది మందిపై కరోనా ప్రభావం తీవ్రంగా చూపింది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఓ యువకుడికి ఉపాధి అవకాశం పోయింది. నిరుద్యోగిగా మారిపోయాడు. అయితే కరోనా వలన నష్టపోయిన వారికి అక్కడి ప్రభుత్వం ప్రోత్సహాకాలు, రుణాలు తదితర సౌకర్యాలు కల్పించి వారు తిరిగి స్థిరపడేలా అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ యువకుడు విలాసవంత జీవితానికి అలవాటు పడ్డాడు. కరోనా లోన్లు తీసుకుని ఏకంగా ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన యువకుడు ముస్తఫా ఖాద్రీ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయాడు. అయితే ప్రభుత్వం చిన్న వ్యాపారులకు సహాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని పొంది ముస్తఫా విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. ఏకంగా 50 లక్షల కోవిడ్ సహాయ నిధిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాడు. తనకు ఒక కంపెనీ ఉందని.. కరోనా వలన నష్టపోయినట్లు సహాయం కోసం దరఖాస్తు పంపాడు. ఆ దరఖాస్తులకు సమర్పించివన్నీ నకిలీవే. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పే చెక్ ప్రొటెక్షన్’ కార్యక్రమంతో ముస్తఫా లబ్ధి పొందాడు. బ్యాంక్‌లకు వెళ్లి లక్షల రూపాయల రుణం పొందాడు. నకిలీ చెక్కులు, ఐటీ రిటర్న్‌లు సమర్పించి మూడు బ్యాంకులను మోసగించాడు. దీనిపై ఫిర్యాదు రాగా పోలీసులు విచారణ చేపట్టారు. తీరా అతడి వద్దకు వెళ్లగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ముస్తఫా వద్ద ఖరీదైన లంబోర్గిని, ఫెరారీ కార్లు కనిపించాయి. విచారణ చేపట్టగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో ఆ కార్లు కొనుగోలు చేశాడని తెలిసి అవాక్కయ్యారు. ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న కార్లు, బ్యాంక్ ఖాతాలో ఉన్న 20 లక్షల డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: తుపాకీకి భయపడి బిల్డింగ్ దూకిన చిన్నారులు తెలంగాణతో పాటు లాక్డౌన్ విధించిన రాష్ట్రాలు ఇవే! -
ఫెరారీకి ఏమైంది...
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్‌లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్‌తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం 2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్‌లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్‌కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్‌లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పని చేయని అప్‌గ్రేడ్స్ చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్‌గ్రేడ్స్‌తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్‌గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుంది 2019 సీజన్ కారు అయినటువంటి ఎస్ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్‌లో మెర్సిడెస్, రెడ్‌బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు. -
ఆ బుక్ రేటు.. జస్ట్ రూ.20 లక్షలే!
చరిత్ర ఎంత కాస్ట్లీయో తెలియాలంటే.. ముందు ఫెరారీ గురించి తెలియాలి. ఫెరారీ.. ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్.. రేట్లు అదిరిపోతాయ్.. మనం కొనలేం.. అయితే.. కారే కాదు.. ఆ కారు గురించి రాసిన పుస్తకాన్ని కూడా కొనలేం. ఎందుకంటే.. ఈ మధ్య ఆ కార్ల చరిత్రను తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని ముద్రించారు. దాని రేటెంతో తెలుసా? జస్ట్.. రూ.20 లక్షలే.. 514 పేజీలుండే ఆ పుస్తకాన్ని ఉంచిన స్టాండ్.. చూడ్డానికి ఫెరారీ 12 సిలెండర్ల ఇంజిన్‌లా ఉంటుంది. స్టీల్‌పై క్రోమియం పూత వేసి తయారుచేశారు. అల్యూమినియం పెట్టెలో ఉంచారు. ఇందులో ఫెరారీకి సంబంధించిన అరుదైన చిత్రాలు ఉన్నాయట. ఈ బుక్ స్టాండ్‌ను డిజైనర్ మార్క్ న్యూసన్ రూపొందించారు. మొత్తం 1,947 పుస్తకాలను ముద్రించారు. అందులో 250 పుస్తకాలను ఒక్కోటి రూ.20 లక్షల చొప్పున విక్రయిస్తారు. అదీ కూడా డబ్బున్న ప్రతి ఒక్కళ్లకూ అమ్మేయరు. మ్యూజియంలకు, ఫెరారీ కార్లను ఎక్కువగా కొనే వినియోగదారులకు అమ్ముతారు. మరి మిగిలిన 1,697 పుస్తకాల సంగతేంటనేగా మీ ప్రశ్న.. వీటిని అమ్మడానికి ఇలాంటి షరతులేవీ లేవు. ఎవరికైనా అమ్ముతారు. వాటి ధర రూ.4.1 లక్షలు.. అయితే.. ఆ డిజైనర్ స్టాండ్‌లాంటి అదనపు హంగులు ఉండవట. ఇంతకీ ఈ పుస్తకం పేరు చెప్పలేదు కదూ.. వేరేది పెడితే బాగుండదని.. ‘ఫెరారీ’అనే పెట్టేశారు. -
ఫెరారీ ఎట్ 180 కోట్లు
ఇది ఫెరారీ 375 ప్లస్ మోడల్ కారు. 1950ల్లో తయారుచేశారు. అప్పటి మోటారు రేసుల్లో ఇది కింగ్ అట. పైగా.. ఈ మోడల్ కార్లను ఐదు మాత్రమే తయారుచేశారట. అందుకేనేమో.. శుక్రవారం బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీన్ని వేలం వేసినప్పుడు ఏకంగా రూ.180 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా బ్రిటన్‌లో ఇప్పటివరకూ వేలం వేసిన అత్యంత ఖరీదైన కార్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో 1954 నాటి మెర్సిడెజ్ బెంజ్ కారు ఒకటి రూ.190 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఫెరారీ కారు జోరు కూడా కాసింత ఎక్కువే. గంటకు అత్యధికంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.